• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • A 33 YEAR OLD MAN IN TAMILNADU ALLEGEDLY KILLED HIS WIFE SUSPECTING OF HAVING AN EXTRA MARITAL AFFAIR SSR

పెళ్లయి 43 రోజులయింది.. రోజూలానే రాత్రి మూసిన తలుపులు ఉదయం ఎంతసేపటికీ తెరుచుకోకపోవడంతో ఏమైందా అని చూడగా...

పెళ్లయి 43 రోజులయింది.. రోజూలానే రాత్రి మూసిన తలుపులు ఉదయం ఎంతసేపటికీ తెరుచుకోకపోవడంతో ఏమైందా అని చూడగా...

ప్రతీకాత్మక చిత్రం

సేలం జిల్లా వీరాణం ఒరత్తరు పట్టికి చెందిన తంగరాజు(33) కేబుల్ ఆపరేటర్. కొంత పొలం ఉండగా అందులో వ్యవసాయం కూడా చేసేవాడు. తంగరాజుకు కన్నంకురిచ్చి గ్రామానికి చెందిన మోనీషా(19)తో 43రోజుల క్రితం పెళ్లైంది. పెళ్లైన కొద్దిరోజుల పాటు భార్యతో...

  • Share this:
    చెన్నై: ఎన్నో ఆశలతో ఆ వధువు మెట్టినింట్లో అడుగుపెట్టింది. భర్తతో సంతోషంగా జీవితాంతం గడపాలని అనుకుంది. కానీ.. ఆ భర్త అనుమానం ఆమె ఆశల్ని చిదిమేసింది. పెళ్లైన 43వ రోజే ఆమెకు నూరేళ్లు నిండేలా చేసింది. భార్యను చంపిన క్రూరత్వం ఆ భర్త ప్రాణాలను కూడా బలికోరింది. తమిళనాడులోని సేలం జిల్లాలో జరిగిందీ ఘోరం. పూర్తి వివరాల్లోకి వెళితే... సేలం జిల్లా వీరాణం ఒరత్తరు పట్టికి చెందిన తంగరాజు(33) కేబుల్ ఆపరేటర్. కొంత పొలం ఉండగా అందులో వ్యవసాయం కూడా చేసేవాడు. తంగరాజుకు కన్నంకురిచ్చి గ్రామానికి చెందిన మోనీషా(19)తో 43రోజుల క్రితం పెళ్లైంది. పెళ్లైన కొద్దిరోజుల పాటు భార్యతో తంగరాజు సంతోషంగానే ఉన్నాడు. ఆమెను ప్రేమగా చూసుకుంటూ మోనీషా అడక్కుండానే అవీఇవీ తెచ్చి ఇస్తుండేవాడు. అయితే.. తంగరాజు ప్రవర్తనలో రోజులు గడిచే కొద్దీ మార్పు వచ్చింది. భార్యపై అనుమానం మొదలైంది. ఆ అనుమానం కాస్తా పెను భూతంగా మారింది. ఏ బంధువుల కుర్రాడు గానీ, చివరికి అతని స్నేహితులు ఇంటికొచ్చినా గానీ భార్యను అనుమానించేవాడు. తంగరాజులో ఇంతలా అనుమానం నాటుకుపోయిన క్రమంలో.. ఈ నెల 24న మోనీషా బర్త్ డే జరిగింది. ఆరోజున ఆమెకు బర్త్ డే కేక్ ఇచ్చి వెళ్లడానికి ఆమె అత్త కొడుకు వచ్చి వెళ్లాడు. అతను వెళ్లిన వెంటనే భార్యతో తంగరాజు గొడవపడ్డాడు. మీ అత్త కొడుకు ఎందుకు వచ్చి వెళ్లాడని, అతనికీ, నీకూ గతంలో సంబంధముందా అని సూటిపోటి మాటలతో మోనీషాను వేధించాడు. ఇలా గొడవలు జరుగుతుండగానే ఒకరోజు మోనీషా అత్త మోహన మరో కుమారుడితో మోనీషా సోదరి తంగరాజుకు కనిపించింది. మరదలు అలా కనిపించడంతో భార్యపై తంగరాజు మరింత అనుమానం పెంచుకున్నాడు.

    మరదలి విషయంలో మోనీషాతో గొడవపడ్డాడు. మోనీషా కుటుంబాన్ని అవమానించేలా మాట్లాడాడు. అంతటితో ఆగని తంగరాజు పట్టరాని కోపంతో మోనీషా గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయింది. మోనీషా చనిపోయిన తర్వాత కేబుల్ వైర్‌తో తంగరాజు కూడా ఉరేసుకున్నాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది.

    బుధవారం ఉదయం తంగరాజు ఇంటి తలుపులు ఎంతకీ తెరుచుకోకపోవడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానమొచ్చి పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు తలుపులు బద్ధలు కొట్టి చూడగా రక్తపు మడుగులో మోనీషా మృతదేహం, కేబుల్ వైర్‌కు వేలాడుతూ తంగరాజు మృతదేహం కనిపించింది. కేవలం తంగరాజు అనుమానం కారణంగా పెళ్లయిన 43 రోజులకే ఇద్దరి జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ఉరేసుకోవడానికి ముందు తంగరాజు విషం కూడా తాగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
    Published by:Sambasiva Reddy
    First published: