A 33 YEAR OLD WOMAN FROM BENGALURU FILED A SEXUAL HARASSMENT COMPLAINT AGAINST HER ESTRANGED HUSBAND FRIEND SSR
Bengaluru: మా ఆయన పట్టించుకోవడం లేదని భర్త స్నేహితుడికి చెప్పుకుని బాధపడిన భార్య.. ట్విస్ట్ ఏంటంటే...
ప్రతీకాత్మక చిత్రం
అయితే.. ఈ క్రమంలోనే భర్త మనసు మార్చేందుకు అతని స్నేహితుడైన పళని సాయాన్ని వివాహిత కోరింది. పళనిని కలిసి తన కష్టాలను చెప్పుకుంది. కొన్నాళ్లు ఆమె పట్ల సానుభూతిపరుడిగా ఉన్న పళని...
బెంగళూరు: వివాహితను ఆమె భర్త స్నేహితుడే వేధింపులకు గురిచేసిన ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని చంద్ర లేఅవుట్లో ఉండే ఓ మహిళకు 2003లో వివాహమైంది. ఈ దంపతులకు 16, 12 సంవత్సరాల వయసున్న ఇద్దరు కొడుకులున్నారు. సదరు మహిళ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా, ఆమె భర్త సివిల్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఆమె భర్త గొడవ పడి ఇంటికి కూడా అప్పుడప్పుడూ వెళుతుండేవాడు. కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. దీంతో.. తీవ్ర మనస్తాపం చెందిన వివాహిత ఆత్మహత్యకు కూడా యత్నించింది. కొన్నిరోజుల క్రితం ఆమె భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడు. రోజులు గడుస్తున్నా తిరిగి రాకపోవడంతో వివాహిత ఆమె భర్తకు ఫోన్ చేసింది. ఇల్లు గడవడమే కష్టంగా ఉందని, ఇంటికి రమ్మని బతిమాలింది. కానీ.. ఆమె మాటలను భర్త పట్టించుకోలేదు. అయితే.. ఈ క్రమంలోనే భర్త మనసు మార్చేందుకు అతని స్నేహితుడైన పళని సాయాన్ని వివాహిత కోరింది. పళనిని కలిసి తన కష్టాలను చెప్పుకుంది. కొన్నాళ్లు ఆమె పట్ల సానుభూతిపరుడిగా ఉన్న పళని రానురానూ ఆమెపై వ్యామోహం పెంచుకున్నాడు. ఆమెతో పడక సుఖం ఆశించాడు. సాయం చేస్తానని అందుకు ప్రతిఫలంగా తనతో గడపాలని ఆమెను అడిగాడు. మార్చి 3న వివాహితకు కాల్ చేసిన పళని.. నీ భర్త డబ్బులిచ్చాడని.. అవి తీసుకుని వెళ్లాలని ఆమెకు చెప్పాడు. అయితే.. వివాహితకు అనుమానమొచ్చింది.
దీంతో.. పళని ఇంటికి వెళ్లేందుకు, డబ్బు తీసుకునేందుకు నిరాకరించింది. ఆమె వెళ్లకపోవడంతో వివాహిత ఇంటికే పళని వెళ్లాడు. ఆమెను వేధించాడు. పళని ఇలా తనను వేధిస్తున్నాడని భర్తకు చెప్పినా ఆ వివాహితకు నిరాశే ఎదురైంది. ఆమె భర్త ఏమాత్రం పట్టించుకోలేదు. పళని వేధింపులు భరించలేకపోయిన ఆ వివాహిత చంద్ర లేఅవుట్ పరిధిలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా, తన ఫిర్యాదును నిరాకరించినట్లు మహిళ చెప్పింది.
పళని ఇంట్లో అద్దెకు ఉండే మంజునాథ్ అనే ఎస్ఐ తన ఫిర్యాదును తీసుకోకపోగా.. పళని గురించి చెప్పినందుకు తననే దుర్భాషలాడాడని ఆమె తెలిపింది. దీంతో.. సిటీ పోలీస్ కమిషనర్‌ను ఆమె ఆశ్రయించింది. వెస్ట్ డివిజన్ డీసీపీని కలిసి ఫిర్యాదు చేయాలని చెప్పడంతో ఆమె అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేసింది. పళనిపై ఏప్రిల్ 9న లైంగిక వేధింపుల కేసు నమోదైంది. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పళనిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.