Home /News /crime /

A 44 YEAR OLD AUTO DRIVER FROM CHENNAI DIED BY SUICIDE BY JUMPING INTO A FARM WELL ALONG WITH HIS TWO CHILDREN SSR

Auto Driver: ఈ ఆటో ఎంతటి విషాదానికి సాక్ష్యంగా నిలిచిందో తెలిస్తే.. రోడ్డు ప్రమాదం కాదు.. ఏం జరిగిందంటే..

జ్ఞానవేల్ ఆటో

జ్ఞానవేల్ ఆటో

భార్యాభర్తల మధ్య చిన్నచిన్న మనస్పర్థలు రావడం సహజం. ఆ మనస్పర్థలు అలకలు, బుజ్జగింపులతో ముగిస్తే ఫర్వాలేదు కానీ ఆ మనస్పర్థలు ముదిరితే ఆ కాపురంలో కలతలు మొదలయినట్టేనని చెప్పక తప్పదు.

    చెన్నై: భార్యాభర్తల మధ్య చిన్నచిన్న మనస్పర్థలు రావడం సహజం. ఆ మనస్పర్థలు అలకలు, బుజ్జగింపులతో ముగిస్తే ఫర్వాలేదు కానీ ఆ మనస్పర్థలు ముదిరితే ఆ కాపురంలో కలతలు మొదలయినట్టేనని చెప్పక తప్పదు. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తితే ఇద్దరూ ప్రశాంతంగా కూర్చుని మాటలతో ఏకాభిప్రాయానికి రావాలే తప్ప ఆవేశకావేశాలకు పోతే అనర్ధాలు, ఆ కాపురంలో అశాంతి తప్పవు. కానీ.. అంత అర్థం చేసుకుని మాట్లాడుకునే ఓపిక లేకపోవడం వల్లే ఎన్నో జంటలు అశాంతితో కుమిలిపోతున్నాయి. కలిసి ఉండలేమంటూ కోర్టు మెట్లు ఎక్కుతున్నాయి. మరికొందరైతే ఏకంగా ఆత్మహత్యల వరకూ వెళుతున్నారు. కన్న బిడ్డల గురించి క్షణం కూడా ఆలోచించకుండా వాళ్లను చంపి ఆ తర్వాత వాళ్లూ ప్రాణాలు తీసుకుంటున్నారు.

    ఇది కూడా చదవండి: Married Woman: అసలు ఈ ఘటన గురించి తెలిశాక ఏం చెప్తాం.. ఈ ఇద్దరూ కలిసి చేసిన పని వల్ల..

    తాజాగా.. తమిళనాడులో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. భార్యతో గొడవ పడిన ఓ ఆటో డ్రైవర్ చిన్న వయసున్న ఇద్దరు కూతుర్లను ఆటో ఎక్కించుకుని ఓ వ్యవసాయ బావిలోకి వాళ్లను తోసి, ఆ తర్వాత తానూ దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైలోని పుదుపేటకు చెందిన జ్ఞానవేల్ (44) ఆటో డ్రైవర్. సొంత ఆటో ఉంది. అతని భార్య పేరు జయంతి(38). వీరికి ఐశ్వర్య (5), పూజ(3) అనే ఇద్దరు కూతుర్లున్నారు.

    ఇది కూడా చదవండి: Family: భార్యాభర్తలు.. ఒక పాప.. బాబు.. ఇంత చక్కగా ఉన్న ఈ కుటుంబం ఇప్పుడు లేదు.. ఏమైందంటే..

    భార్యాభర్తల మధ్య ఇటీవల తరచుగా గొడవలు జరుగుతున్నాయి. మూడు రోజుల క్రితం భార్యతో గొడవ పడిన జ్ఞానవేల్ పిల్లలిద్దరినీ తీసుకుని ఆటోలో ఎక్కించుకుని వెళ్లిపోయాడు. ఎంతసేపటికీ భర్త, పిల్లలు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన జయంతి ఎగ్మోర్ పోలీస్ స్టేషన్‌లో తన భర్త, పిల్లలు కనిపించకుండా పోయారని ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసుకుని ముగ్గురి కోసం గాలించారు.

    ఇది కూడా చదవండి: HouseWife: పెళ్లై ఆరేళ్లు అవుతున్నా భర్తతో పిల్లలు కలగలేదని ఈమె ఓ నిర్ణయం తీసుకుంది.. కానీ ఏం సుఖం..

    ఇంతలో.. చెంగల్‌పట్టు జిల్లా మరైమలైనగర్ సమీపంలోని కాదంపురం పొలాల్లో ఉన్న వ్యవసాయ బావిలో ముగ్గురు శవాలు కనిపించాయని, సమీపంలో ఆటో కూడా ఉందని పోలీసులకు పొలం పనులకు వెళ్లిన స్థానికులు సమాచారం అందించారు. మరైమలైనగర్ పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరుకుని పరిశీలించారు. చనిపోయింది జ్ఞానవేల్, అతని ఇద్దరు పిల్లలేనని గుర్తించారు. భార్యతో గొడవ పడిన తర్వాత జ్ఞానవేల్ ఆటోలో పిల్లలిద్దరినీ ఎక్కించుకుని కాదంపురం పొలాల వైపు వెళ్లి పిల్లలిద్దరినీ బావిలో తోసి, తానూ దూకి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. భార్యతో గొడవల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఇతర కారణాల వల్ల ఇంతటి నిర్ణయం తీసుకున్నాడా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. తండ్రి తొందరపాటు నిర్ణయం వల్ల అతని ప్రాణంతో పాటు ఇద్దరు చిన్నారుల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. భర్త, ఇద్దరు పిల్లలను విగత జీవులుగా చూసిన జయంతి కుప్పకూలిపోయింది.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Chennai, Crime news, Family suicide

    తదుపరి వార్తలు