Home /News /crime /

A CELEBRITY BUSINESSMAN AND HUSBAND OF A WELLKNOWN ACTOR IS UNDER THE SCANNER IN THE MUMBAI PORN VIDEO RACKET SSR

పోర్న్ వీడియో రాకెట్ కేసులో మరో కీలక మలుపు... ప్రముఖ నటి భర్త కూడా..

గెహ్నా వశిష్ట్(ఇన్‌స్టాగ్రామ్ ఫొటో)

గెహ్నా వశిష్ట్(ఇన్‌స్టాగ్రామ్ ఫొటో)

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వెలుగుచూసిన పోర్న్ రాకెట్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో.. ప్రముఖ నటి భర్త అయిన ఓ వ్యాపారవేత్తను పోలీసులు విచారిస్తున్నారు. తన నిర్మాణ సంస్థ నిర్మించే నగ్న వీడియోల్లో...

    ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వెలుగుచూసిన పోర్న్ రాకెట్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో.. ప్రముఖ నటి భర్త అయిన ఓ వ్యాపారవేత్తను పోలీసులు విచారిస్తున్నారు. తన నిర్మాణ సంస్థ నిర్మించే నగ్న వీడియోల్లో నటించాలని సదరు వ్యాపారవేత్త ఒత్తిడి చేశాడని, గత్యంతరం లేని పరిస్థితుల్లో నటించాల్సి వచ్చిందని ఓ మోడల్ చెప్పడంతో ఈ పోర్న్ రాకెట్‌లో ఆ వ్యాపారవేత్త పాత్రపై ముంబై పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతేకాదు, ముగ్గురు యువకులతో కలిసి శృంగార సన్నివేశాల్లో నటించాలని తనను సదరు వ్యాపారవేత్త, గెహనా వశిష్ట్ ఒత్తిడి చేశారని బాధిత మోడల్స్‌లో ఒకరు సెలబ్రెటీ భర్త అయిన ఆ వ్యాపారవేత్తపై, గెహనా వశిష్ట్‌పై గ్యాంగ్‌రేప్ కేసు పెట్టింది. ఈ కేసులో ఈ తరహా ఫిర్యాదుతో మోడల్స్ బయటకు రావడం ఇది నాలుగో సారి కావడం గమనార్హం. మోడల్ ఫిర్యాదుతో ఆ వ్యాపారవేత్తపై పోలీసులు నిఘా పెట్టారు. అతని వద్ద పనిచేసిన మాజీ ఉద్యోగి ఉమేష్ కామత్‌ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.

    యూకేకు చెందిన ఓ పోర్న్ ప్రొడక్షన్ సంస్థకు పనిచేసిన కామత్.. గెహనా వశిష్ట్‌కు సంబంధించిన ఏడు నుంచి ఎనిమిది పోర్న్ వీడియోలను అప్‌లోడ్ చేసినట్లు తెలిసింది. గెహనా వశిష్టకు సంబంధించి మొత్తం 87 పోర్న్ వీడియోలు ఉన్నాయని, వాటిని వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ వీడియోలను వీక్షించాలంటే సబ్‌స్క్రిప్షన్ ఫీజు కింద రూ.2000 చెల్లించాలని వెబ్‌సైట్‌లో డబ్బు వసూలు చేస్తున్నట్లు చెప్పారు. ‘గంధీ బాత్’ అనే హిందీ అడల్ట్ వెబ్ సిరీస్‌లో కూడా గెహనా నటించింది. అంతేకాదు, ‘మిస్ ఏషియా బికీనీ’ టైటిల్‌ను కూడా ఆమె సొంతం చేసుకుంది. హిందీ, తెలుగులో పలు వ్యాపార ప్రకటనల్లో గెహనా నటించింది.

    ముంబైలోని పలు రహస్య ప్రదేశాల్లో నీలి చిత్రాలను చిత్రీకరించి.. వాటిని వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేసి సొమ్ము చేసుకునే నిర్మాణ సంస్థల గురించి తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. సినిమాల్లో ఛాన్స్‌లిప్పిస్తామని ఆశ చూపి, అలా నమ్మి వచ్చిన యువతులతో ‘పోర్న్’ చిత్రాలను చిత్రీకరిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని, అలా మోసపోయిన ముగ్గురు యువతులు ఇచ్చిన ఫిర్యాదుతో గ్రీన్ పార్క్ బంగళాలో రైడ్స్ చేయగా ఈ బాగోతం బయటపడినట్లు పోలీసులు చెప్పారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Mumbai, Porn Movies, Sex Racket

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు