A 47 YEAR OLD MAN ALLEGEDLY POISONED HIS 8 YEAR OLD DAUGHTER BEFORE HANGING HIMSELF IN A HOTEL ROOM IN CHENGALPATTU DISTRICT SSR
Sad: ఉద్యోగం పోయింది.. గొడవ పడి భార్య వెళ్లిపోయింది.. ఎనిమిదేళ్ల కూతురితో కలిసి ఎక్కడికెళ్లాడంటే...
ప్రతీకాత్మక చిత్రం
తమిళనాడులోని చెంగలపట్టు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. భార్యతో గొడవ పడిన భర్త ఎనిమిదేళ్ల వయసున్న కూతురికి ఆహారంలో విషం కలిపి చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
చెన్నై:తమిళనాడులోని చెంగలపట్టు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. భార్యతో గొడవ పడిన భర్త ఎనిమిదేళ్ల వయసున్న కూతురికి ఆహారంలో విషం కలిపి చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. సెంట్రల్ చెన్నైలోని ఒట్టేరిలో ఉన్న ప్రెస్లీ నగర్‌లో రవిచంద్రన్ అనే 47 ఏళ్ల వ్యక్తి భార్య, ఎనిమిదేళ్ల కూతురితో కలిసి ఉంటున్నాడు. కరోనా మహమ్మారి కారణంగా కకావికలమైన జీవితాల్లో రవిచంద్రన్ జీవితం ఒకటి. ఈ మహమ్మారి కారణంగా రవిచంద్రన్ ఉద్యోగం కోల్పోయాడు. దీంతో.. అతనికి, అతని భార్యకు మధ్య అప్పటి నుంచి గొడవలు మొదలయ్యాయి.
రవిచంద్రన్ ఉద్యోగం పోయినప్పటి నుంచి ఆర్థికపరమైన సమస్యలు ఆ కుటుంబాన్ని వెంటాడాయి. ఈ విషయంలోనే భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఇటీవల కూడా గొడవ జరిగింది. కానీ.. ఈసారి గొడవ ముదిరి పాకాన పడింది. ఈ ఇంట్లో ఉండలేనంటూ రవిచంద్రన్ భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. ఎనిమిదేళ్ల కూతురైన దీక్షితను మాత్రం భర్త వద్దే వదిలేసి వెళ్లిపోయింది. భర్త దగ్గరకు తిరిగి వచ్చేందుకు ఆమె ఎంతకూ అంగీకరించకపోవడంతో రవిచంద్రన్ తీవ్ర మనస్తాపం చెందాడు. ఇక.. చావే శరణ్యమని భావించాడు. తాను ఒక్కడిని చనిపోతే కూతురిని చూసుకునే వాళ్లు ఉండరని భావించిన రవి పాపను చంపి ఆ తర్వాత తాను చనిపోవాలనుకున్నాడు. అయితే.. కన్నకూతురిని చంపేందుకు తొలుత అతనికి చేతులు రాలేదు. కానీ.. ఇక ఈ నిర్ణయం తీసుకోక తప్పదని భావించి క్షణికావేశంలో అన్నంత పని చేశాడు.
గత శనివారం పాపను మామల్లపురం వెళదామని, అక్కడ బీచ్‌లో ఆడుకోవచ్చని పాపకు చెప్పి అక్కడికి తీసుకెళ్లాడు. ఓ హోటల్‌లో రూం బుక్ చేసుకున్నాడు. ఉదయం పాపను బీచ్‌కు తీసుకెళ్లి ఆమె సంతోషంగా గడిపేలా చూశాడు. సాయంత్రానికి హోటల్ రూంకు చేరుకుని ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఫుడ్ రాగానే పాపకు తెలియకుండా అప్పటికే తన వెంట తెచ్చుకున్న విషాన్ని అందులో కలిపాడు. ఆ భోజనాన్నే పాపకు తినిపించాడు. ఆ ఆహారం తిన్న కొద్దిసేపటికే ఆ ఎనిమిదేళ్ల పాప చనిపోయింది. పాప చనిపోయిన తర్వాత రవిచంద్రన్ టీవీపై సూసైడ్ నోట్ రాశాడు.
తమ చావుకు ఎవరూ కారణం కాదని, ఫ్రస్ట్రేషన్ కారణంగానే ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రవిచంద్రన్ రాశాడు. తాను తీసుకున్న ఈ నిర్ణయాన్ని తన బంధువు ఒకరికి అతను వాట్సాప్‌లో మెసేజ్ చేశాడు. అతను పోలీసులకు సమాచారం అందించాడు. అయితే.. అప్పటికే తండ్రీకూతురు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.