School Teacher: హవ్వా.. నువ్వొక టీచర్‌వా.. కేక్ ముఖానికి రాసే వంకతో అమ్మాయితో ఏంటిది.. వీడియో వైరల్

వీడియోలోని దృశ్యం

తల్లి, తండ్రి, గురువు, దైవం అంటుంటారు. సమాజంలో గురువుకు ఉండే గౌరవం అలాంటింది. కానీ విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే బుద్ధి లేకుండా ప్రవర్తిస్తే, అవకాశం దొరికింది కదా అని ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించి దిగజారితే, అలాంటి వ్యక్తిని ఏమనాలో అర్థం కావడం లేదు.

 • Share this:
  రామ్‌పూర్: తల్లి, తండ్రి, గురువు, దైవం అంటుంటారు. సమాజంలో గురువుకు ఉండే గౌరవం అలాంటింది. కానీ విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే బుద్ధి లేకుండా ప్రవర్తిస్తే, అవకాశం దొరికింది కదా అని ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించి దిగజారితే, అలాంటి వ్యక్తిని ఏమనాలో అర్థం కావడం లేదు. ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌లో అదే జరిగింది. పాఠాలు చెప్పిన మాస్టారే పాడు పనికి పాల్పడ్డాడు.

  ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆ ఉపాధ్యాయుడిని కడిగిపారేస్తున్నారు. వయసు పెరగగానే సరిపోదని.. బుద్ధి కూడా పెరగాలని ఆ ప్రబుద్ధుడికి హితబోధ చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. అంత కాని పని ఆ వ్యక్తి ఏం చేశాడంటే.. సెప్టెంబర్ 5న దేశవ్యాప్తంగా గురుపూజోత్సవం ఘనంగా జరుపుకున్నాం కదా. అలానే.. రాంపూర్‌లోని ఓ పాఠశాలలో కూడా గురుపూజోత్సవ వేడుకలు జరిగాయి. విద్యార్థినివిద్యార్థులు గురువుల చేత కేక్ కట్ చేయించారు.

  అయితే.. ఆ సమయంలో అదే స్కూల్లో పనిచేస్తున్న ఇంగ్లీష్ మీడియం బోధించే టీచర్ ఒకరు ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. కేక్ కట్ చేసిన ఆ టీచర్ అత్యుత్సాహంతో ఆ బాలిక వద్దంటున్నా వినకుండా కేక్ ముఖానికి రాసే వంకతో ఆమెను గట్టిగా పట్టుకుని.. తాకరాని చోట తాకుతూ తప్పుగా ప్రవర్తించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ టీచర్ అలా తాకడంతో సదరు బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి జరిగిందంతా పూసగుచ్చినట్టు తల్లిదండ్రులకు చెప్పింది. బాలిక తండ్రి ఫిర్యాదుతో పోలీసులు ఘటన తాలూకా వీడియో పరిశీలించి.. ఆ టీచర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. స్కూల్ యాజమాన్యం కూడా అతనిని ఉద్యోగం నుంచి తొలగించింది.

  ఇది కూడా చదవండి: Female Thief: ఇదెక్కడి దొంగతనం.. ఏమన్నా తెలివా.. కానీ తప్పు కద.. దొరికిపోయింది.. ఎలాగంటే..

  ఇదిలా ఉంటే.. ఆ కేక్ రాసే సందర్భంలో ఆ కీచక టీచర్ ఆ బాలికను ఉద్దేశించి.. ‘నిన్ను ఎవరు కాపాడతారు? ఎవరైనా వస్తారా?’(హిందీలో) అంటూ వెకిలిగా మాట్లాడటం ఆ వీడియోలో స్పష్టంగా వినిపించింది. ఈ ఘటనపై నెటిజన్లు కారాలుమిరియాలు నూరుతున్నారు. ఆ కీచక టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ బాలిక వదిలించుకునే ప్రయత్నం చేసినా అలా బలవంతంగా పట్టుకోవడంలో అర్థమేంటని మండిపడుతున్నారు. ఆ బాలికను ఇబ్బంది పెట్టిన మాస్టారు వయసు 50 ఏళ్ల పైమాటే. మంచిచెడు చెప్పాల్సిన ఆ వయసులో ఇవేం దిక్కుమాలిన ఆలోచనలని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. దారి తప్పిన గురువుకు ఇలా ఉద్యోగం ఊడింది. పోలీసు కేసులో ఇరుక్కుని కటకటాలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
  Published by:Sambasiva Reddy
  First published: