చెన్నై: తమిళనాడులో ఘోరం జరిగింది. 17 ఏళ్ల బాలికపై ఐదుగురు మగాళ్లు మృగాలుగా మారి లైంగికంగా వేధించిన ఘటన కలకలం రేపింది. ఈ దుశ్చర్యకు పాల్పడిన నిందితులకు ఓ మహిళ కూడా సహకరించడం శోచనీయం. ఈ ఘటన తమిళనాడులోని శివగంగ జిల్లా కరైకుడిలో సంచలనంగా మారింది. ఈ అమానుష ఘటనపై కేసు నమోదు విచారణ జరిపిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి.
కరైకుడికి చెందిన 17 ఏళ్ల బాలిక ప్రభుత్వ ఎయిడెడ్ స్కూల్‌లో 12వ తరగతి చదువుతోంది. రెండు నెలల క్రితం సదరు బాలిక తన స్నేహితురాలి పుట్టినరోజు కావడంతో వాళ్లింటికి వెళ్లింది. ఆ సమయంలో బ్యూటీపార్లర్‌లో పనిచేసే తన స్నేహితురాలి తల్లితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొద్దీ సదరు బాలిక ఆ మహిళ పనిచేసే బ్యూటీపార్లర్‌కు వెళ్తూవస్తూ ఉండేది.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన మంజిల్ ఛెత్రీ అనే వ్యక్తి ఆ బ్యూటీ పార్లర్ కమ్ సెలూన్‌కు ఓనర్. విఘ్నేష్, చిరంజీవి, హరీష్ అనే ముగ్గురు యువకులు ఆ బ్యూటీపార్లర్‌లో మూడేళ్లుగా పనిచేస్తున్నారు. మంజిల్ ఆ బ్యూటీపార్లర్‌కు తరచుగా వస్తున్న బాలికపై కన్నేశాడు. ఆ బాలికతో ఎలాగైనా తనకు పరిచయం పెరిగేలా చేయాలని ఆ బ్యూటీపార్లర్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న మహిళను(బాలిక స్నేహితురాలి తల్లి) అడిగాడు. ఆ మహిళ ఓనర్ దగ్గర మంచిగా అనిపించుకోవడం కోసం ఆ బాలికకు, సదరు ఓనర్ మంజిల్‌కు పరిచయం పెరిగేలా చేసింది. ఆ పరిచయంతో మంజిల్ బాలికను సినిమాలకు, షికార్లకు తీసుకెళ్లేవాడు. అవకాశం దొరికింది కదా అని ఒకానొక సమయంలో ఆ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంతేకాదు.. ఆ బ్యూటీపార్లర్‌లో ఉన్న యువకులు కూడా బాలికపై అదే బ్యూటీపార్లర్‌లో సదరు మహిళ ముందే అత్యాచారానికి ఒడిగట్టారు.
ఇది కూడా చదవండి: Couple: కొత్తగా ఇల్లు కట్టుకుని గృహ ప్రవేశం చేశారు.. కానీ మరుసటి రోజే ఇలా జరగడం..
ఇలా ఉన్న సమయంలోనే సదరు బాలిక స్కూల్‌కు రావడం లేదని ఆమె తండ్రికి స్కూల్ టీచర్ ఫోన్ చేసి చెప్పింది. రోజూ స్కూల్‌కు వెళుతున్నానని చెప్పి ఆమె ఎక్కడికి వెళుతుందో తెలుసుకోవాలని సదరు బాలికను ఆమె తండ్రి నిలదీశాడు. అప్పుడు అసలు నిజం వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో కోసం క్లిక్ చేయండి
అప్పుడు.. వెంటనే బాధిత బాలిక తండ్రి కరైకుడి మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మొత్తం ఆ మహిళతో సహా ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఆ బ్యూటీ పార్లర్ యజమాని మంజిల్, విఘ్నేష్(28), చిరంజీవి(31), హరీష్, అరంతంగి(బాలిక స్నేహితురాలి తల్లి), మరొకరిపై కేసు నమోదు చేశారు. విఘ్నేష్, చిరంజీవి, ఆ బ్యూటీపార్లర్ మేనేజర్‌పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయగా.. ఈ కేసులో ప్రధాన నిందితులైన మంజిల్, హరీష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, School girl, Sexual harrassment, Tamilnadu