Home /News /crime /

A 34 YEAR OLD MAN WAS ARRESTED BY KASGANJ POLICE FOR FAKING HIS OWN DEATH AFTER ALLEGEDLY KILLING HIS WIFE AND TWO CHILDREN IN 2018 SSR

Shocking: నీ అఫైర్ పిచ్చి పాడుగానూ.. రెండున్నర గంటల క్రైం సినిమానే చూపించావుగా.. వర్మ సినిమా తీసినా తీస్తాడేమో..

పోలీసుల అదుపులో రాకేష్, రూబీ, పక్క ఫొటోలో ఇంట్లో తవ్విన గొయ్యిని పరిశీలిస్తున్న పోలీసులు

పోలీసుల అదుపులో రాకేష్, రూబీ, పక్క ఫొటోలో ఇంట్లో తవ్విన గొయ్యిని పరిశీలిస్తున్న పోలీసులు

సమాజంలో కొందరు మనుషులు నేరాలు చేయడంలో ప్రావీణ్యం సాధిస్తున్నారు. దేవుడి దయ వల్ల నేర పాఠశాలల్లాంటివి లేవు గానీ.. ఉంటే కనుక.. ఒకటి, ఒకటి, ఒకటీ.. రెండు, రెండు, రెండూ.. ఇలా ఒకటి నుంచి వంద లోపు ర్యాంకులన్నీ సొంతం చేసుకోగలిగినంత ప్రతిభ, వైవిధ్యం నేరాలు చేయడంలో చూపిస్తున్నారు. వ్యామోహాల మోజులో పడి దేహాల దాహాలు తీర్చుకునేందుకు మదం మత్తులో మనుషులమన్న విషయమే మర్చిపోతున్నారు.

ఇంకా చదవండి ...
  కస్గంజ్: సమాజంలో కొందరు మనుషులు నేరాలు చేయడంలో ప్రావీణ్యం సాధిస్తున్నారు. దేవుడి దయ వల్ల నేర పాఠశాలల్లాంటివి లేవు గానీ.. ఉంటే కనుక.. ఒకటి, ఒకటి, ఒకటీ.. రెండు, రెండు, రెండూ.. ఇలా ఒకటి నుంచి వంద లోపు ర్యాంకులన్నీ సొంతం చేసుకోగలిగినంత ప్రతిభ, వైవిధ్యం.. నేరాలు చేయడంలో చూపిస్తున్నారు. వ్యామోహాల మోజులో పడి దేహాల దాహాలు తీర్చుకునేందుకు మదం మత్తులో మనుషులమన్న విషయమే మర్చిపోతున్నారు. ‘గంగ’ చంద్రముఖిగా మారినట్టు మనిషి మృగంలా మారుతున్నాడు. చేయకూడని పాపాలన్నీ చేస్తున్నాడు. ఆ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం తప్పు మీద తప్పు చేస్తూ పోతున్నాడు. కానీ.. తప్పు చేసిన వాడు ఏదో ఒకరోజు దొరికిపోక తప్పదన్న విషయాన్ని మాత్రం మర్చిపోతున్నాడు.

  అలా మరచి.. పర స్త్రీ వ్యామోహంలో పడి కట్టుకున్న భార్యను, కన్నబిడ్డలను, నమ్మిన స్నేహితుడిని పొట్టనపెట్టుకుని ఈ సమాజంలో మూడేళ్ల నుంచి దర్జాగా తిరుగుతున్న ఓ మానవ మృగానికి ఖాకీలు సంకెళ్లేశారు. అతనితో పాటు ఈ హత్యలకు సహకరించిన ఆ వ్యక్తి ప్రియురాలిని, కొడుకు అన్ని తప్పులు చేసినా తప్పని చెప్పాల్సింది పోయి ఆ హత్యలకు సహకరించిన అతని కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కస్గంజ్ పోలీసులు ఈ నాలుగు హత్యల మర్డర్ మిస్టరీని బయటపెట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే...

