HOME »NEWS »CRIME »a 27 year old man was murdered by his brother in law and relatives of his wife ssr

పెళ్లయిన వారానికే భర్తను కాదనుకుని లవర్‌తో పెళ్లి... సరిగ్గా రెండు నెలలు తిరగకుండానే...

పెళ్లయిన వారానికే భర్తను కాదనుకుని లవర్‌తో పెళ్లి... సరిగ్గా రెండు నెలలు తిరగకుండానే...
చేతన్, భూమిక

తుమకూరుకు చెందిన చేతన్, భూమిక కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకుని చేతన్‌ను ప్రేమిస్తున్న విషయం భూమిక ఇంట్లో చెప్పింది. అతనితో పెళ్లికి భూమిక తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కూతురి ఇష్టాన్ని కాదని వెంటనే వేరే వ్యక్తితో...

  • Share this:
    తుమకూరు: ఓ వివాహితను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఓ యువకుడిని ఆమె కుటుంబ సభ్యులు హతమార్చారు. అతని పుట్టిన రోజున విష్ చేయడానికి వచ్చామని చెప్పి ఆ యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని తుమకూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమకూరుకు చెందిన చేతన్, భూమిక కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకుని చేతన్‌ను ప్రేమిస్తున్న విషయం భూమిక ఇంట్లో చెప్పింది. అతనితో పెళ్లికి భూమిక తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కూతురి ఇష్టాన్ని కాదని వెంటనే వేరే వ్యక్తితో వివాహం జరిపించారు. పెళ్లయిన వారం రోజులకే భూమిక తన భర్తను కాదనుకుని ప్రేమించిన చేతన్‌తో కలిసి వెళ్లిపోయింది. ఇద్దరూ బెంగళూరు వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. రెండు నెలల పాటు కాపురం సాఫీగా సాగింది.

    చేతన్ ఎలక్ట్రీషియన్ కావడంతో ఆ పని చేసుకుంటూ భూమికను ఉన్నంతలో ఏలోటూ లేకుండా చూసుకుంటున్నాడు. అయితే.. చేతన్, భూమిక పెళ్లి చేసుకున్న విషయం ఆమె కుటుంబానికి తెలిసింది. ఆమె తండ్రి కోపంతో రగిలిపోయాడు. వాళ్లు ఎక్కడున్నారో కనుక్కుని చేతన్ ఇంటికి వెళ్లారు. అదేరోజు చేతన్ పుట్టినరోజు కావడంతో శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చామని తెలిపారు. చేతన్ ఇంటికి వెళ్లిన వారిలో భూమిక తమ్ముడు ఆకాష్ కుమార్(19), ఆమె అంకుల్ నంజేష్(58), దిలీప్(20) ఉన్నారు. అయితే.. వస్తూనే ఆయుధాలను వెంట తెచ్చుకున్న వీళ్లంతా చేతన్‌ను నమ్మించి సరదాగా అలా బయటకు వెళ్దామని ఇంటి బయటకు తీసుకెళ్లారు. వెంట తెచ్చుకున్న ఆయుధాలతో దాడికి తెగబడ్డారు.



    తలపై కొట్టి, గొంతులో పొడవడంతో చేతన్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో షాక్‌కు గురైన భూమిక తన భర్తను హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజగోపాల్ నగర్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అందరితో కలిసిమెలిసి ఉండే చేతన్ చనిపోవడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
    Published by:Sambasiva Reddy
    First published:February 23, 2021, 16:37 IST