• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • A 31 YEAR OLD WOMAN ALLEGEDLY KILLED A 65 YEAR OLD MAN BY TYING HIM TO A CHAIR AND SLASHING HIS THROAT SSR

ఆయన వయసు 65 ఏళ్లు.. ఐదుగురు మహిళలతో సంబంధాలు.. ఊహించని ట్విస్ట్‌తో గాల్లో కలిసిన ప్రాణాలు..!

ఆయన వయసు 65 ఏళ్లు.. ఐదుగురు మహిళలతో సంబంధాలు.. ఊహించని ట్విస్ట్‌తో గాల్లో కలిసిన ప్రాణాలు..!

ప్రతీకాత్మక చిత్రం

సమాజంలో కొందరి ప్రాణాలు పగలూప్రతీకారాలకు బలైపోతున్నాయి. వివాహేతర సంబంధాలు, ఆస్తి తగాదాలు.. వివాదానికి కారణాలు అనేకం. కానీ.. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు హత్యలకు...

  • Share this:
    నాగ్‌పూర్: సమాజంలో కొందరి ప్రాణాలు పగలూప్రతీకారాలకు బలైపోతున్నాయి. వివాహేతర సంబంధాలు, ఆస్తి తగాదాలు.. వివాదానికి కారణాలు అనేకం. కానీ.. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు హత్యలకు కారణమవుతున్నాయి. హత్య చేయడం నేరమని తెలిసినప్పటికీ కొందరు అందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. ఎదుటి వ్యక్తిపై పెంచుకున్న పగ వల్ల చంపి శిక్ష అనుభవించేందుకు కూడా సిద్ధపడుతున్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది. పూర్తి వివరాల్లోకెళితే.. నాగ్‌పూర్‌లోని గణేష్‌పేట్‌లో నివాసముండే ఓ 65 ఏళ్ల వృద్ధుడు ఐదుగురు మహిళలతో సంబంధం ఉండేది. వీరిలో 31 ఏళ్ల మహిళ అతనికి మాజీ భార్య కావడం గమనార్హం. కొన్నేళ్ల క్రితం ఇద్దరూ విడిపోయారు. అప్పటికే వీరిద్దరికీ ఎనిమిదేళ్ల కొడుకున్నాడు. భర్తతో విడిపోయిన ఈ మహిళ మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని ఓ బాబుకు జన్మనిచ్చింది. ఆ పసికందు వయసు ప్రస్తుతం మూడు నెలలు.

    అయితే.. విడిపోయి మరో పెళ్లి చేసుకున్నప్పటికీ సదరు మహిళ 65 ఏళ్ల వృద్ధుడితో పూర్తి స్థాయిలో తెగతెంపులు చేసుకోలేదు. కొన్నాళ్లకు ఇద్దరూ శారీరకంగా పలుమార్లు కలిశారు. ఇద్దరూ చనువుగా ఉండేవారు. ఈ క్రమంలోనే ఈ మహిళ మరో బిడ్డను దత్తత తీసుకుంది. ఈ బిడ్డ విషయంలో మాజీ భర్తకు, మాజీ భార్యకు మధ్య గొడవలు తలెత్తాయి. ఆ బిడ్డను దత్తత తీసుకోవడం ఇష్టం లేని వృద్ధుడు తిరిగిచ్చేయాలని ఆమెపై ఒత్తిడి చేసేవాడు. అతని పెన్షన్ అకౌంట్‌కు సంబంధించిన ఏటీఎంను కూడా తిరిగిచ్చేయాలని సదరు మహిళను బలవంతం చేశాడు.

    దీంతో.. మాజీ భర్త వేధిస్తున్నాడని పగ పెంచుకున్న మహిళ అతనిని అంతమొందించాలని నిర్ణయించుకుంది. శారీరకంగా దగ్గరవుదామని.. తాను ఇంటికి వస్తున్నానని చెప్పిన మహిళ మాజీ భర్త ఇంటికి క్యాబ్ బుక్ చేసుకుని అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌కు వెళ్లింది. శృంగారంలో కొత్త అనుభూతి పొందుదామని మాజీ భర్తను నమ్మించిన సదరు మహిళ అతనికి ఫోన్‌లో కొన్ని నీలిచిత్రాలను చూపించింది. అందులో ఉన్న రీతిగా చేద్దామని చెప్పి కుర్చీలో అతనిని కూర్చోబెట్టి కాళ్లూచేతులను కట్టేసింది. కత్తితో గొంతు కోసి హతమార్చింది. ఆ వృద్ధుడి ఊపిరి ఆగేంత వరకూ అక్కడే ఉండి.. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ కేసును చేధించేందుకు 12 బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు పలువురిని విచారించారు. సదరు మహిళను కూడా ప్రశ్నించారు. పోలీసుల దర్యాప్తులో ఈ మహిళే తన మాజీ భర్తను చంపినట్లు పోలీసులు తేల్చారు.

    అపార్ట్‌మెంట్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. ఆ మహిళ అతని ఇంటిలోకి వెళ్లి దాదాపు 90 నిమిషాల పాటు లోపలే ఉన్నట్లు స్పష్టమైంది. ఆమె కాల్ డేటాను పరిశీలించగా ఘటన జరిగిన కొన్ని గంటల ముందే మాజీ భర్తకు ఫోన్ కాల్ వెళ్లినట్లు తేలింది. అంతేకాదు, ఆమె నివాసం ఉంటున్న గోకుల్‌పేట్ ఏరియా నుంచి ఆ వృద్ధుడు నివాసం ఉంటున్న ప్రాంతానికి క్యాబ్ బుక్ చేసుకున్నట్లు వెల్లడైంది. ఆధారాలన్నీ పక్కాగా ఉండటంతో పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    అగ్ర కథనాలు