హోమ్ /వార్తలు /క్రైమ్ /

Chennai: 65 ఏళ్ల వయసులో 35 ఏళ్ల మహిళ మోజులో పడి చివరకు ఎలాంటి పని చేశాడో చూడండి..!

Chennai: 65 ఏళ్ల వయసులో 35 ఏళ్ల మహిళ మోజులో పడి చివరకు ఎలాంటి పని చేశాడో చూడండి..!

మురుగన్

మురుగన్

ఆయన వయసు 65 సంవత్సరాలు. నలుగురికి ఏది తప్పో, ఏది ఒప్పో చెప్పాల్సిన వయసులో ఉండి నీచంగా ఆలోచించాడు. ఓ 35 ఏళ్ల మహిళను చూసి మోజు పడ్డాడు. ఆమెతో ఎలాగైనా తన కామవాంఛ తీర్చుకోవాలనుకున్నాడు.

చెన్నై: ఆయన వయసు 65 సంవత్సరాలు. నలుగురికి ఏది తప్పో, ఏది ఒప్పో చెప్పాల్సిన వయసులో ఉండి నీచంగా ఆలోచించాడు. ఓ 35 ఏళ్ల మహిళను చూసి మోజు పడ్డాడు. ఆమెతో ఎలాగైనా తన కామవాంఛ తీర్చుకోవాలనుకున్నాడు. అందుకోసం అడ్డమైన వేషాలన్నీ వేశాడు. అయితే.. ఆమె ఎంతకూ లొంగకపోవడంతో ఆమె ఇంటిని తగలబెట్టాడు. ఈ ఘటన చెన్నైలోని వెలచెరిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెలచెరికి చెందిన ఓ మహిళ భర్త, పిల్లలతో కలిసి ఉంటోంది. రెండు నెలల క్రితం ఆమె భర్తకు ఓ ప్రమాదంలో చేతులు విరగడంతో అప్పటి నుంచి అతనిని చూసుకుంటూ ఆమె కూరగాయలు, పండ్లు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. కూరగాయలు అమ్ముకుంటున్న ఆమెను మురుగన్ అనే 65 ఏళ్ల వృద్ధుడు చూశాడు. అప్పటి నుంచి ఆమెను ఇష్టపడి ఆమెతో ఎలాగైనా తన కామవాంఛ తీర్చుకోవాలని భావించాడు. అప్పటి నుంచి రోజూ కావాలనే ఆ మహిళ దగ్గరకు వెళ్లి కూరగాయలు, పండ్లు కొనేవాడు. ఆ సమయంలో మాటలు కలిపేందుకు ప్రయత్నించేవాడు. ఏమైనా ఆర్థికంగా కష్టాలుంటే తాను చూసుకుంటానని, మొహమాట పడవద్దని ఆ మహిళతో చెప్పాడు. రోజూ ఆమెను కలిసి మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఒక్కసారి తన గురించి ఆలోచించాలని ఆమెను అడిగేవాడు.

తనకు పెళ్లయిందని.. తన కుటుంబం కష్టాల్లో ఉందని.. ఇలాంటివన్నీ తనకు నచ్చవని ఆమె తెగేసి చెప్పింది. అయినా మురుగన్ వేధింపులు మానలేదు. దీంతో.. భయంతో ఆమె గత రెండు వారాల నుంచి ఆమె కూరగాయలు, పండ్లు అమ్మడం కూడా మానేసింది. ఆమె కనిపించకపోవడంతో మురుగన్ మృగంలా మారాడు. ఆమె అద్దెకు ఉంటున్న ఇల్లు ఎక్కడో తెలుసుకుని ఇంటికి వెళ్లాడు.

ఇది కూడా చదవండి:Husband: ఎంతటి విషాద ఘటన.. భార్య వివాహేతర సంబంధం వల్ల ఎంత ఘోరం జరిగిందంటే..

ఇంట్లో ఆమె కనిపించకవడంతో కోపంతో రగిలిపోయి ఇంటిని తగలబెట్టాడు. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఆ ఇంటిని తగలబెట్టడాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఇంటి యజమానికి కూడా గాయాలయ్యాయి. ఈ ఘటన గురించి తెలుసుకున్న సదరు మహిళ మురుగన్ వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మురుగన్‌ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం అతనికి రిమాండ్ విధించింది. మురుగన్ చేసిన పని వల్ల ఆ మహిళ ఉంటున్న అద్దె ఇల్లు పూర్తిగా మంటల్లో తగలబడింది.

First published:

Tags: Chennai, Crime news, Extra marital affair, Old man

ఉత్తమ కథలు