పూటుగా మద్యం తాగించి.. కత్తులతో దాడి చేసి.. పారిపోతుంటే కారు ఢీకొట్టి..

ఉదయ్‌కుమార్ రెడ్డికి పూల్లుగా మద్యం తాగించి కత్తితో పొడిచి హతమార్చేందుకు యత్నించారు. కానీ అప్రమత్తమైన ఉదయ్ కుమార్ రోడ్డువైపు పరుగు తీయడం మొదలుపెట్టాడు. కానీ వారు అంతటితో ఆగలేదు. ఉదయ్‌కుమార్ రెడ్డిని తరుమూతు కారుతో ఢీకొట్టి చంపేశారు.

news18-telugu
Updated: May 24, 2020, 7:09 PM IST
పూటుగా మద్యం తాగించి.. కత్తులతో దాడి చేసి.. పారిపోతుంటే కారు ఢీకొట్టి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ వ్యక్తిని విందు పేరుతో ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ పూటుగా మద్యం తాగించి కత్తులతో దాడి చేశారు. అప్రమత్తమైన ఆ వ్యక్తి పారిపోతుంటే.. కారుతో ఢీకొట్టి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సిద్ధిపేట జిల్లా తోగుట మండలం చందాపూర్ గ్రామానికి చెందిన ఉదయ్ కుమార్ రెడ్డి(35)కి యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక శివారులోని కాశీనగర్‌కు చెందిన సంధ్యను ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే వీరికి ఇద్దరు కొడుకులు. వీరు కొంతకాలం గజ్వేల్‌లో ఉండగా, ఏడాది క్రితం చందాపూర్‌కు మారారు. అయితే ఉదయ్ కుమార్‌రెడ్డి తొగుటలో రుషి ట్రేడర్స్, జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామంలో ఫర్టిలైజర్ దుకాణం నిర్వహిస్తు వస్తున్నాడు. దీంతో పాటు స్థానిక రైతుల కూరగాయలను హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి మార్కెట్‌లో అమ్ముతుంటాడు.

ఈ క్రమంలో శనివారం ఓ ఇద్దరు వ్యక్తులు అతడిని విందు పేరుతో కొమురవెళ్లి సమీపంలోని వేచరేణి,మర్రిముచ్చాల గ్రామ శివారుకు తీసుకొచ్చారు. అక్కడ ఉదయ్‌కుమార్ రెడ్డికి పూల్లుగా మద్యం తాగించి కత్తితో పొడిచి హతమార్చేందుకు యత్నించారు. కానీ అప్రమత్తమైన ఉదయ్ కుమార్ రోడ్డువైపు పరుగు తీయడం మొదలుపెట్టాడు. కానీ వారు అంతటితో ఆగలేదు. ఉదయ్‌కుమార్ రెడ్డిని తరుమూతు కారుతో ఢీకొట్టి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని ముళ్లపొదల్లో పడేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇందులో మ‌ృతుడి భార్య మేనత్త కొడుకు హస్తం ఉన్నట్టు సమాచారం.
Published by: Narsimha Badhini
First published: May 24, 2020, 7:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading