Very Sad: ఈ పసిపిల్లాడి అమాయకమైన ముఖం చూసి కూడా జాలి కలగలేదే.. అసలు చేతులెలా వచ్చాయో..

అశుతోష్ కుమార్ (ఫైల్ ఫొటో)

బీహార్‌లో అమానుషం చోటుచేసుకుంది. ఐదేళ్ల పిల్లాడిని భూతగాదాలు పొట్టనపెట్టుకున్నాయి. ఓ యువకుడు ఆ పిల్లాడిని అత్యంత దారుణంగా కొట్టి చంపేశాడు. బీహార్‌లోని చంద్రదీప్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్పూర్ గ్రామంలో ఈ అమానుషం వెలుగుచూసింది.

  • Share this:
    పాట్నా: బీహార్‌లో అమానుషం చోటుచేసుకుంది. ఐదేళ్ల పిల్లాడిని భూతగాదాలు పొట్టనపెట్టుకున్నాయి. ఓ యువకుడు ఆ పిల్లాడిని అత్యంత దారుణంగా కొట్టి చంపేశాడు. బీహార్‌లోని చంద్రదీప్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్పూర్ గ్రామంలో ఈ అమానుషం వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన చంద్రశేఖర్ ఠాకూర్ కొడుకు.. ఐదేళ్ల వయసున్న అశుతోష్ కుమార్ సోమవారం ఉదయం ఇంటి ముందు ఆడుకుంటూ ఉన్నాడు. 11 గంటల సమయం నుంచి ఆ పిల్లాడు ఇంటి ముందు కనిపించలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు ఆ పిల్లాడి కోసం వెతకని చోటు లేదు. గ్రామంలో ఎక్కడైనా పిల్లాడు కనిపిస్తే బాధిత కుటుంబానికి సమాచారం అందించాలని మైక్‌లో అనౌన్స్‌మెంట్ కూడా చేశారు. గ్రామంలో ఓ వ్యక్తి పిల్లాడిని తాను చూశానని చెప్పాడు.

    ఎక్కడ చూశావని అడగ్గా.. అశుతోష్‌కు ఓ దుకాణం దగ్గర చోటూ ఠాకూర్ లడ్డూలు కొనిపెడుతుంటే తాను చూశానని ఆ వ్యక్తి సమాచారం అందించాడు. చోటూను విచారించగా.. పిల్లాడికి లడ్డూలు కొనిచ్చిన మాట నిజమేనని.. ఆ తర్వాత అశుతోష్ ఇంటికే వెళ్లాడని చెప్పాడు. సాయంత్రం వరకూ అశుతోష్ కోసం ఎదురుచూసిన కుటుంబ సభ్యులు అప్పటికీ పిల్లాడి ఆచూకీ తెలియకపోవడంతో అనుమానంతో చోటూకు చెందిన పాత ఇంట్లో తనిఖీ చేశారు. ఆ ఇంట్లో అశుతోష్ మృతదేహం కనిపించింది. ఆ పిల్లాడి ఒంటి మీద తీవ్రమైన గాయాలు కనిపించాయి. ఈ ఘటన గ్రామంలో ఒక్కసారిగా అలజడి రేపింది.



    చోటూనే పిల్లాడిని లడ్డూల ఆశ చూపి.. అక్కడి నుంచి తీసుకెళ్లి చంపి ఆ ఇంట్లో ఉంచాడని భావించిన గ్రామస్తులు చోటూ ఇంటిపై రాళ్లదాడికి దిగారు. గ్రామంలో పిల్లాడి హత్య జరిగినట్లు సమాచారం అందుకున్న చంద్రదీప్ పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. నిందితుడిని.. ఈ హత్యకు సహకరించిన మరో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఈ హత్య చేసినట్లు చోటూ ఠాకూర్ అంగీకరించాడు. పాత తగాదాలను మనసులో పెట్టుకుని పగ తీర్చుకునేందుకు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో నిందితుడు చెప్పాడు. పెద్దల మధ్య తగాదాలకు అభంశుభం తెలియని పిల్లాడు బలి కావడం గ్రామంలో విషాదం నింపింది.
    Published by:Sambasiva Reddy
    First published: