A 46 YEAR OLD KERALA WOMAN WAS FOUND DEAD IN A LODGE ROOM IN COIMBATORE SSR
Husband: భార్య కనిపించకుండా పోయిందని ఫిర్యాదు.. లాడ్జిలో ఏ స్థితిలో కనిపించిందో చూడండి..
స్పాట్లో పోలీసులు, చనిపోయిన బిందు
కేరళలోని కొజికొడెకు చెందిన ఓ మహిళ విషయంలో సరిగ్గా అదే జరిగింది. భర్త ఉండగానే మరో వ్యక్తిని ఇష్టపడి.. అతనితో అఫైర్ కొనసాగించిన ఓ మహిళ జీవితం ఛిన్నాభిన్నమైంది. తమిళనాడులోని కోయంబత్తూరు నగరంలోని ఓ లాడ్జిలో ఆ వివాహిత శవమై కనిపించింది.
కోయంబత్తూరు: పెళ్లయ్యాక పర స్త్రీ వ్యామోహం, పర పురుషుడిపై మోజు పడటం లాంటి లక్షణాలు ఆ కాపురానికి అంత మంచివి కావు. అలా కొందరు వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ పచ్చని కాపురాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. చివరకు కట్టుకున్న వాళ్లను మోసం చేస్తూ ప్రాణాలు తీయడమో.. ప్రాణాలు తీసుకోవడమో చేస్తున్నారు. కేరళలోని కొజికొడెకు చెందిన ఓ మహిళ విషయంలో సరిగ్గా అదే జరిగింది. భర్త ఉండగానే మరో వ్యక్తిని ఇష్టపడి.. అతనితో అఫైర్ కొనసాగించిన ఓ మహిళ జీవితం ఛిన్నాభిన్నమైంది. తమిళనాడులోని కోయంబత్తూరు నగరంలోని ఓ లాడ్జిలో ఆ వివాహిత శవమై కనిపించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కొజికొడెకు చెందిన ఓ వివాహిత కొన్ని రోజుల క్రితం రోజూలానే పనికి వెళ్లి జులై 19 నుంచి కనిపించకుండా వెళ్లిపోయింది. దీంతో.. ఆమె భర్త తన భార్య కనిపించడం లేదని.. తన భార్యకు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసుకుని దర్యాప్తు ఆరంభించారు. బిందు గురించి ఆమె పనిచేసే దగ్గర ఆరా తీశారు. ఆమె ఓ పెళ్లయిన వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని తేలింది. పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు కొనసాగించారు. ఈ క్రమంలోనే.. తమిళనాడులోని కోయంబత్తూరులోని ఓ లాడ్జిలో బిందు(45) శవమై కనిపించింది. ఆమె ఉన్న గదిలోనే ఆమె ప్రియుడు ముస్తఫా(58) తీవ్రంగా గాయపరచుకుని కనిపించాడు. అతనిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
అసలు ఏం జరిగిందా అని పోలీసులు ఆరా తీయగా.. బిందు కనిపించకుండా పోయిన రోజు నుంచే ముస్తఫా కూడా కనిపించకుండాపోయాడు. అతని ఫోన్ కూడా అప్పటి నుంచి స్విచ్ ఆఫ్ వచ్చింది. కుటుంబ సభ్యులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. లాడ్జి సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని రోజుల క్రితం బిందు, ముస్తఫా భార్యాభర్తలమని చెప్పి లాడ్జిలో రూమ్ తీసుకున్నారు. కొన్ని రోజులు రూంలో ఉండి వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. అయితే.. ఈ సంబంధాన్ని దీర్ఘకాలం కొనసాగించడం కష్టమని భావించిన బిందు, ముస్తఫా లాడ్జిలోనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. బిందు విషం తాగి ఆత్మహత్య చేసుకోగా.. ముస్తఫా బ్లేడ్‌తో మణికట్టు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.
వీళ్లిద్దరూ రెండు రోజుల నుంచి రూం తీయకపోవడం, ఆ రూం నుంచి దుర్వాసన రావడంతో లాడ్జి సిబ్బందికి అనుమానమొచ్చి పోలీసులకు సమాచారం అందించారు. లోపలికి వెళ్లి చూడగా.. బిందు విగతజీవిగా కనిపించింది. ముస్తఫా మణికట్టుకు గాయంతో స్పృహ తప్పిపోయి కనిపించాడు. బిందుకు ఏడేళ్ల పాప ఉంది. ఆమె కొత్త ఇల్లు నిర్మాణ దశలో ఉండగా ఆమె ఇలా ఆత్మహత్య చేసుకోవడం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ముస్తఫా కూడా కక్కుర్లోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అతనికి పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.