Home /News /crime /

A 27 YEAR OLD MARRIED WOMAN CONSUMED POISON INFRONT OF HER HUSBAND FRIEND IN GWALIOR SSR

Husband Friend: భార్యాభర్తలతో అదే ఇంట్లో సంవత్సరంనర నుంచి ఉంటున్న భర్త ఫ్రెండ్.. చివరకు ఊహించని ఎండ్..

శ్వేత (ఫైల్ ఫొటో)

శ్వేత (ఫైల్ ఫొటో)

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ వివాహిత విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. భర్త స్నేహితుడి ఎదుట వివాహిత విషం తాగినట్లు తెలిసింది.

    గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ వివాహిత విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. భర్త స్నేహితుడి ఎదుట వివాహిత విషం తాగినట్లు తెలిసింది. దీంతో.. ఆ వ్యక్తి ఆమె భర్తకు ఫోన్ చేసి ‘నీ భార్య విషం తాగింది’ అని చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. ఇంట్లోని నగలు కూడా కనిపించడం లేదని పోలీసుల దర్యాప్తులో తెలిసింది.

    ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. శ్వేత అనే 27 ఏళ్ల యువతికి, గ్వాలియర్‌లోని PHE Colonyకి చెందిన సుభాష్ చంద్ర అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహం అయింది. అయితే.. వీరితో పాటు అదే ఇంట్లో సుభాష్ చంద్ర స్నేహితుడు దీపేంద్ర సింగ్ కూడా నివాసం ఉండేవాడు. ఇంట్లో వాళ్లతో గొడవపడి అప్పటి నుంచి ఫ్రెండ్ ఇంట్లోనే ఉంటున్నాడు. దాదాపు సంవత్సరనర నుంచి సుభాష్, శ్వేత ఉంటున్న ఇంట్లోనే దీపేంద్ర ఉంటున్నాడు. దీపేంద్ర ఓ సిమెంట్ షాప్‌ను నడుపుతున్నాడు.

    ఇది కూడా చదవండి: Headache: తలనొప్పిగా ఉందని ఆమె నీ దగ్గరకు వస్తే మందులతో తగ్గేది కాదని ఎంతపని చేశావ్ సామీ..

    గత ఆదివారం.. దీపేంద్ర సుభాష్‌కు కాల్ చేసి శ్వేత తాను చూస్తుండగానే విషం తాగిందని చెప్పాడు. ఈ విషయం తెలిసిన వెంటనే సుభాష్ హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు. ఇరుగుపొరుగు వారికి కూడా శ్వేత విషం తాగిందని చెప్పి దీపేంద్ర అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో.. శ్వేత భర్త ఇంటికి చేరుకునే లోపే ఆమెను ఆసుపత్రికి తరలించారు. శ్వేత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. హజీరా పోలీస్ స్టేషన్‌ నుంచి పోలీసులు స్పాట్‌కు చేరుకుని పరిశీలించారు. ఆమె సల్ఫర్ తిన్నట్లు విచారణలో తేలింది. ఇదిలా ఉండగా.. ఈ ఘటన జరిగిన తర్వాత సుభాష్ చంద్ర తన స్నేహితుడైన దీపేంద్ర తోమర్ కనిపించకుండాపోయాడు. ఇంట్లో నగలు, రూ.10000 డబ్బు కూడా కనిపించడం లేదు. సుభాష్ చంద్ర తన స్నేహితుడైన దీపేంద్రకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఒకసారి కాల్ లిఫ్ట్ చేసినప్పటికీ బిజీగా ఉన్నానని.. మళ్లీ మాట్లాడతానని బదులిచ్చి దీపేంద్ర కట్ చేశాడు. ఇక.. శ్వేత ఆత్మహత్యకు పాల్పడిన రోజు దీపేంద్ర ఆ రోజంతా షాప్ తీయకుండా ఇంట్లోనే ఉన్నట్లు తెలిసింది.

    ఇది కూడా చదవండి: కలుగులో ఎలుకలు కాదు.. సీక్రెట్ గదిలో నుంచి బయటకొస్తున్న అమ్మాయిలు.. ఒకరు కాదు ఇద్దరు కాదు..

    శ్వేత సోదరుడు అరవింద్ ఈ ఘటనపై స్పందిస్తూ.. తన చెల్లి చావుకు దీపేంద్రే కారణమని, అతని కళ్ల ముందే ఆత్మహత్య చేసుకుంటున్నప్పటికీ ఆపకుండా ఉన్నాడని తెలిసిందని చెప్పాడు. శ్వేతకు దీపేంద్రే సల్ఫర్ బలవంతంగా తినిపించి చంపి ఉంటాడని కూడా సందేహం వ్యక్తం చేశాడు. పోలీసులు ఈ ఘటనపై స్పందిస్తూ.. కేసు విచారణ జరుగుతోందని, శ్వేత మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించినట్లు చెప్పారు. శ్వేతకు, దీపేంద్రకు మధ్య సుభాష్‌కు తెలియకుండా వివాహేతర సంబంధం కొనసాగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఆ కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. శ్వేత, దీపేంద్ర ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. ఫోన్ కాల్ డేటాతో ఈ వివాహిత మృతిపై మిస్టరీ వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య సంబంధం లేని మరో వ్యక్తిని తీసుకొచ్చుకుని సంవత్సరాల తరబడి ఉంచుకోవడం మంచిది కాదని, చివరకు ఇలాంటి అనర్థాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని శ్వేత బంధువులు మాట్లాడుకున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Crime news, Husband, Madhya pradesh, Wife

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు