• Home
 • »
 • News
 • »
 • crime
 • »
 • A CAR DRIVER ARREST IN VISAKHAPATNAM AFTER RESIGNING HIS JOB OWNER SHOCKED NGS

Andhra Pradesh: ఉద్యోగం మానేశాడు. కొన్ని రోజులకు పోలీసులు పిలిచారు? షాక్ తిన్నారు ఓనర్

ఉద్యోగం మానేసిన డ్రైవర్ ను పిలిచిన పోలీసులు

కొన్ని సంఘటనలు ఒక్కోసారి షాక్ ఇస్తూ ఉంటాయి. విశాఖపట్నంలోనూ అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ కారు డ్రైవర్ నాలుగేళ్ల పాటు ఓ ఇంట్లో పని చేసిన తరువాత.. వ్యక్తిగత కారణాలతో ఇటీవల ఉద్యోగం మానేశాడు. కానీ కొన్ని రోజులకే అతడ్ని పోలీసులు పిలవాల్సి వచ్చింది? ఎందుకో తెలుసా?

 • Share this:
  నాలుగేళ్ల పాటు చాలా నమ్మకంగా ఓ ఇంట్లో డ్రైవర్ గా పని చేశాడు రామకృష్ణ అనే వ్యక్తి. డ్రైవర్ గా కాకుండా ఆ ఇంట్లో ఒక మనిషిగా మారిపోయాడు రామకృష్ణ. ఒకటి రెండేళ్లు కాదు నాలుగేళ్ల పాటు ఒకే ఇంట్లో పని చేయడంతో ఇంట్లో అందరికీ చాలా దగ్గర అయ్యాడు. అతడ్ని ఇంటి సభ్యులు ఎప్పుడూ డ్రైవర్ లా చూడలేదు.. పని విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకపోయినా.. వ్యక్తిగత కారణాలతో రామకృష్ణ గత నెల 23వ తేదీన పని మానేశాడు. దీంతో ఆ ఇంటి వాళ్లంతా చాలా బాధపడుతూనే అతడికి ఇవ్వాల్సి గౌరవం ఇచ్చారు.. కానీ ఇప్పుడు అతడ్ని పోలీసులు పిలిచారు. విషయం తెలియడంతో ఆ ఇంటి ఓనర్ తో సహా కుటుంబ సభ్యలంతా షాక్ గురయ్యారు. అందుకా ఉద్యోగం మానేశాడు అంటూ నోరు వెళ్లబెట్టారు.

  విశాఖపట్నంలోని లలితానగర్‌కు చెందిన నరవ రాంబాబు అనే వ్యక్తి.. గత నెల 5వ తేదీని బంగారాన్ని ఇంట్లో బీరువాలో దాచి పెట్టారు. తిరిగి ఈనెల 5న అవసరముండి బంగారం తీసుకుందామని బీరువా తీసి చూశాడు.. కానీ బీరువాలో ఉండాల్సిన 629 గ్రాముల బంగారు ఆభరణాలు, 14 వేల రూపాలయ నగదు పోయినట్లు గుర్తించాడు. ఇళ్లంతా వెతికి.. ఎక్కడైనా మరిచిపోయామా అని ఒకటికి పదిసార్లు చెక్ చేసుకున్న తరువాత ఈ నెలవ తేదీని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసు బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి.

  కుటుంభ సభ్యుల ఫిర్యాదు మేరకు.. ఇంట్లోని వ్యక్తి మాత్రమే దొంగతనం చేసేందుకు ఆస్కారం ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. దీంతో ముందుగా అందరిని ప్రశ్నించారు. అయినా అంతా నిజమే చెబుతున్నట్టు అనిపించడంతో.. ఇటీవల బయట వ్యక్తులు ఎవరైనా వచ్చారా? పని మనుషులు ఎవరైనా వస్తారా అంటూ ఆరా తీస్తే.. అప్పుడు విషయం తెలిసింది. గత నాలుగేళ్లుగా ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న డ్రైవర్‌ రామకృష్ణ గత నెల 23న పని మానేశాడు. దీంతో అతడి కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు. రామకృష్ణ కొన్ని రోజులుగా నగదు ఖర్చు చేస్తున్నట్లుగా వచ్చిన సమాచారంతో అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో దొంగతనం చేసినట్లుగా ఒప్పుకున్నాడు.

  అలా దొంగతనం చేసిన బంగారం మార్పిడి చేసేందుకు 50 ఏళ్ల పి.రాము అనే గోల్డ్‌స్మిత్‌ను సంప్రదించినట్లు గుర్తించారు. వీరిద్దరి నుంచి 536 గ్రాముల బంగారు ఆభరణాలు, 14 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. చోడవరానికి చెందిన డ్రైవర్‌ రామకృష్ణకు నగదు అవసరం ఉండటంతో ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలుసుకున్నారు. రామకృష్ణ, రాములు ఇద్దర్నీ అరెస్ట్ చేశారు. అయితే ఎంతో నమ్మకంగా.. ఇంట్లో వ్యక్తిగా చూసుకుంటే అంత పని చేశాడా అంటూ ఓనర్ సహా ఆ ఇంట్లో వాళ్లంతా నోరెళ్లబెట్టారు.
  Published by:Nagesh Paina
  First published: