Telangana News: మృత్యువు పగబట్టింది.. మగదిక్కు లేకుండా మారిన కుటుంబం.. అసలేమైదంటే..

ప్రతీకాత్మక చిత్రం

Crime News: రెక్కాడితే గాని డొక్కాడని పేదరికం. ఇల్లు తప్ప సెంటు భూమి కూడా లేదు. అలాంటి కుటుంబాన్ని దయ లేని విధి పగబట్టింది.. ఒకరి తర్వాత ఒకరిపై మృత్యువు రూపంలో దాడి చేసి ఏడాది కాలంలోనే నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. ఇంట్లో మగవాళ్లే లేకుండా చేసి కుటుంబాన్ని వీధిపాలు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  (సయ్యద్ రఫీ, మహబూబ్ నగర్ జిల్లా, న్యూస్18 తెలుగు) 

  రెక్కాడితే గాని డొక్కాడని పేదరికం. ఇల్లు తప్ప సెంటు భూమి కూడా లేదు. అలాంటి కుటుంబాన్ని దయ లేని విధి పగబట్టింది.. ఒకరి తర్వాత ఒకరిపై మృత్యువు రూపంలో దాడి చేసి ఏడాది కాలంలోనే నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. ఇంట్లో మగవాళ్లే లేకుండా చేసి కుటుంబాన్ని వీధిపాలు చేసింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన బాలయ్యగౌడ్‌, శివకుమార్‌గౌడ్‌ కుటుంబం దయనీయ పరిస్థితిది. వివరాలు ఇలా ఉన్నాయి. బిజినేపల్లి మండలం వట్టెం గ్రామానికి చెందిన అంకి బాలయ్యగౌడ్‌(70) దినసరి కూలీ. అతడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు బాలరాజ్‌గౌడ్‌(40) జోగులాంబ జిల్లాలోని గద్వాల పురపాలికలో అటెండర్‌గా పనిచేసేవాడు.

  అతడు దివ్యాంగుడు కాగా వివాహం కాలేదు. చిన్న కుమారుడు శివకుమార్‌గౌడ్‌(35) ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరి ఇంట్లో శివకుమార్‌గౌడ్‌ కుమారుడు పండు(01) ఏడాది కిందట అనారోగ్యంతో మరణించటంతో కుటుంబానికి కష్టకాలం ప్రారంభమైంది. ఈ బాధ మరవక ముందే బాలరాజ్‌ కరోనా మహమ్మారి బారినపడ్డాడు. ఆరు నెలల కిందట కన్నుమూశాడు. బాలరాజ్‌ ప్రభుత్వ ఉద్యోగి కావటంతో కారుణ్య నియామకం కింద అవకాశం కల్పించాలని అతడి సోదరుడు శివకుమార్‌ ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే అధికారులకు వివిధ పత్రాలు సమర్పించేందుకు శివకుమార్‌ తండ్రి బాలయ్యగౌడ్‌ని వెంట బెట్టుకొని ద్విచక్రవాహనంపై గద్వాలకు బయలుదేరాడు. బిజినేపల్లికి చేరుకోగానే ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం, వీరి ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో తలలకు తీవ్ర గాయాలైన తండ్రీకొడుకులు బాలయ్య, శివకుమార్‌ అక్కడికక్కడే మృతిచెందారు.

  Read Also:  కొన్ని సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నారు.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. ఆమె మోజు మాత్రం పక్కింటి యువకుడిపై పడింది.. చివరకు

  మరో ద్విచక్రవాహనంపై ఉన్న బిజినేపల్లి మండలం వెంకటాపూర్‌కి చెందిన వినోద్‌, కోడేరు మండలం తుర్కపల్లికి చెందిన రాఘవేందర్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. మొదట నాగర్కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తర్వాత హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. శివకుమార్ భార్య ప్రస్తుతం 8 నెలల గర్భిణీ. ఇప్పుడు ఆమె కు నాలుగేళ్ల కుమార్తె, ఆడపడుచు మాత్రమే కుటుంబంలో మిగిలారు. నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వపరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
  Published by:Veera Babu
  First published: