• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • A 27 YEAR OLD WOMAN WAS ALLEGEDLY STABBED TO DEATH BY HER HUSBAND WHO SUSPECTED HER CHARACTER SSR

Wife: ఈ ఫొటో చూసి ఆయన ‘ఎంత మంచి మొగుడో’ అని డిసైడ్ కాకండి.. అసలు విషయం తెలిస్తే..

మితేష్, భాను(ఫైల్ ఫొటో)

భాను వయసు ఇప్పుడు 27 సంవత్సరాలు. ఆమెకు 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమెపై ఉన్న నమ్మకం ఇప్పుడు మితేష్‌కు లేకుండా పోయింది. ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. భార్య ప్రతీ కదలికలను పసిగడుతుండేవాడు. ఆమె ఎవరితోనో అక్రమ సంబంధం కొనసాగిస్తోందని...

  • Share this:
    నికోల్: భార్యాభర్తల మధ్య అలకలు, బుజ్జగింపులు సహజం. చిన్నచిన్న మనస్పర్థలొస్తే ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటే అపార్థాలన్నీ తొలగిపోయి ఆ కాపురం సాఫీగా సాగుతుంది. మనస్పర్థలు వస్తే సమసిపోతాయి గానీ ఒక్కసారి ఆలుమగల మధ్య అనుమానం ప్రవేశిస్తే మాత్రం ఆ కాపురంలో అశాంతి మొదలవుతుంది. ఆ అనుమానం పెనుభూతంగా మారితే కొన్నికొన్ని సార్లు క్షణికావేశంలో ఆత్మహత్యలు, హత్యలకు ఆ అనుమానం కారణమవుతుంది. అలాంటి.. ఘటనే అహ్మదాబాద్‌లోని నికోల్ ప్రాంతంలో జరిగింది. నికోల్‌కు చెందిన భానూ, మితేష్ చిన్ననాటి నుంచే ఒకరినొకరు ఇష్టపడ్డారు. భాను 13 ఏళ్ల వయసులోనే మితేష్‌తో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఇద్దరూ చెరో పని చేసుకుంటూ సుఖంగానే ఉన్నారు. అలా వెళ్లిపోయిన ఆరేళ్ల తర్వాత ఈ జంట మళ్లీ కుటుంబాలను కలిసింది. ఈ దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు పుట్టారు. పిల్లలను చూడగానే ఆ రెండు కుటుంబాల కోపం ఆవిరిలా కరిగిపోయింది. ఇద్దరినీ అక్కున చేర్చుకున్నారు. ఇక్కడి దాకా అంతా బాగానే ఉన్నప్పటికీ రోజులు గడిచిన కొద్దీ మితేష్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. భార్యపై అనుమానం మొదలైంది. భాను వయసు ఇప్పుడు 27 సంవత్సరాలు. ఆమెకు 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమెపై ఉన్న నమ్మకం ఇప్పుడు మితేష్‌కు లేకుండా పోయింది. ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. భార్య ప్రతీ కదలికలను పసిగడుతుండేవాడు. ఆమె ఎవరితోనో అక్రమ సంబంధం కొనసాగిస్తోందని లోలోపల మదనపడుతుండేవాడు. ఈ విషయమై భార్యతో మితేష్ పలుమార్లు గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగేది. భార్యను ఎవరితో సంబంధం సాగిస్తున్నావో చెప్పాలంటూ మితేష్ కొట్టేవాడు.

    అలాంటిదేమీ లేదని చెప్పినా వినిపించుకునేవాడు కాదు. ఆదివారం ఉదయం కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అక్రమ సంబంధం సాగిస్తున్న విషయం తనకు తెలుసని, వాడెవడో చెప్పాలని భార్యపై మితేష్ కోపగించుకున్నాడు. ఆ గొడవ సాయంత్రం వరకూ సాగింది. ఆదివారం సాయంత్రం మితేష్ ఇంటి నుంచి భాను పెద్దపెద్దగా కేకలు వేయడం ఇరుగుపొరుగు వారు విన్నారు. ఆమె అరుపులు వినబడిన కొద్దిసేపటికి మితేష్ ఇంట్లో నుంచి పారిపోవడాన్ని గమనించారు. ఏదో జరిగిందన్న అనుమానంతో ఇరుగుపొరుగు వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు.

    పోలీసులు మితేష్ ఇంటికి వెళ్లి చూడగా.. రక్తపు మడుగులో భాను విగతజీవిగా పడి ఉంది. ఘటనా స్థలానికి 108 బృందం చేరుకునే సమయానికే భాను చనిపోయింది. ఆమె మృతదేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ఆదివారం రాత్రి నిందితుడు మితేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రైం సీన్‌ను పరిశీలించిన పోలీసులు హత్యకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.

    భార్యాభర్తల మధ్య అక్రమ సంబంధం గురించి గొడవ జరిగిందని, తనకు ఎవరితోనూ సంబంధం లేదని చెప్పేందుకు భాను ప్రయత్నించిందని.. ఆ సమయంలో క్షణికావేశంలో పక్కనే ఉన్న కత్తితో నిందితుడు ఆమె గొంతు కోశాడని.. ఆ తర్వాత కడుపులో పొడిచి ఆమె చనిపోయినట్లు నిర్ధారించుకున్న తర్వాత పరారయ్యాడని పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నికోల్ పోలీసులు తెలిపారు. భార్యపై భర్త పెంచుకున్న ఆ అనుమానం ఇద్దరు ఆడపిల్లలకు తల్లిని దూరం చేసింది. పచ్చని కాపురాన్ని నాశనం చేసింది.
    Published by:Sambasiva Reddy
    First published: