రైల్వేస్టేషన్ దగ్గర దారుణం... బాలికపై ముగ్గురు గ్యాంగ్ రేప్

9 ఏళ్ల బాలిక. ప్రపంచంలో అంతా మంచే ఉంటుందని నమ్మే వయసు. అలాంటి చిన్నారిపై ఆ ముగ్గురూ గ్యాంగ్‌ రేప్ చేశారు.

news18-telugu
Updated: September 12, 2020, 11:26 AM IST
రైల్వేస్టేషన్ దగ్గర దారుణం... బాలికపై ముగ్గురు గ్యాంగ్ రేప్
రైల్వేస్టేషన్ దగ్గర దారుణం... బాలికపై ముగ్గురు గ్యాంగ్ రేప్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
అది అసోంలోని ఓ రైల్వే స్టేషన్. మన తెలుగు రాష్ట్రాలలో లాగా... ఆ స్టేషన్‌కి వెంట వెంటనే రైళ్లు రావు. ఎప్పుడో ఒకటి వస్తుంది. ప్రయాణికులు కూడా పెద్దగా ఉండరు. అడవి లాగా పెద్ద ఎత్తున... చెట్లుంటాయి. దూరంగా ఓ రిజర్వాయర్ ఉంటుంది. అలాంటి... వర్షాల వల్ల పట్టాలపై తేడా వచ్చింది. ముగ్గురు రైల్వే వర్కర్లు... నడుం విరిగేలా పని చేసి... పట్టాలను, రాళ్లను అన్నీ సెట్ చేశారు. పనైపోయాక... చేతులు కడుక్కుందామంటే... నీళ్లు లేవు. ఏం చేద్దాం అని ఆలోచించారు. రిజర్వాయర్ దగ్గరకు వెళ్దామనుకున్నారు. తప్పదుగా పదండి అనుకుంటూ... అక్కడకు వెళ్లారు. ముగ్గురూ చేతులు కడుక్కున్నారు. హమ్మయ్య పనైపోయింది అనుకుంటూ... రిటర్న్ బయల్దేరారు.

ఇలా వాళ్లు వెనక్కి తిరిగారో లేదో... వాళ్లకు అటుగా వెళ్తున్న ఓ 9 ఏళ్ల బాలిక కనిపించింది. చుట్టూ అడవిలాగా గుబురు చెట్లు. జనం లేరు. ముగ్గురూ బాలికను చూశారు. ఒంటరిగా వెళ్తోంది. ముగ్గురూ సైగలు చేసుకున్నారు. ఓ ఇద్దరు బాలిక వెనక నుంచి పరుగెడుతూ ఆమెకు దగ్గరయ్యారు. మరొకడు... అడ్డరూట్లో పరుగెడుతూ... బాలిక ముందుకి వెళ్లాడు. వెనక ఇద్దరు, ముందు ఒకడు... బాలిక బయపడింది. వద్దొద్దు అంటూ పారిపోవాలని చూస్తుంటే... ముగ్గురూ బాలిక నోరు నొక్కి... రియర్వాయర్ పక్కన గ్యాంగ్ రేప్ చేశారు.

గాయాలపాలైన బాలిక ఏడుస్తుంటే... అటుగా వెళ్తున్న ఎవరో చూసి... ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఘటన దుమారం రేపింది. స్థానిక నేషనల్ లిబరేషన్ ఆర్మీ (NLA)... ప్రభుత్వానికి హెచ్చరిక పంపింది. రేపిస్టులకు త్వరగా శిక్ష విధించకపోతే... రైల్వే స్టేషన్‌లో రాకపోకలు ఆపేస్తామని హెచ్చరించింది. పోలీసులు ముగ్గురు నిందితుల్లో ఒకరిని పట్టుకున్నారు. మిగతా ఇద్దరి కోసం వేట కొనసాగుతోంది.
Published by: Krishna Kumar N
First published: September 12, 2020, 11:26 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading