హోమ్ /వార్తలు /క్రైమ్ /

హీరో సూర్య తండ్రిపై టీటీడీ కేసు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే..

హీరో సూర్య తండ్రిపై టీటీడీ కేసు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే..

తిరుమల ఆలయం

తిరుమల ఆలయం

ఫేస్‌బుక్‌లో అస‌త్య ప్ర‌చారం చేసిన మరో వ్య‌క్తిపైన టిటిడి ఫిర్యాదు మేర‌కు తిరుమ‌ల టూ టౌన్ పోలీసులు కేసు న‌మోదు చేశారు.

  తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) హీరో సూర్య తండ్రి, తమిళ నటుడు శివకుమార్‌పై కేసు పెట్టింది. టీటీడీపై దుష్ప్రచారం చేసి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారంటూ టీటీడీ ఫిర్యాదు చేయడంతో తిరుమల టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. టిటిడి ధ‌ర్మ‌క‌ర్తల మండ‌లి స‌భ్య‌త్వానికి సుధా నారాయ‌ణ‌మూర్తి రాజీనామా చేశార‌ని ఫేస్‌బుక్‌లో అస‌త్య ప్ర‌చారం చేసిన మరో వ్య‌క్తిపైన టిటిడి ఫిర్యాదు మేర‌కు తిరుమ‌ల టూ టౌన్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. హీరో సూర్య తండ్రి, త‌మిళ న‌టుడు శివ‌కుమార్ ఒక వీడియోలో టిటిడిపై ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌ప్పుడు ప్ర‌చారం చేశార‌ని, ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆరోపిస్తూ త‌మిళ్‌మ‌య్య‌న్ అనే వ్య‌క్తి ఇ-మెయిల్ ద్వారా టిటిడికి ఫిర్యాదు చేశారు. తిరుమ‌ల‌లో అసాంఘిక కార్య‌క‌లాపాలు జ‌రుగుతున్నాయ‌ని, భ‌క్తులు తిరుమ‌ల‌కు వెళ్ల‌కూడ‌ద‌ని శివ‌కుమార్ సూచించాడ‌ని త‌మిళ్‌మ‌య్య‌న్ త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు.

  భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా వ్యాఖ్య‌లు చేసిన శివ‌కుమార్‌పై టిటిడి చేసిన ఫిర్యాదు మేర‌కు తిరుమ‌ల‌లోని టూటౌన్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో 30 జూన్, 2020 వ‌ర‌కు భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం నిలిపివేస్తారంటూ మాచ‌ర్ల శ్రీ‌నివాసులు, ప్ర‌శాంత్‌, ముంగ‌ర శివ‌రాజు, వే2 న్యూస్ నిర్వాహ‌కులు, తిరుప‌తి వార్త‌, గోదావ‌రి న్యూస్, వాట్సాప్ గ్రూపుల్లో త‌ప్పుడు ప్ర‌చారం చేశారు. కోవిడ్‌-19 లాక్‌డౌన్ స‌మ‌యంలో భ‌క్తులను గంద‌ర‌గోళానికి గురిచేసేలా స‌మాచారాన్ని చేర‌వేసినందుకు టిటిడి వారిపై ఫిర్యాదు చేసింది. ఈ మేర‌కు ఎపిడ‌మిక్ డిసీసెస్ యాక్ట్ ప్ర‌కారం పోలీసులు కేసు న‌మోదు చేశారు. దీంతో పాటు ఓ ఫేస్‌బుక్ పేజీలో 7 మే, 2020న తిరుమ‌ల శ్రీ‌వారికి సంబంధించిన అవాస్త‌వ స‌మాచారాన్ని పోస్టు చేశారు.

  ఒకానొక కాలంలో తిరుమ‌ల ఆల‌యం బౌద్ధారామం అని, త‌ల‌నీలాల స‌మ‌ర్ప‌ణ హిందువుల సంప్ర‌దాయం కాద‌ని బౌద్ధుల‌కు చెందింద‌ని అందులో పేర్కొన్నారు. అదేవిధంగా, తిరుమ‌ల ఆల‌యంలో ఉన్న బుద్ధుని విగ్ర‌హాన్ని ధ్వంసం చేసి శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి విగ్ర‌హంగా మార్చార‌ని పొందుప‌రిచారు. ఈ పోస్టులో బుద్ధుడి చిత్రం, బుద్ధుడి నుంచి శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారిగా మార్చిన చిత్రం ఉన్నాయి. దీంతో ఈ పోస్టు పెట్టిన వారిపైనా టిటిడి చేసిన ఫిర్యాదు మేర‌కు తిరుమ‌ల‌లోని టూటౌన్ పోలీసులు కేసు న‌మోదు చేశారు.

  Published by:Anil
  First published:

  Tags: Tamil Cinema, Tirumala news, Ttd

  ఉత్తమ కథలు