ఏపీలో ఘోరం.. బాలిక స్నానం చేస్తుండగా వీడియో తీసి.. ఆమెపై రోజూ..

AP Crime News: వేసవి సెలవులు అని హాస్టల్ నుంచి ఆ బాలిక ఇంటికి వచ్చింది. ఓ రోజు ఆమె స్నానం చేస్తుండగా మోహన్ అనే మైనర్ బాలుడు తన సెల్‌ఫోన్‌తో ఆ దృశ్యాలను చిత్రీకరించారు. వాటిని బాలికకు చూపి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

news18-telugu
Updated: June 12, 2019, 9:59 AM IST
ఏపీలో ఘోరం.. బాలిక స్నానం చేస్తుండగా వీడియో తీసి.. ఆమెపై రోజూ..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పనపాకంలో ఓ మైనర్ బాలిక అశ్లీలత దృశ్యాలను చిత్రీకరించి, లైంగిక దాడికి పాల్పడటంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాల్లోకెళితే.. గ్రామానికి చెందిన బాలిక హాస్టల్‌లో ఉంటూ 9వ తరగతి చదువుతోంది. చిన్నప్పుడే తల్లి చనిపోయింది. తండ్రి వికలాంగుడు. దీంతో నానమ్మ దగ్గరే ఉంటోంది. అయితే, వేసవి సెలవులు అని హాస్టల్ నుంచి ఆ బాలిక ఇంటికి వచ్చింది. ఓ రోజు ఆమె స్నానం చేస్తుండగా మోహన్ అనే మైనర్ బాలుడు తన సెల్‌ఫోన్‌తో ఆ దృశ్యాలను చిత్రీకరించారు. వాటిని బాలికకు చూపి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగక ఆ చిత్రాలను తన స్నేహితులైన నాగార్జున, పార్థసారధి అలియాస్ సీతయ్య, చక్రవర్తి, జగపతి అనే నలుగురికి షేర్ చేశాడు. వీటిని చూసిన ఆ యువకులు ఈ బాలికను తమతో గడపాలని లేకపోతే ఫేస్‌బుక్‌లో పెడతామని వేధించారు.

వేధింపులు తాళలేక మనస్తాపానికి గురైన బాలిక ఉరేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీన్ని గమనించిన బాలిక నానమ్మ.. ఆమెను కాపాడి వివరాలు ఆరా తీసింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ముసలావిడ గ్రామస్థుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఐదుగురు యువకులను అరెస్టు చేసిన ఖాకీలు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

First published: June 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>