మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో కిడ్నాప్ కలకలం.. రూ. 45 లక్షలు డిమాండ్

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో కిడ్నాప్ కలకలం రేపుతోంది. బైక్‌పై వచ్చిన దుండగుడు ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ బాలుడిని  ఎత్తుకెళ్లిపోయాడు.

news18-telugu
Updated: October 19, 2020, 11:06 PM IST
మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో కిడ్నాప్ కలకలం.. రూ. 45 లక్షలు డిమాండ్
కిడ్నాప్ గురైన బాలుడు
  • Share this:
మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో కిడ్నాప్ కలకలం రేపుతోంది. బైక్‌పై వచ్చిన దుండగుడు ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ బాలుడిని  ఎత్తుకెళ్లిపోయాడు. వివరాలు.. కృష్ణ కాలనీలో నివాసం ఉంటున్న రంజిత్ అనే వ్యక్తి ఓ ప్రముఖ టీవీ చానల్‌లో వీడియా జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. రంజిత్, వసంతల పెద్ద కుమారుడు దీక్షిత్‌రెడ్డి(9). అయితే ఆదివారం రోజున బైక్ వచ్చిన ఓ వ్యక్తి బాలుడిని ఎత్తికెళ్లిపోయాడు. అయితే పొద్దుపోయినా కూడా బాలుడు ఇంటికి రాకపోవడంతో అతడి తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. అయితే దీక్షిత్ జాడ కనిపించలేదు. దీంతో అతని తోటివారిని ఆరా తీయగా.. బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి దీక్షిత్‌ను తీసుకునివెళ్లాడని వారు తెలిపారు. ఇక, రాత్రి 10 గంటల ప్రాంతంలో కిడ్నాపర్లు బాలుడి తల్లికి ఫోన్ చేసి రూ. 45 లక్షలు డిమాండ్ చేశారు.

డబ్బులు ఇస్తేనే బాలుడిని విడిచిపెడతామని కిడ్నాపర్లు చెప్పారు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పవద్దని హెచ్చరించారు. ఇంటి చుట్టుపక్కల తమ వ్యక్తులు ఉన్నారని.. మీరు ఏం చేసినా తమకు తెలుస్తుందని బాలుడి తల్లిని బెదిరించాడు. పోలీసులకు కంప్లైట్ చేయవద్దని అన్నాడు. బాలుడికి జ్వరంగా ఉందని.. ట్యాబ్లెట్స్ వేసి పడుకొబెట్టామని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి.. కిడ్నాప్ అయిన బాలుడి ఇంటి పరిసర ప్రాంతాలను పరిశీలించాడు. బాలుడి తల్లిదండ్రులను సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. కిడ్నాపర్ల ఆచూకీ తెలుసుకునేందకు ముమ్మరంగా గాలిస్తున్నారు. అలాగే కిడ్నాప్ జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. అలాగే పలువురు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. కిడ్నాపర్లు డబ్బులు డిమాండ్ చేసేందుకు ఇప్పటివరకు నాలుగుసార్లు ఫోన్ చేశారు. అయితే వారు నెట్ ఫోన్‌తో కాల్ చేస్తుండంతో కిడ్నాపర్ల ఆచూకీ కనుగొనడం పోలీసులకు కష్టంగా మరింది.
Published by: Sumanth Kanukula
First published: October 19, 2020, 11:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading