Yoga on Road: నడిరోడ్డుపై యోగాసనాలు వేసిన చిన్నది.. ఎందుకో తెలుసా..?

మందేసి రోడ్డుపై యోగా ఆసనాలు

ఓ యువతి రాత్రి 11 గంటల సమయంలో నడి రోడ్డుపై హంగామా చేసింది. అది కూడా యోగాసనాలు వేస్తూ అందరి చూపు తనవైపు పడేలా చేసింది. అక్కడి నుంచి కదలమని చెబితే.. తనపై నుంచి వెళ్లాలి అంటూ సవాల్ చేసింది... ఎందుకో తెలుసా..?

  • Share this:
    Yoga on Road: ఓ యువతి నడి రోడ్డుపై.. అది కూడా రాత్రి వేళలో యోగాసనాలు వేసింది. అటుగా వెళ్తున్నవారిని ఫుల్ ఎంటర్ టైన్ చేసింది.. వివిధ భంగిమల్లో ఆ యువతి వేసిన యోగసనాలు చూసేందుకు భారీగా జనం గుమిగూడడంతో కాసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. సాధారణంగా మందేసినోళ్ల వేషాలు ఎలా ఉంటాయో చాలా మందికి తెలుసు. ఒకడు తూలుకుంటూ వెళుతుంటే.. మరోకడు ఇంకో రకంగా వ్యవహరిస్తుంటాడు. కొందరు గాన గంధర్వులైతే .. ఇంకోందరు ఎదుటివాళ్లమీద చిందులేస్తారు. మరికొందరైతే ఏబీసీడీలు రాకపోయినా ఇంగ్లీష్ లో మాట్లాడేస్తారు. కానీ పూణే లో ఒక యువతి మాత్రం మందేసి రోడ్డుమీద యోగాసనాలు వేయటం మొదలెట్టింది. అక్కడ నుంచి లేచి వెళ్లమని ఎంతమంది చెప్పినా ఆమె మాత్రం వెనక్కు తగ్గడం లేదు. అక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తే ఎదురుతిరిగింది. పోలీసులు వస్తే కాని ఆమె అక్కడి నుంచి కదల్లేదు.

    మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో పూణే లోని తిలక్ రోడ్డు హీరాబాగ్ చౌక్ దగ్గర ఓ మహిళ రోడ్డుపై కూర్చుని వివిధ భంగిమల్లో యోగాసనాలు వేయటం మొదలెట్టింది. ఆ సమయంలో ట్రాఫిక్ కు స్వల్ప అంతరాయం ఏర్పడింది. మహిళ మద్యం సేవించిందని తెలుసుకున్న స్ధానికులు స్వర్గేట్ పోలీసు స్టేషన్ కు ఫిర్యాదు చేశారు.

    కొంతమంది ఆ వీడియోలను తీసి నెట్ లో పెట్టడంతో వైరల్ గా మారాయి. దీంతో ఆమె యోగసానాలు చూసి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. లిక్కరేశాక నడిచి వెళ్తే ఏం కిక్కు.. అందుకే ఇలా వెరైటీగా ట్రై చేయాలి. అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇక మరో నెటిజన్‌ ఆమె మందేసిందో.. మాససిక స్థితి బాగోలేదో.. చూడండయ్యా అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. http://



    ఆమె యోగాసనాలు వేస్తున్న సమయంలో రోడ్డుపై వాహనాల్లో వెళ్లే వారికి తీవ్ర  ఇబ్బందిగా మారింది. కొందరు అసహనంతో తప్పుకోమని హారన్ కొట్టినా ఆమె పక్కకు జరగలేదు. తిరిగి తనపై నుంచి వాహనాలను వెళ్ల నివ్వండి అంటూ సవాల్ విసిరింది.  దీంతో ఆమెను దాటి వెళ్లడం ఇబ్బందిగా మారింది. వైరల్ గా మారిన ఆ వీడియోలలో యువతి కోసం పూణె పోలీసులు గాలిస్తున్నారు.
    Published by:Nagesh Paina
    First published: