దంతవైద్యురాలి ఆత్మహత్య.. భర్త అలా చేయడంతోనే..

భర్త కుమార్ ఆస్పత్రికి వెళ్లగా, తాను బయట షాపింగ్‌కు వెళ్తున్నానని చెప్పి కుమార్తెను శ్వేత పక్కింటికి పంపించింది. మధ్యాహ్నా సమయంలో ఆస్పత్రి నుంచి భర్త కుమార్ వచ్చేసరికి ఇంటి తలుపులు మూసిఉన్నాయి.

news18-telugu
Updated: May 14, 2020, 12:58 PM IST
దంతవైద్యురాలి ఆత్మహత్య.. భర్త అలా చేయడంతోనే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భార్యభర్తలిద్దరూ వైద్యులు. వారికి ఓ కూతురు. హాయిగా బతికేందుకు ఈ మాత్రం చాలు. కానీ ఏమైందో ఏమోగానీ దంత వైద్యురాలు అయిన భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అదనపు కట్నం కోసం వేధించడం వల్లే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో బుధవారం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామానికి చెందిన అనంతుల నాగయ్య, పుష్ఫలత దంపతుల కుతూరు డాక్టర్ శ్వేత దంత వైద్యురాలు. శ్వేతను శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన పిల్లల వైద్యుడు బండారు కుమార్‌తో 2009 సంవత్సరంలో పెళ్లి చేశారు. మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డికాలనీలో అద్దెకు ఉంటున్నారు. అయితే కుమార్ మిర్యాలగూడలోని ప్రాంతీయ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. శ్వేత పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో స్టార్ ఆస్పత్రిని నిర్వహిస్తోంది. ఈ దంపతులకు 9 సంవత్సరాల పాప ఉంది. బుధవారం ఉదయం భర్త కుమార్ ఆస్పత్రికి వెళ్లగా, తాను బయట షాపింగ్‌కు వెళ్తున్నానని చెప్పి కుమార్తెను శ్వేత పక్కింటికి పంపించింది. మధ్యాహ్నా సమయంలో ఆస్పత్రి నుంచి భర్త కుమార్ వచ్చేసరికి ఇంటి తలుపులు మూసిఉన్నాయి. అయితే భార్యను ఎంత పిలిచినా స్పందించకపోవడంతో స్థానికుల సాయంతో తలుపులు తెరిచాడు. కాగా అప్పటికే శ్వేత చనిపోయి ఉంది. అయితే శ్వేత తల్లిదండ్రులు అదనపు కట్నం కోసం వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.
First published: May 14, 2020, 12:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading