Home /News /crime /

Rape case: రేప్​ కేసులో ఒక్కరోజులోనే విచారణ చేసి, తీర్పు చెప్పిన న్యాయస్థానం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష

Rape case: రేప్​ కేసులో ఒక్కరోజులోనే విచారణ చేసి, తీర్పు చెప్పిన న్యాయస్థానం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

నేరాలు, కేసులు ఎక్కువుండటం.. కోర్టుల్లో జడ్జీలు తక్కువుండటం.. లేదా విచారణకు నెలల తరబడి జరగడం లాంటి కారణాలతో తీర్పులు (Judgment) ఆలస్యం అవుతున్నాయి. అయితే బిహార్‌ కోర్టు (Bihar court) మాత్రం ఓ కేసులో  తీర్పు శరవేగంగా చెప్పింది.

    నేరాలు, కేసులు ఎక్కువుండటం.. కోర్టుల్లో జడ్జీలు తక్కువుండటం.. లేదా విచారణకు నెలల తరబడి జరగడం లాంటి కారణాలతో తీర్పులు (Judgment) ఆలస్యం అవుతున్నాయి. అయితే బిహార్‌ కోర్టు (Bihar court) మాత్రం అత్యాచారం కేసులో  తీర్పు శరవేగంగా చెప్పింది. ఒకే ఒక రోజులో తీర్పు చెప్పింది. ఎనిమిదేళ్ల బాలికపై దారుణంగా అత్యాచారం చేసిన దిలీప్ కుమార్ యాదవ్‌ (dilip kumar yadav) అనే వ్యక్తికి పోక్సో (Pocso) కోర్టు కేవలం ఒక్క రోజులోనే విచారణ పూర్తి చేసి తీర్పు చెప్పింది. దోషికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే..  బిహార్‌లోని అరారియా జిల్లాలో ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌ (Protection of children from sexual offenses)పై కోర్టు ఇచ్చిన తీర్పు దేశంలోనే అత్యంత వేగంగా ఇచ్చిన మొదటి తీర్పుగా రికార్డులెక్కింది.

    పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి శశికాంత్‌ రాయ్‌ దోషి దిలీప్ కుమార్ యాదవ్‌కి యావజ్జీవ కారాగారశిక్ష (Life imprisonment), రూ. 50 వేల జరిమానా విధించారు. బాలిక భవిష్యత్ (girl future)​ కోసం  రూ.7 లక్షలు పరిహారంగా చెల్లించాలని ఆదేశించారు. అక్టోబర్‌ 4నే కోర్టు ఈ తీర్పు ఇచ్చినప్పటికీ, తీర్పు పూర్తి పాఠం ఈనెల 26న అందుబాటులోకి వచ్చింది.

    త్వరితగతిన ఆధారాలు..

    జూలై 22న ఈ అత్యాచార (rape) ఘటన జరిగింది. అయితే  మరుసటి రోజు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ దాఖలైంది. అరారియా మహిళా పోలీసు స్టేషన్‌ ఇన్‌చార్జ్‌ రీటా కుమారి ఈ కేసును ప్రత్యేకంగా ఫాలో అప్​ చేశారు. త్వరితగతిన, పక్కాగా సాక్ష్యాలు సేకరించి న్యాయస్థానం (Court) ముందు ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్​ ఆధారాలపై సంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.  రేప్‌ కేసుల్లో అత్యంత వేగంగా విచారణ పూర్తి చేసిన కేసు ఇదేనని పోక్సో (Pocso) పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శ్యామల యాదవ్‌ తెలిపారు.

    మొత్తం 10 మంది సాక్షులు..

    అక్టోబర్ 4న ఈ కేసు కోర్టు ముందుకు రాగా... ఒక్కరోజులోనే న్యాయమూర్తి (Judge) విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించారు. మొత్తం 10 మంది సాక్షులను విచారించారు. ఇరు వర్గాల వాదనలు, కౌంటర్స్ అంతా ఒక్క రోజులోనే పూర్తి చేశారు. చివరకు నిందితుడు దిలీప్ కుమార్ యాదవ్‌ను దోషిగా తేల్చి యావజ్జీవ శిక్ష (Life imprisonment)తో పాటు రూ.50వేలు జరిమానా విధించారు.

    ఇది కూడా చదవండి:  ‘‘ముఖ్యమంత్రి గంజాయి సేవిస్తారు.. ఆయనను అది మానేయమనండి” : ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Bihar, Crime news, Minor girl raped

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు