Home /News /crime /

Shocking: యాక్సిడెంట్ అయి పదిరోజులుగా ఇంట్లోనే ఉన్న భర్త.. భార్యను అలా చూసి తొందరపడి ఎంతపని చేశాడంటే..

Shocking: యాక్సిడెంట్ అయి పదిరోజులుగా ఇంట్లోనే ఉన్న భర్త.. భార్యను అలా చూసి తొందరపడి ఎంతపని చేశాడంటే..

మురుగన్ (ఫైల్ ఫొటో)

మురుగన్ (ఫైల్ ఫొటో)

తమిళనాడులోని సేలం జిల్లాలో ఘోరం జరిగింది. భార్య గంటల కొద్దీ కాల్స్ మాట్లాడుతుండటంతో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమె భర్త ఇద్దరు పిల్లలకు ఉరేసి, తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. సెప్టెంబర్ 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇంకా చదవండి ...
    సేలం: తమిళనాడులోని సేలం జిల్లాలో ఘోరం జరిగింది. భార్య గంటల కొద్దీ కాల్స్ మాట్లాడుతుండటంతో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమె భర్త ఇద్దరు పిల్లలకు ఉరేసి, తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. సెప్టెంబర్ 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. సేలం జిల్లాకు చెందిన మురుగన్ అనే 33 ఏళ్ల వ్యక్తి మురుగేశ్వరి అనే మహిళను కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి తొమ్మిదేళ్ల బాబు, ఐదేళ్ల పాప ఉన్నారు. మురుగన్ ఓ రెస్టారెంట్‌లో గత 13 ఏళ్లుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే.. పనిచేసే దగ్గర మురుగన్‌కు ప్రమాదం జరిగి గాయపడ్డాడు. దీంతో.. పది రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాడు.

    భర్త ఇంట్లో ఉన్న సమయంలో మురుగన్ భార్య మురుగేశ్వరి ఎవరితోనో ఎక్కువ సేపు ఫోన్లో మాట్లాడుతూ కనిపించింది. అయితే.. అప్పటికే భార్య ప్రవర్తనపై మురుగన్‌కు అనుమానం ఉంది. భార్య తన ముందే గంటల కొద్దీ ఫోన్లో మాట్లాడుతుండటంతో అతని అనుమానం మరింత బలపడింది. మురుగేశ్వరి ఫోన్ మాట్లాడుతుండగా ఆమె భర్త మురుగన్ అడ్డు తగిలి కాల్ మాట్లాడకుండా అడ్డుపడ్డాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరిగింది. ఇద్దరూ ఒకరినొకరు తిట్టుకున్నారు. కొంతసేపటికి.. మురుగన్ బయటకు వెళ్లిపోయాడు.

    ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపం చెందిన మురుగన్ తొందరపాటులో... క్షణికావేశంలో ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. గత ఆదివారం సాయంత్రం మురుగన్ తన భార్య సెల్‌‌ఫోన్ తీసుకుని దగ్గర్లోని ఓ దుకాణంలో ఇచ్చాడు. ఆ తర్వాత తన పాప, బాబును తీసుకుని ఓ మామిడి తోటలోకి వెళ్లాడు. పిల్లలిద్దరికీ ఉరేసి వీడియో తీశాడు. బాధ తాళలేక పిల్లలిద్దరూ విలవిలలాడిపోతూ కొంతసేపటికే ప్రాణాలు కోల్పోయారు.



    ఆ వీడియోలో మురుగన్ భార్యను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ఇదేగా నువ్వు కోరుకుంది. ఇదేగా నీకు కావాల్సింది. మమ్మల్ని చంపాలని నువ్వు అనుకున్నావ్. చూడు. ఇప్పుడు మేమే చనిపోతున్నాం’ అని చెప్పి.. ఆ వీడియోను దగ్గర బంధువుకు పంపాడు. ఆ తర్వాత తాను కూడా అదే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.

    ఇది కూడా చదవండి: Married Woman: నలుగురు పిల్లల తల్లి.. భర్త ఇంట్లో లేడని ప్రియుడిని ఇంటికి రమ్మంది.. ఇద్దరూ కలిసి ఆ స్థితిలో ఉండగా..

    ఆ వీడియో చూసిన మురుగన్ భార్య, అతని బంధువులు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పాట్‌కు చేరుకుని పరిశీలించగా ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్య ప్రవర్తనపై అనుమానం తనతో పాటు అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులను బలిగొనేలా చేసింది. అనుమానం పెను భూతంగా మారి ఆ కుటుంబాన్ని నాశనం చేసింది. పోలీసులు చివరిగా.. మురుగన్ ఫోన్‌లో రికార్డు చేసిన వీడియోను కూడా పరిశీలిస్తున్నారు. భార్యాభర్తలిద్దరికీ చెరో స్మార్ట్‌ఫోన్ ఉందని.. తన భార్య వద్ద కూడా ఫోన్ ఉండటంతో మురుగన్ ఆమె ఎవరితో మాట్లాడుతుందోనని అనుమాన పడేవాడని బంధువులు చెప్పారు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య పలుమార్లు గొడవలు కూడా జరిగినట్లు తెలిపారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Crime news, Extra marital affair, Husband commits suicide, Latest news, Tamilnadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు