హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking Incident: ‘అత్తయ్యా.. ఇది నా తరపున మీకు బర్త్‌డే గిఫ్ట్’ అని కోడలు ఎంతపని చేసిందంటే...

Shocking Incident: ‘అత్తయ్యా.. ఇది నా తరపున మీకు బర్త్‌డే గిఫ్ట్’ అని కోడలు ఎంతపని చేసిందంటే...

కృపా పటేల్ (ఫైల్ ఫొటో)

కృపా పటేల్ (ఫైల్ ఫొటో)

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. అహ్మదాబాద్‌లోని శైల్‌రాజ్ బంగ్లాస్ సొసైటీ అపార్ట్‌మెంట్స్‌లో 41 ఏళ్ల వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉండే కృపా పటేల్ అనే 42 ఏళ్ల వివాహితకు ఇద్దరు కుమార్తెలు.

ఇంకా చదవండి ...

అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. అహ్మదాబాద్‌లోని శైల్‌రాజ్ బంగ్లాస్ సొసైటీ అపార్ట్‌మెంట్స్‌లో 41 ఏళ్ల వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉండే కృపా పటేల్ అనే 42 ఏళ్ల వివాహితకు ఇద్దరు కుమార్తెలు. ఒకరి వయసు 22, మరొక కూతురి వయసు 16. పెద్ద కూతురి పేరు దేవాన్షి కాగా, చిన్న కుమార్తె పేరు యానా. కృపా పటేల్ పెదద్ కూతురు దేవాన్షి అమెరికాలో ఉంటోంది. కృపా మామయ్య సీపీ పటేల్ రిటైర్డ్ కలెక్టర్ కావడం గమనార్హం. కృపా ఆత్మహత్యకు పాల్పడిన గదిలో సూసైడ్ నోట్ కూడా లభ్యం కావడం గమనార్హం. ఆ సూసైడ్ నోట్‌లో ఆమె కొన్ని కీలక విషయాలను రాసింది. ఏం రాసిందంటే.. ‘ఇప్పుడు అంతా సంతోషంగా ఉంటారని ఆశిస్తున్నాను. నేను ఆత్మహత్య చేసుకోవడం వల్ల కొందరు బాధపడినా చాలామంది ఎంతో హ్యాపీగా ఫీలవుతారన్న విషయం నాకు తెలుసు. కానీ ఒక్కటి మాత్రం నిజం. నా చావుతో దేవాన్షి, యానా అనాథలవుతారు.

అందువల్ల తెలవ్ మరియు ఖోడియర్ ప్రాంతంలో నా పేరు మీద ఉన్న ల్యాండ్‌ను నా కూతుర్లకు ఇచ్చేయండి. మామయ్యా. ఇది మీ కొడుకు చిరాగ్ మరియు నా యొక్క చివరి కోరిక. మీ కూతుర్లు కవిత మరియు పరుల్‌లా నా కూతుర్లు కూడా హ్యాపీగా ఉండాలి. ఆ ల్యాండ్‌ను నా కూతుర్లకు ఇచ్చేస్తే నా ఆత్మ శాంతిస్తుంది. నా తప్పులను మన్నించండి. నా తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి. వాళ్లకు ఉన్న ఒక్కగానొక్క కూతురు ఇప్పటి నుంచి లేదు. అత్తయ్యా. థ్యాంక్స్ నీరూ అత్తయ్యా. నా చావు నా తరపున మీకిస్తున్న బర్త్‌డే గిఫ్ట్. నా చావు కవితకు ఎంతో సంతోషానిస్తుంది. మీకు కూడా’ అని సూసైడ్ నోట్‌లో కృపా రాసింది.

ఇది కూడా చదవండి: Uthra Case Verdict: భార్యను పాముతో కరిపించి చంపిన కేసులో కోర్టు సంచలన తీర్పు.. ఆమె భర్తకు ఎలాంటి శిక్ష పడిందంటే..

కృపా భర్త చిరాగ్ డిసెంబర్ 2018న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. బ్రెయిన్ డెడ్ కావడంతో అప్పటి నుంచి బతికున్న జీవచ్ఛవంలా పడి ఉన్నాడు. చిరాగ్‌ను కలిసేందుకు కృపాను అత్తింటి వారు అనుమతించ లేదు. దీంతో.. ఆమె పలుమార్లు కోర్టును, పోలీసులను ఆశ్రయించింది. అయినప్పటికీ ఆమెకు న్యాయం జరగలేదు. చిరాగ్‌ను కలిసేందుకు అతని కూతుర్లను కూడా ఆ కుటుంబం అనుమతించలేదు. దీనికి తోడు ఆస్తి తగాదాలు కూడా కృపా ఆత్మహత్యకు కారణమయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

First published:

Tags: Ahmedabad, Crime news, Gujarat, Married women, Suicide hanging, Women commits suicide

ఉత్తమ కథలు