A BIKER ATTACK ON TRAFFIC SI TO IMPOSE FINE IN THE POLICE STATION IN BOPAL VRY
Traffic fine : బైక్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లినందుకు ఎస్సైని కత్తితో పొడిచిన బైకర్..!
ప్రతీకాత్మక చిత్రం
Traffic fine : ట్రాఫిక్ ఫైన్ విధించడమే కాకుండా తన టూవీలర్ పోలీస్‌స్టేషన్ తీసుకుపోవడంతో భరించలేని ఓ బైకర్ ట్రాఫిక్ ఎస్సైపై కక్ష పెంచుకున్నాడు..దీంతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి, ఫైన్ కట్టిన అనంతరం అక్కడే ఉన్న ఎస్సైని కత్తితో పొడిచాడు.
భోపాల్‌లో ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మరీ డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ ఎస్సైని కత్తితో పొడిచాడు. వివరాల్లోకి వెళితే..శనివారం నిందితుడు హర్ష్ మీనా స్థానికంగా ఉన్న ఓ సనిమా టాకీస్‌కు వెళ్లాడు. అక్కడ అతను తన బైక్‌ను నో పార్కింగ్ జోన్లో పార్క్ చేశాడు. అయితే..ఆ ప్రాంతంలో ట్రాఫిక్ డ్యూటీలో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్ దూబే, నో పార్కింగ్ జోన్లో పార్క్ చేసిన వాహనాలను పోలీసు క్రేన్ సహాయంతో తీసుకువెళ్లి క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.దీంతో ఈ సమాచారం అందుకున్న బైకర్ హర్ష్ మీనా క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు..తనకు విధించిన జరిమానా డబ్బులు రూ.600 చెల్లించాడు..
అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్న తన బైకును తీసుకురావడంతో పాటు ఫైన్ కూడా విధించిన సంబంధిత ఎస్సైపై హర్ష్ మిత్ర మనసులో కక్ష పెంచుకున్నాడు.. కనిపడితే చంపేంత కసితో రగిలిపోయాడు..ఈ క్రమంలోనే తాను ఫైన్ కట్టి బయటకు వస్తున్న సమయంలోనే తన బైక్‌ను తీసుకువెళ్లిన ఎస్ఐ శ్రీరామ్ దూబేని పోలీస్‌స్టేషన్‌లో నిందితుడు చూశాడు. అంతే వెంటనే అతడి దగ్గరకు వెళ్లి అక్కడ నిలబడి ఉన్న ఎస్ఐను కత్తితో కడుపులో పొడిచాడు. అనంతరం నిందితుడు అక్కడ నుండి పారిపోవడానికి ప్రయత్నించాడు..కాని స్టేషన్‌లోని ఇతర పోలీసు సిబ్బంది.. క్రేన్ హర్ష్ మిత్రాను పట్టుకున్నారు..
అయితే జరిమానా డిపాజిట్ చేసిన తర్వాత నిందితుడు ట్రాఫిక్ పోలీసును పై కత్తితో ఎందుకు దాడి చేశాడనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు స్టేషన్లో సైకో లాగా ప్రవర్తించాడని, పెద్దగా నవ్వడం, అరవడం వంటివి చేశాడని పోలీసులు తెలిపారు. కాగా ఎస్ఐ దుబేను చికిత్స కోసం జేపీ ఆస్పత్రికి తరలించినట్లు ఏఎస్సీ రాజేష్ భదౌరియా తెలిపారు. ప్రాథమిక చికిత్స తర్వాత ఎస్ఐని డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించారు.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.