  ఉత్తరప్రదేశ్‌లోని ఇతా జిల్లాలోని ఓ గ్రామంలో నివసించే రాకేష్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన రూబీ అనే యువతిని చిన్నప్పటి నుంచి ఇష్టపడ్డాడు. ఒక వయసుకొచ్చాక ఇద్దరూ ప్రేమించుకున్నారు. రాకేష్ పాతాలజీలో డిప్లొమా పొందాడు. నోయిడాలోని లాల్ పాతాలజీలో ఏడేళ్లు పనిచేశాడు. పెద్దలు రాకేష్‌కు పెళ్లి చేయాలని భావించారు. రూబీని పెళ్లి చేసుకునేందుకు రాకేష్ కుటుంబం అంగీకరించలేదు. పెద్దల బలవంతంతో 2012లో రతనేష్ అనే యువతిని రాకేష్ పెళ్లి చేసుకున్నాడు.

  రూబీకి కూడా కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. పెళ్లి తర్వాత కొన్నాళ్లు పాస్ట్ లవ్ స్టోరీని, లవర్‌ను మర్చిపోయి భార్యతో కొన్నాళ్లు బుద్ధిగా కాపురం చేశాడు. ఇద్దరు పిల్లలు పుట్టారు. మూడేళ్ల వయసున్న పాప పేరు అవని. సంవత్సరంనర వయసున్న బాబు పేరు అర్పిత్. ఇలా రాకేష్ సంసారం భార్యాపిల్లలతో సాఫీగా సాగిపోతున్నట్టు కనిపించినా.. కనిపించని కుట్రకు రాకేష్, అతని ప్రియురాలు రూబీ తెరతీశారు. పెళ్లి తర్వాత కూడా రాకేష్ భార్యకు తెలియకుండా తన మాజీ ప్రియురాలితో వివాహేతర సంబంధం కొనసాగించాడు.

  ఇలా కొన్ని నెలలు గడిచాక.. రాకేష్, రూబీ కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. అందుకు అడ్డుగా ఉన్నది రాకేష్ భార్య రతనేష్, ఇద్దరు పిల్లలని భావించారు. భార్యాపిల్లలను చంపేసి.. ప్రియురాలితో సుఖంగా ఉండాలని రాకేష్ నిర్ణయించుకున్నాడు. రూబీ కూడా ప్రియుడి ప్లాన్‌కు ఆమోద ముద్ర వేయడంతో అనుకున్నదే జరిగింది. రాకేష్ తల్లిదండ్రులు, సోదరుడు కూడా ఈ హత్యలకు సహకరించారు. 2018లో ప్రేమికుల దినోత్సవం రోజున.. అంటే ఫిబ్రవరి 14న రాత్రి సమయంలో రాకేష్ తన భార్య, ఇద్దరు పిల్లలను అతి కిరాతకంగా ఇనుప రాడ్డుతో కొట్టి చంపేశాడు. ఆ తర్వాత మూడు శవాలను ఇంటి బేస్‌మెంట్‌లో గొయ్యి తవ్వి పాతిపెట్టాడు. ఆ బేస్‌మెంట్‌పై తర్వాత సిమెంట్ ఫ్లోరింగ్ చేసి.. ఎవరికీ అనుమానం రాకుండా చేశాడు. అనుమానం రాకుండా ఉండటం కోసం తన భార్యాపిల్లలు కనిపించకుండా పోయారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

  అయితే.. అల్లుడు రాకేష్, అతని కుటుంబంపై అనుమానం ఉందని రతనేష్ కుటుంబం కోర్టును ఆశ్రయించి వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించింది. ఏప్రిల్ 2018లో ఆధారాలు లభించకపోవడంతో రాకేష్ అరెస్ట్ నుంచి బయటపడ్డాడు. ఈ కేసు నుంచి పూర్తిగా బయటపడాలని తెలివిగా ఓ ప్లాన్ వేశాడు. పాతాలజీ చదివి.. ఏడేళ్లు పనిచేసిన అనుభవం రాకేష్‌కు ఉంది. హత్యలకు సంబంధించిన ఆధారాలను ఎలా తారుమారు చేస్తారో, దొరకకుండా ఉండేందుకు ఎలా హంతకులు హత్యలు చేసి మెడికల్ సైన్స్‌కు కూడా దొరకకుండా తప్పించుకోవాలని చూస్తారో రాకేష్‌కు బాగా తెలుసు. ఈ తెలివితేటలను వాడుకుని ఈ కేసు నుంచి, తనూ.. తన కుటుంబం బయటపడాలని.. తన ప్రియురాలితో కలిసి సుఖంగా ఉండాలని రాకేష్ ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. నోయిడాలోని ల్యాబ్‌లో పనిచేస్తున్నప్పుడు పరిచయమైన తన స్నేహితుడు రాజేంద్రను కలిశాడు.

