కుక్కను కొట్టారంటూ వ్యక్తిపై దాడి... గొడ్డలితో నరికి...

కుక్కను కొట్టారంటూ ఓ వ్యక్తిపై ఏకంగా గొడ్డలితో దాడికి దిగాడు యువకుడు. దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు.

news18-telugu
Updated: April 10, 2019, 4:44 PM IST
కుక్కను కొట్టారంటూ వ్యక్తిపై దాడి... గొడ్డలితో నరికి...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 10, 2019, 4:44 PM IST
ఢిల్లీలో దారుణం జరిగింది. కుక్క విషయంలో జరిగిన గొడవ... చివరకు గొడ్డలితో దాడి చేసే స్థాయికి చేరుకుంది. గజిపూర్‌కు చెందిన మహాజన్... తన ఇంటి సమీపానికి వచ్చిన ఓ కుక్కపై దాడి చేసినట్టు బిపాయ్ లాల్ అనే మరో వ్యక్తి ఆరోపించాడు. ఈ విషయంలో మహాజన్‌తో బిపాయ్ లాల్ గొడవకు దిగాడు. తాను పెంచుకుంటున్న కుక్కును ఎలా కొడతావంటూ మహాజన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు తాను కుక్కను కొట్టలేదని మహాజన్ చెప్పినా... బిపాయ్ లాల్ వినిపించుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మరింతగా ముదిరింది.

ఈ గొడవ జరుగుతుండగానే ఆవేశంగా అక్కడికి వచ్చిన బిపాయ్ లాల్ కుమారుడు సురేశ్... తన దగ్గర ఉన్న గొడ్డలితో మహాజన్‌పై దాడి చేసిన బాధితురాలి భార్య తెలిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మహాజన్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే దాడిలో తీవ్రంగా గాయపడిన మహాజన్ చికిత్స జరుగుతుండగానే కన్నుమూశాడు. ఘటనపై విచారణ చేపట్టిన స్థానిక పోలీసులు... అసలు ఈ వివాదం ఎందుకు మొదలైందనే దానిపై ఆరా తీస్తున్నారు. మహాజన్ మరణానికి కారణమైన సురేశ్, అతడి తండ్రి బిపాయ్ లాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరి మధ్య ఇంతకు ముందు ఏమైనా గొడవలు జరిగాయా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపడుతున్నారు.


First published: April 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

Vote responsibly as each vote
counts and makes a difference

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626