Home /News /crime /

A 31 YEAR OLD CARPENTER LAY UNDER A COT FOR MORE THAN SIX HOURS WAITING FOR HIS WIFE LOVER AND STABBED HIM TO DEATH SSR

ప్రియుడి కోసం చికెన్ తెచ్చేందుకు వెళ్లిన భార్య.. భార్యకు తెలియకుండా మంచం కింద దాక్కున్న భర్త.. రాత్రి 10.30కు..

ప్రతీకాత్మక చిత్రం (ఇన్‌సెట్‌లో భరత్)

ప్రతీకాత్మక చిత్రం (ఇన్‌సెట్‌లో భరత్)

సమాజంలో రానురానూ వైవాహిక బంధానికి తిలోదకాలు వదులుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం. కలిసి ఉంటూనే భర్తను మోసం చేసే భార్య గురించి, భార్య కళ్లు గప్పి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించే భర్త గురించి రోజూ ఎక్కడో...

ఇంకా చదవండి ...
  బెంగళూరు: సమాజంలో రానురానూ వైవాహిక బంధానికి తిలోదకాలు వదులుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం. కలిసి ఉంటూనే భర్తను మోసం చేసే భార్య గురించి, భార్య కళ్లు గప్పి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించే భర్త గురించి రోజూ ఎక్కడో ఒకచోట వార్తలు కనిపిస్తూనే ఉంటాయి. ఎంత ఒకరినొకరు మోసం చేసుకున్నా ఏదో ఒకరోజు అక్రమ సంబంధం గురించి బయటపడక తప్పదు. అలా భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు తెలుసుకున్న బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి తన భార్యను, ఆమె ప్రియుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఎవరికీ తెలియకుండా మంచం కింద దాక్కుని ఇద్దరి గుట్టు రట్టు చేశాడు. కోపోద్రేకంలో.. క్షణికావేశంలో భార్య ప్రియుడిని ఆ భర్త చంపేశాడు.

  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన భరత్ కుమార్(31), వినుతకు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన మూడేళ్ల వరకూ ఇద్దరూ అన్యోన్యంగానే ఉన్నారు. భరత్ కార్పెంటర్‌గా పనిచేస్తూ భార్యను ఉన్నంతలో సుఖంగానే చూసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. సాఫీగా సాగిపోతున్న వీరి జీవితంలోకి మూడేళ్ల క్రితం ఓ వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి భరత్, వినుత వైవాహిక బంధం బీటలు వారింది. వినుత సొంతూరికి చెందిన శివరాజ్ అనే 27 ఏళ్ల యువకుడు ఉద్యోగం చూసుకోవడానికి వచ్చి వినుత, భరత్ ఇంట్లో వారం రోజుల పాటు ఉన్నాడు. వినుతకు సొంతూరికి చెందిన యువకుడు కావడం, ఆ అబ్బాయి మంచోడేనని వినుత ఊళ్లో వాళ్లు కూడా చెప్పడంతో భరత్ కూడా ఆ యువకుడు ఇంట్లో ఉండేందుకు అడ్డు చెప్పలేదు. శివరాజ్‌కు వినుత ఓ ఉద్యోగం చూసి పెట్టింది. అప్పటి నుంచి శివరాజ్ వినుత ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళుతుండేవాడు. ఒకరోజు వినుత ఇంటికి వెళ్లిన శివరాజ్ తన పాడు బుద్ధి బయటపెట్టుకున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నానని, మనిద్దరం కలిసుందామని వినుతతో చెప్పాడు. శివరాజ్ మాటలకు షాకయిన వినుత తనకు పెళ్లయి ఇద్దరు పిల్లలున్న విషయం గుర్తుపెట్టుకోవాలని, అయినా తనతో ప్రేమ ఏంటని కాస్త గట్టిగానే శివరాజ్‌ను మందలించింది. తొలుత శివరాజ్ ప్రేమ ప్రతిపాదనను వినుత తిరస్కరించినప్పటికీ.. తన ప్రేమను ఒప్పుకోకపోతే చచ్చిపోతానని శివరాజ్ బెదిరించడంతో వినుత కూడా అప్పటి నుంచి అతనితో చనువుగా ఉండేది. ఆ చనువు కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది.

  వినుత, శివరాజ్ వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న భరత్ వినుతను గట్టిగా మందలించడంతో అలిగి వెళ్లిపోయిన ఆమె భర్తతో విడిపోయి దూరంగా ఉంటోంది. ఇక.. వినుతను కలుసుకునేందుకు శివరాజ్‌కు అడ్డంకి లేకుండా పోయింది. వారానికి ఒకటి రెండు సార్లు వినుత ఉంటున్న ఇంటికి వెళ్లి ఇద్దరూ వివాహేతర సంబంధాన్ని కొనసాగించేవారు. భార్య వేరొకరితో వెళ్లిపోయి తనకు దూరం కావడంతో భరత్ మానసికంగా కుంగిపోయాడు. తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. తన సంసారం సర్వ నాశనం కావడానికి కారణమైన శివరాజ్‌ను చంపేయాలని భరత్ నిర్ణయించుకున్నాడు. నెల క్రితం దిగ్గజ ఈ-కామర్స్ కంపెనీ వెబ్‌సైట్‌లో ఓ కత్తిని కొనుగోలు చేశాడు. వినుత రాత్రి 8.30 గంటలకు ఇంటికి తాళం వేయకుండా గొళ్లెం పెట్టి చికెన్ తెచ్చేందుకు బజారికి వెళ్లింది. ఆ సమయంలో ఎవరూ చూడకుండా వినుత ఇంట్లోకి దూరిన భరత్ మంచం కింద దాక్కున్నాడు. వినుత చికెన్ తీసుకొచ్చి భోజనం సిద్ధం చేసింది. రాత్రి 10.30 గంటలకు శివరాజ్ ఆమె ఇంటికి వచ్చి భోజనం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ భరత్ దాక్కున్న మంచంపైనే రాసలీలలు సాగించి.. నిద్రపోయారు. తెల్లవారుజామున వినుత వాష్‌రూమ్‌కు వెళ్లేందుకు నిద్ర లేచింది.

  బీజేపీ ఎంపీ అరవింద్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

  ఆమె లోపలికి వెళ్లడాన్ని గమనించిన భరత్ వాష్‌రూమ్‌లోకి ఆమె వెళ్లగానే బయట గొళ్లెం పెట్టాడు. అప్పటికే దాదాపు 6 గంటలకు పైగా మంచం కింద ఉండి అదును కోసం వేచిచూసిన భరత్ తన వెంట తెచ్చుకున్న కత్తితో నిద్రిస్తున్న శివరాజ్ గొంతు కోసేందుకు ప్రయత్నించాడు. శివరాజ్ ప్రతిఘటించేందుకు ప్రయత్నించడంతో కడుపులో మూడుసార్లు పొడిచాడు. శివరాజ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. శివరాజ్‌ను చంపిన కొద్దిసేపటికి భార్య బయటకు వచ్చేందుకు గొళ్లెం తీసిన భరత్ తొలుత శివరాజ్ మృతదేహాన్ని మాయం చేయాలని భావించాడు. తర్వాత మనసు మార్చుకుని తను చేసిన హత్య గురించి దగ్గర బంధువుకు సమాచారమందించాడు. తెల్లవారుజామున 4 గంటలకు ఈ హత్య జరిగింది. పోలీసులు భరత్‌ను అరెస్ట్ చేశారు. శివరాజ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Bangalore, Crime, Crime news, Extramarital affairs, Illegal affair

  తదుపరి వార్తలు