  బంధువుల ఇంట్లో పార్టీ ఉందని చెప్పి తీసుకెళ్లి రాజేంద్రకు ఫూటుగా మద్యం తాగించాడు. ఆ తర్వాత ఇద్దరూ కస్గంజ్‌లోని ఢోల్నా ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రాజేంద్రను రాకేష్ మరుపుర్‌లోని అడవిలోకి తీసుకెళ్లి వెంట తెచ్చకున్న కత్తితో రాకేష్ రాజేంద్రను పొడిచి చంపాడు. చంపేసి.. ఆ తర్వాత రాజేంద్ర తల, చేతులూ నరికేసి ముక్కలుముక్కలుగా చేశాడు. రాజేంద్రను గుర్తుపట్టకుండా ఉండటానికి అలా చేసిన రాకేష్.. ఆ తల లేని మొండెం తనదేనని.. చనిపోయింది తనేనని నమ్మించాలని మరో ట్రిక్ ప్లే చేశాడు. తన పేరుతో ఉన్న ఓ ఎల్‌‌ఐసీ స్లిప్‌ను రాజేంద్ర జేబులో పెట్టాడు. ఆ తర్వాత అక్కడి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

  రైలు పట్టాలపై మొండెం లేని శవాన్ని గుర్తించిన పోలీసులు ఆ మృతదేహం ఎవరిదనే విషయంలో తర్జనభర్జన పడ్డారు. రాకేష్ కుటుంబం ఆ తర్వాత కథంతా నడిపించారు. ఆ మృతదేహం తమ కొడుకుదేనని మొసలి కన్నీరుకార్చారు. ఆ మృతదేహం రాజేంద్రదని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. ఇరు కుటుంబాలు ఆ మృతదేహం తమకు చెందిందంటే తమకు చెందిదని పోలీసుల ముందు వాదనకు దిగారు. చివరకు.. ఆ మృతదేహం జేబులో ఉన్న ఎల్‌ఐసీ స్లిప్‌ను చూసిన పోలీసులు చనిపోయింది రాకేష్ అని భావించి.. రాకేష్ కుటుంబానికే ఆ మృతదేహాన్ని అప్పగించారు. రాకేష్ కుటుంబం కొడుకు అంత్యక్రియలు చేస్తున్నట్టుగానే కలరింగ్ ఇచ్చి డ్రామాను రక్తి కట్టించింది. ఇంతటితో ఈ ఫ్యామిలీ డ్రామా ముగియలేదు. తమ కొడుకును చంపింది అతని మామ కుటుంబమేనని.. కూతురు, పిల్లలు కనిపించకుండాపోతే అందుకు తమ కొడుకుని బాధ్యుడిని చేసి కక్షతో చంపేశారని రాకేష్ కుటుంబం అతని అత్తింటి వారిపై తప్పుడు ఫిర్యాదు నమోదు చేసింది.

