Home /News /crime /

A CONSTABLE CHEATED HIS LOVER AND LEFT AND AFTER FEW YEARS HE RETURNS BACK AND CHEATED AGAIN BUT AT THAT TIME SHE ALREADY MARRIED PRV

Siddipeta: ప్రేమించాడు వదిలేశాడు.. యువతి పెళ్లి చేసుకుందని తెలిసి మళ్లీ వచ్చాడు.. వివాహితకు తాళి కట్టేశాడు.. మళ్లీ ట్విస్టిచ్చాడు..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

యువతిని ఓ పోలీసు ప్రేమించి వదిలేశాడు. మోసపోయానని గ్రహించి యువతి వివాహం చేసుకుంది. అయితే మళ్లీ వచ్చాడు కలిసుందామని చెప్పి తాళి కట్టేశాడు. ఇక యువతికి ఇక్కడే మరో రూపం చూపించాడు దుర్మార్గుడు.

    వారిద్దరూ మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. కలిసుంటామని బాసలు చేసుకున్నారు. అబ్బాయికి పోలీసు ఉద్యోగం కావడంతో అమ్మాయి కూడా సంతోషంగానే ఉంది. ఎలాగో కుటుంబ సభ్యులు కూడా ఒప్పేసుకుంటారని అతనితో కలిసి తిరిగింది. తీరా పెళ్లి విషయం ప్రస్తావించేసరికి అబ్బాయి ముఖం చాటేశాడు. ఎందుకిలా చేశావని నిలదీసింది. గుండె రాయి చేసుకుంది. కుటుంబ సభ్యులు చూసిన సంబంధం ఒప్పేసుకుంది. పెళ్లి కూడా చేసుకుంది. అయితే ఇక్కడే మరోసారి ఆ ఖాకీ (Police) వెంటపడ్డాడు. నువ్వంటే ఇష్టమన్నాడు. కలిసుందాం వచ్చేయ్​ అన్నాడు. మళ్లీ ఆ ఖాకీ మాయమాటలకు నమ్మిన వివాహిత (married woman) భర్తను వదిలేసి వచ్చేసింది. ఆ ఖాకీ వివాహిత మెడలో తాళి కూడా కట్టేశాడు. అయితే ఇక్కడే ఆ దుర్మార్గుడు మరో రూపం చూపించాడు. ఆ యువతిని మళ్లీ వదిలేశాడు. ఈ సంఘటన సిద్దిపేట (Siddipeta) జిల్లాలోని చిన్న కోడూర్ మండల పరిధిలోని రామునిపట్లలో బుధవారం చోటు చేసుకుంది.

    మూడేళ్లుగా ప్రేమిస్తున్నానంటూ..

    బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన పల్లె విద్యను చిన్న కోడూరు మండలం రామునిపట్ల గ్రామానికి చెందిన కానిస్టేబుల్ (Constable) యాసరేని సంతోష్ కుమార్ మూడేళ్లుగా ప్రేమిస్తున్నానంటూ నమ్మ బలికాడు. మాయమాటలు చెప్పి తనను లోబరుచుకున్నాడు. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని ఆమె నిలదీయగా మొహం చాటేశాడు.

    ఇది కూడా చదవండి: మద్యం తాగిన భర్త కిడ్నాప్​.. భర్త ప్రాణాల కోసం మానాన్ని పణంగా పెట్టిన ఇల్లాలు.. ఆ రాత్రి ఏం జరిగిందంటే..

    న్యాయం చేసే వరకు కదిలేది లేదని..

    ఏడాది క్రితం ఇంట్లో వారి అంగీకారం మేరకు మరో వ్యక్తితో వివాహం (marriage) జరిగింది. ఆ తర్వాత సైతం ఫోన్ లో రోజు చాటింగ్ (chatting) చేస్తూ.. తనను పెళ్లి చేసుకుంటానని.. తన వెంట రమ్మని నమ్మించాడు. అతని మాటలు నమ్మి ఇంటి నుంచి వెళ్లిన ఆమెను కరీంనగర్ లో ఒక అద్దె ఇంట్లో ఉంచాడు. ఆ సమయంలో ఆమెకు మంగళసూత్రం కట్టాడు. ఇప్పుడు ఆమెకు కనబడకుండా తిరుగుతున్నాడు. దీంతో న్యాయం చేసే వరకు రామునిపట్లలో సంతోష్ కుమార్ ఇంటి ఎదుట నుంచి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చుంది విద్య. ఆమెకు మద్ధతుగా వారి కుటుంబసభ్యులు నిలిచారు.

    ఇవి కూడా చదవండి : రైతులకు సీఎం కేసీఆర్​ చెబుతానన్న గుడ్​న్యూస్​ అదేనా.. రైతులకు ఫించన్ ఇచ్చే యోచనలో తెలంగాణ సర్కారు?

    ఆమె కంటే నాలుగేళ్ల చిన్నవాడితో ప్రేమలో పడింది.. పెళ్లి చేసుకుంటానని పెద్దల ముందుకు వెళ్లింది.. పెద్దలు ఒప్పుకోకపోవడంతో..

    ఇది కూడా చదవండి: అయ్యో ఎంత పని చేశావమ్మా... డాక్టర్​ చెప్పాడని నిండు గర్భిణి అయి ఉండి ఇంతటి కఠోర నిర్ణయం తీసుకున్నావా..? 
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Cheated, Crime news, Lovers, Siddipet

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు