Home /News /crime /

A CONSTABLE IN MEDAK THREATENED TO STAB HIMSELF TO DEATH IN FRONT OF A POLICE STATION AFTER HE WAS TRANSFERRED BY AUTHORITIES FOR NOT PAYING A BRIBE MDK PRV

Police in Medak: ఇదేమి పోలీసు రాజ్యం.. లంచం ఇవ్వడం లేదని వేరే పోలీస్​స్టేషన్​​కు బదిలీ చేసిన పై అధికారులు! భార్యా పిల్లలతో పోలీసు నిరసన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తనను ఆ కారణంగా బదిలీ చేశారంటూ ఆ కానిస్టేబుల్ పోలీసు ఏఆర్ హెడ్ క్వార్టర్ లో హల్ చల్ చేశాడు. ఉరేసుకుని చనిపోతానంటూ కుటుంబసభ్యులతో కలిసి బెదిరింపులకు పాల్పడ్డాడు.

    (News 18 ప్రతినిధి కె.వీరన్నమెదక్ జిల్లా)

    ‘‘మంచి పోలీస్ స్టేషన్ (Police station) లో విధులు నిర్వహించాలంటే ఆఫీసర్లకు డబ్బులు ఇవ్వాల్సిందే లేదనుకుంటే హెడ్ క్వార్టర్ లో ఉంచుతారు. కింది స్థాయి నుంచి మొదలు పెడితే పై స్థాయి వరకు డబ్బులు చెల్లిస్తేనే మంచి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తారు. కానిస్టేబుల్ కు నుంచి మొదలుకొని ఎస్ఐ, సీఐ, డీఎస్​పీ వరకు మొదలుకొని డబ్బులు (Bribe) చెల్లించాల్సిందే. స్థాయిని బట్టి ఒక రేటు ఉంటుంది. ఈ పోలీస్ శాఖ లో వారంకి ఒక్కసారి క్రైమ్ మీటింగ్ అని చెప్తూ ఆ మీటింగ్ లో ఎవరెవరు ఎంత టార్గెట్ చేశారని పై అధికారులు (Higher officials) వేధిస్తుంటారు’’. ఇదంతా చెబుతున్నది ఓ కానిస్టేబుల్​. తనను అకారణంగా బదిలీ చేశారంటూ ఆ కానిస్టేబుల్ (Constable) పోలీసు ఏఆర్ హెడ్ క్వార్టర్ లో హల్ చల్ చేశాడు. ఉరేసుకుని చనిపోతానంటూ( to stab himself to death) కుటుంబసభ్యులతో కలిసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇదంతా వీడియో (Video) తీసి స్నేహితులకు, తోటి పోలీసు సిబ్బందికి, మీడియాకు పంపించాడు. ఈ సంఘటన మెదక్ టౌన్ పోలీసుస్టేషన్ (Medak Town Police station) వెను కగా ఉన్న ఏఆర్ హెడ్ క్వార్టర్ వద్ద సోమవారం రాత్రి చోటుచేసుకున్నది.

    శివ్వంపేట ప్రాంతానికి చెందిన ఎం. నాజమ్ 2012లో పోలీసు కానిస్టేబుల్​గా ఎంపికయ్యాడు. సంగారెడ్డి, చేగుంట పోలీసు స్టేషన్లలో విధులు నిర్వహించాడు. 2019 జూలైలో తూప్రాన్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న నాజమ్ను ఈనెల 14న మెదక్ టౌన్ పోలీసు స్టేషన్ కు బదిలీ (Transfer) చేశారు. అయితే తనను అకారణంగా బదిలీ చేసినట్లు వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టాడు కానిస్టేబుల్​. దీంతో మెదక్  పోలీస్ స్టేషన్ లో జాయినింగ్ రిపోర్టు చేయలేదు. అధికారి లంచాలు తీసుకుంటున్నట్లు వాట్సాప్ గ్రూపుల్లో ఆరోపించాడు.

    ఒక పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ విధులు (Duties) నిర్వహించాలంటే పై అధికారికి ఎంతో కొంత డబ్బులు (Bribe) చెల్లించాలి లేదా వారిని అక్కడి నుండి హెడ్ క్వార్టర్ పంపుతారని అంటున్నాడు కానిస్టేబుల్​. ఇదే కోవలో కానిస్టేబుల్ను​ ఏఆర్ (ఆర్మ్ రిజర్వు) హెడ్ క్వార్టర్కు పంపించారు. ఏఆర్ హెడ్ క్వార్టర్లో అతను జాయినింగ్ అయినప్పటికీ విధులకు హాజరు కాలేదు. తానేమి తప్పు చేయకుండా పనిష్మెంట్​గా బదిలీ చేశారని ఆరోపిస్తూ మౌనదీక్ష చేపట్టేందుకు సిద్ధమయ్యాడు కానిస్టేబుల్. ఈ మేరకు అనుమతి కోసం మీసేవ కేంద్రంలో దరఖాస్తు కూడా చేసుకు న్నాడు. తోటి సిబ్బంది సముదాయించడంతో దీక్ష విరమించుకుని ఏఆర్ హెడ్ క్వార్టర్లో విధులకు హాజరయ్యాడు.

    తను మౌన దీక్షకు ప్రయత్నించిన విషయం బయటకు రావడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. సోమవారం రాత్రి నాజమ్​ను సస్పెండ్ చేస్తూ జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. విషయం తెలియగానే నాజమ్, భార్య పిల్లలతో కలిసి ఏఆర్ హెడ్ క్వార్టర్ వద్దకు వచ్చి హల్ చల్ చేశాడు. అధికారులు వేధింపులు తాళలేకనే చనిపోతున్నామంటూ వీడియోలు తీసి పలువురికి పంపించాడు. కొన్నిరోజులుగా అధికారుల వేధింపులు ఎక్కువ య్యాయని, అధికారుల పేర్లు చెబుతూ చనిపోతానంటు పేర్కొన్నాడు. అక్కడే ఉన్న పోలీసులు నాజమ్​కు నచ్చజెప్పారు. నాజమ్ విషయంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Medak, Police

    తదుపరి వార్తలు