  రాకేష్ కూడా ఈ సమస్య నుంచి పూర్తిగా గట్టెక్కాలని భావించి.. తనను భవిష్యత్‌లో కూడా ఎవరూ గుర్తుపట్టకూడదని ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. ఒక ఫేక్ పేరును, ఆధార్ కార్డును సృష్టించుకున్నాడు. తన పేరును దిలీప్ శర్మగా మార్చుకున్నాడు. తన స్వస్థలం కుషీనగర్‌గా క్రియేట్ చేసుకున్నాడు. తరచూ పేర్లు మార్చుకుంటూ.. ప్రాంతాలు మారుతూ చివరకు హర్యానాలోని పానిపట్‌లో కూలీగా సెటిలయ్యాడు. తాజ్‌మహల్ దగ్గర విధుల్లో ఉంటూ.. ఆగ్రాలో ఉంటున్న తన ప్రియురాలిని తరచూ కలుస్తుండేవాడు. ఇలా మూడేళ్లు గడచిపోయాయి. అయితే.. ఎవరిని చంపి తన భార్యాపిల్లల హత్య కేసు నుంచి బయటపడాలనుకున్నాడో.. ఆ స్నేహితుడు రాజేంద్ర హత్య కేసే చివరికి రాకేష్‌ను నేరస్తుడిగా పట్టించింది.

  ఇది కూడా చదవండి: Sad Incident: ఈ అమ్మాయి పేరు పూజ... రూపానికి తగ్గ గుణం.. కానీ ఇలా జరగడం...

  కస్గంజ్ పోలీసులు మిస్టరీగా మిగిలిపోయిన పాత కేసులను తిరగతోడుతున్న క్రమంలో ఆ రైలు పట్టాలపై మృతదేహం తాలూకా కేసు, ఆ మృతదేహం డీఎన్‌ఏ రిపోర్ట్ వెలుగులోకొచ్చింది. ఈ కేసుపై మరోమారు పోలీసులు దృష్టి సారించారు. కేసును సీరియస్‌గా తీసుకుని విచారించగా.. ఆ మృతదేహం డీఎన్ఏ రాకేష్‌ది కాదని తేలింది. ఆ ఒక్క నిజంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. చనిపోయింది రాజేంద్ర అని పోలీసులు తేల్చారు. రాకేష్ ఆచూకీ కోసం వెతుకులాట సాగించగా.. తన ప్రియురాలు రూబీని కలిసేందుకు కస్గంజ్ మీదుగా గంగోత్రి వెళుతున్నాడని ఇన్ఫార్మర్ ద్వారా పోలీసులకు సమాచారం అందింది. సెప్టెంబర్ 1న తన ప్రియురాలిని కలిసేందుకు వెళుతున్న రాకేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్నేహితుడిని చంపిన కేసులో రాకేష్‌ను అరెస్ట్ చేసి విచారించగా.. తన భార్యాపిల్లలను కూడా రాకేష్ హత్య చేశాడన్న విషయం తెలిసి పోలీసులు షాకయ్యారు. మూడు హత్యలను కప్పి పుచ్చడానికి మరో హత్య చేసినట్లు తేల్చిన కస్గంజ్ పోలీసులు రాకేష్‌ను, అతని ప్రియురాలు రూబీని, కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.

  ఈ కేసులో మరో ట్విస్ట్ ఏంటంటే.. రాకేష్ తండ్రి కూడా రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ కావడం కొసమెరుపు. ఒక్క వివాహేతర సంబంధం మూలంగా నమ్మి ఏడడుగులు నడిచిన భార్య, అభంశుభం తెలియని ఇద్దరు పిల్లలు, నమ్మి వెంట వెళ్లిన స్నేహితుడు అన్యాయంగా బలైపోవడం శోచనీయం. కోడలు, మనవడు, మనవరాలిని చంపి పాతిపెట్టిన అదే ఇంట్లో రాకేష్ తల్లిదండ్రులు మూడేళ్ల పాటు ప్రశాంతంగా నిద్రపోయారు. వాళ్ల సమాధుల పైన పడుకున్న ఆ వృద్ధ దంపతులకు నిద్ర ఎలా పట్టిందో.. ఏంటో అని ఈ ఘటన గురించి తెలిసిన వారు విస్మయం వ్యక్తం చేశారు. కనీసం ఆ తల్లీబిడ్డల ఆత్మఘోష, అన్యాయంగా తమను ఎందుకు చంపారన్న దీన వేదన రాకేష్ కుటుంబానికి పట్టకపోవడం శోచనీయం.
  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Crime news, Extra marital affair, Husband kill wife, Noida, Uttar pradesh

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు