Home /News /crime /

A COURT HAS SENTENCED A MAN TO LIFE IMPRISONMENT FOR ROBBING AND MURDERING A SINGLE WOMAN MAHBUBNAGAR MBNR PRV

Life imprisonment: ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకున్న వ్యక్తికి జీవిత ఖైదు విధించిన కోర్టు.. వివరాలివే..

దోషి శ్రీనివాసులు

దోషి శ్రీనివాసులు

అమాయక ఒంటరి మహిళలను లక్ష్యం గా చేసుకొని వారు ధరించే ఆభరణాలు కోసం మాయమాటలు చెప్పి  నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి  హత్యమార్చిన వ్యక్తికి గద్వాల మూడవ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది.

    అమాయక ఒంటరి మహిళలను (Single woman) లక్ష్యం గా చేసుకొని వారు ధరించే ఆభరణాలు కోసం మాయమాటలు చెప్పి  నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి  హత్యమార్చిన వ్యక్తికి గద్వాల మూడవ కోర్టు (Court) జీవిత ఖైదు (Life imprisonment) విధిస్తూ తీర్పు ఇచ్చింది. దేవరకద్ర ఎస్‌ఐ భగవంత్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు గండీడ్ గ్రామం,  బాలానగర్  మండలకి చెందిన నిందితుడు ఎరుకలి శ్రీనివాసులు (Srinivasulu) (47). గత కొన్ని సంవత్సరాలుగా మహబూబ్​నగర్​ (Mahbubnagar) జిల్లాలోని శివశక్తి నగర్ లో నివాసం ఉంటున్నాడు.  2019లో డిసెంబర్ 17న నవాబు పేట మండలం, కూచుర్ గ్రామానికి చెందిన చిట్టి అలివేలమ్మ ను మహబూబ్​నగర్లోని టీ.డీ గుట్ట ప్రాంతానికి చెందిన కల్లు దుకాణం దగ్గరకు వెళ్లగా ఆమెకు మాయమాటలు చెప్పి దేవరకద్ర మండలం, డోకూర్ గ్రామ శివారులోకి తీసుకెళ్లి  కళ్ళు తాగించి మత్తులోకి వెళ్లిన అనంతరం ఆమెను  హతమార్చాడు (Murder). అంతేకాకుండా ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను ఎత్తుకెళ్లాడు దుండగుడు.

    దోషి శ్రీనివాసులు


    కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు..

    అయితే పక్కా ఆధారాలతో పోలీసులు నిందితుడిని గుర్తించారు. దేవరకద్ర పోలీస్ స్టేషన్లో 176/2019 సెక్షన్ 302,379 కింద కేసు నమోదు చేసి నిందితుడుని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. నిందితుడికి 17 హత్య కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు ఎస్పీ వెంకటేశ్వర్లు ఆదేశానుసారం సిఐ రజితరెడ్డి, ఎస్ఐ భగవంత్ రెడ్డిలు సిబ్బంది సహకారంతో కోర్టులో సాక్ష్యాలను ప్రవేశపెట్టి  నిందితుడికి శిక్ష పడేలా చేశారు. ఈ కేసును విచారించిన గద్వాల్ 3వ కోర్టు  న్యాయమూర్తి శివకుమార్ నేరం రుజువు కావడంతో నిందితుడు జీవిత ఖైదుతో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ గురువారం తీర్పు ఇచ్చారు.

    కల్లు కాంపౌండ్లకు తాగడానికి వచ్చిన మహిళలే లక్ష్యంగా..

    2007లో సొంత తమ్ముడిని హత్య చేసి జైలుకు వెళ్ళాడు. జైలు నుండి బయటకు వచ్చాక.. రంగారెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల్లో కల్లు కాంపౌండ్ లకు తాగడానికి వచ్చిన మహిళలను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. తర్వాత పలుసార్లు జైలుకు వెళ్లి విడుదల అవుతూ వస్తున్నాడు.

    చివరిసారిగా 2018 ఆగస్టులో జైలు శిక్ష అనుభవించి బయటికి వచ్చిన తర్వాత అధికారులు అతనిలో మార్పు వస్తుందని జిల్లా జైలులోని పెట్రోల్ బంకులో ఉపాధి చూపించారు. సరిగా విధులకు హాజరు కాకపోవడంతో విధుల నుంచి తొలగించారు. జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తే మళ్లీ విధుల్లోకి చేర్చుకున్నారు. తర్వాత కూడా విధులకు సరిగా హాజరు కాలేదు. ఆ సమయంలోనే జిల్లాలోని మిడ్జిల్,, బూత్ పూర్, దేవరకద్ర, కొత్తకోట పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు హత్యలు చేశాడు.

    రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో టీఎస్ఎండీసీ ఇసుక యార్డులో ఒక మహిళ ఎముకల గూడు లభించింది. ఈ హత్యను ఎరుకలి శ్రీను చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇదే సమయంలో దేవరకద్ర హత్య బయటపడింది. అప్పటి ఎస్పీ రెమా రాజేశ్వరి ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి జీవిత ఖైదు పడిందని దేవరకద్ర ఎస్ఐ భగవంత రెడ్డి తెలిపారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Courts, Crime news, Mahbubnagar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు