Home /News /crime /

A 65 YEAR OLD MAN RAPED A 17 YEAR OLD GIRL IN MEDAK DISTRICT MDK VB

Minor Girl: అతడు తాత వరుస అవుతాడు.. టీవీ చూసేందుకు వచ్చిన 17 ఏళ్ల బాలికను.. అత్యంత దారుణంగా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Minor Girl: 17 సంవత్సరాల మైనర్ బాలికలను అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఘటన మెదక్ జిల్లా నిజాంపేట్ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

    గత కొంత కాలంగా తెలంగాణ లో వరుస అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి. మొన్న సింగరేణి కాలనీలో జరిగిన దారుణం ఇంకా మర్చిపోక ముందే .. ఇంతలోనే మరికొన్ని దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి . ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. చట్టాల్లో ఎన్ని మార్పులు వచ్చిన మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపులు తగ్గడంలేదు. తెలంగాణలో మరొక ఘటన చోటుచేసుకుంది. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నార్లాపూర్ లో 17 ఏళ్ళ బాలికపై 65 సంవత్సరాల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

    మీకు కనిపించే ఈ వ్యక్తి పోలీయోవ్యాధిగ్రస్తుడు.. కానీ అతడు చేసిన పని తెలిస్తే.. చెప్పు తీసుకుంటారు..


    టీవీ చూసేందుకు వెళ్లిన బాలికను లొంగదీసుకుని అత్యాచారానికి ఒడిగట్టాడు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
    నిజాంపేట్ పోలీస్ స్టేషన్లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నిందితుడుని అతి త్వరలో పట్టుకొని రిమాండ్ కు పంపుతామని అన్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం మెదక్ జిల్లా హాస్పిటల్ కు తరలించారు. ఇదిలా ఉండగా..  నిజామాబాద్ జిల్లాలో ఇద్ద‌రు మైనార్ బ‌లిక‌ల‌పై ఓ మాన‌వ మృగం చాక్లేట్ ఆశ చూపించి అత్యాచారం చేశాడు. ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగు చూసింది. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆరవ టౌన్ పరిధిలో నివాసముంటున్న ఇద్దరు మైనర్ బాలికలు ఒక‌రికి ఎనిమిదేళ్లు, మ‌రోక‌రికి 11 యేల్లు ఉన్న వారిపై మేస్త్రి పని చేసే యువకుడు వ‌సీం కన్నేశాడు.

    Minor Girl: ఎంత దారుణం అంటే.. అతడికి 50 ఏళ్లు.. బాలికకు 3 ఏళ్లు.. చాక్లెట్ ఆశ చూపి..


    ఐదు రోజుల క్రితం మైనర్ బాలిక‌ల‌కు చాక్లెట్లు ఆశ చూపించి వారిని లోబ‌ర్చుకుని వారిపై ఆ యువ‌కుడు అత్యాచారం చేశాడు.. ఇలా చాక్లెట్ ఆశా చూపించి చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడుతున్నట్టు తెలుసుకున్న తల్లిదండ్రులు.. నిందితునికి బుధవారం రాత్రి దేహశుద్ధి చేశారు.. ఆ యువ‌కున్ని పోలీసులకు అప్ప‌గించారు.. బాదిత చిన్న‌రుల‌ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసున‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.. ఇంటిప‌క్క‌నే ఉంటారు.. వారికి చాక్లేట్ ఆశ చూపించి అత్యాచారం చేసిన‌ట్లు వసీం అంగీక‌రించాడ‌ని పోలీసుల విచార‌ణ‌లో తెలింది.

    Fifty Students: ఇతడు ఎంత ముదురో తెలుసా.. చదువుకొమ్మని పంపిస్తే.. 50 మంది విద్యార్థినులతో ఇలా..


    దీంతో నిజామాబాద్ ఆరవ‌ టౌన్ పోలీస్ స్టేషన్ లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసామ‌ని పోలీసులు తెలిపారు.. బాధిత మైన‌ర్ల‌కు చికిత్స నిమిత్తం ఈ రోజు ఉదయం ఆసుపత్రికి తరలించారు.. నిందితుడి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది.
    Published by:Veera Babu
    First published:

    Tags: Crime, RAPE

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు