• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • A 26 YEAR OLD WOMAN ALLEGEDLY STRANGLED HER THREE YEAR OLD DAUGHTER TO DEATH AT AN UNDER CONSTRUCTION BUILDING SSR

Bengaluru: ఈమె అసలు కన్నతల్లేనా.. అసలేం చేసిందో తెలిస్తే మీకు కూడా ఈ డౌట్ రాకుండా ఉండదు..!

Bengaluru: ఈమె అసలు కన్నతల్లేనా.. అసలేం చేసిందో తెలిస్తే మీకు కూడా ఈ డౌట్ రాకుండా ఉండదు..!

నిందితురాలు సుధ

బెంగళూరులోని అన్నపూర్ణేశ్వర నగర్‌లో ఈరణ్ణ అనే వ్యక్తి కుటుంబంతో ఉంటున్నాడు. అతనికి భార్య సుధ, మూడేళ్ల వయసున్న కూతురు వినూత ఉన్నారు. ఈరణ్ణ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతని భార్య సుధ గ్రానైట్ టైల్స్ అమ్మే దుకాణంలో పనిచేస్తోంది. ఇద్దరూ చెరో రూపాయి సంపాదించుకుంటూ కూతురుని ప్రేమగా చూసుకుంటూ...

  • Share this:
    బెంగళూరు: మనుషుల్లో కొందరు రానురానూ రాక్షసంగా తయారవుతున్నారు. బంధాలు అనుబంధాలనూ లెక్కచేయడం లేదు. కనీసం పేగు బంధాన్ని కూడా గుర్తెరగడం లేదు. కన్న కూతురనే కనికరం లేకుండా బిడ్డను హతమార్చిందో కసాయి తల్లి. బెంగళూరు నగరంలో ఈ దారుణ ఘటన వెలుగులోకొచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని అన్నపూర్ణేశ్వర నగర్‌లో ఈరణ్ణ అనే వ్యక్తి కుటుంబంతో ఉంటున్నాడు. అతనికి భార్య సుధ, మూడేళ్ల వయసున్న కూతురు వినూత ఉన్నారు. ఈరణ్ణ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతని భార్య సుధ గ్రానైట్ టైల్స్ అమ్మే దుకాణంలో పనిచేస్తోంది. ఇద్దరూ చెరో రూపాయి సంపాదించుకుంటూ కూతురుని ప్రేమగా చూసుకుంటూ అన్యోన్యంగా ఉంటున్నారు. అయితే.. గత కొన్ని రోజులుగా ఈరణ్ణ భార్య సుధ కూతురి విషయంలో తప్పుగా ఆలోచించడం మొదలుపెట్టింది. అన్ని విషయాల్లో భర్తకే తన కూతురు మద్దతు తెలుపుతోందని సుధ భావించింది. అప్పటి నుంచి కూతురిపై ప్రేమ తగ్గింది. సుధ వికృత ఆలోచనలు రోజురోజుకూ పెరిగిపోయాయి. కూతురి విషయంలో సుధ ఇలా ఆలోచిస్తున్న క్రమంలో.. ఒకరోజు ఈరణ్ణ టీవీలో ఒక ఛానల్ చూస్తుండగా సుధ మార్చే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో.. తండ్రి చూస్తున్న ఛానలే ఉంచాలంటూ కూతురు కూడా మారాం చేసింది. దీంతో.. అన్ని విషయాల్లో కూతురు తన భర్త వైపే మాట్లాడుతోందని భావించిన సుధ కన్నకూతురిపై పగతో రగిలిపోయింది. ఏప్రిల్ 6న సాయంత్రం గోబిమంచూరి కొనిస్తానని సుధ కూతురికి మాయమాటలు చెప్పింది. కన్నతల్లే కావడంతో వినూత కూడా నమ్మి ఆమెతో పాటు వెళ్లింది. అలా ఇంటి నుంచి కొంత దూరం వెళ్లాక నిర్మాణ దశలో ఉన్న ఓ ఇంటి లోపలకు కూతురుని తీసుకెళ్లిన సుధ.. వినూత గొంతుకు చున్నీ బిగించి ఊపిరాడకుండా చేసింది. ఆమె చంపేందుకు ప్రయత్నిస్తోంది కన్న కూతురునన్న స్పృహ కూడా లేకుండా సుధ వినూతను గొంతునులిమి చంపేసింది.

    వినూత చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆమె మృతదేహాన్ని అక్కడే పడేసి సుధ ఇంటికి వెళ్లిపోయింది. ఏమీ తెలియనట్టు కూతురు కనిపించడం లేదంటూ ఏడుస్తూ, కంగారు పడుతూ నాటకమాడింది. అసలు విషయం తెలియని ఈరణ్ణ, స్థానికులు పాప ఆచూకీ కోసం చుట్టుపక్కలంతా వెతికారు. ఏప్రిల్ 7న ఉదయం పోలీసులు వినూత మృతదేహాన్ని గుర్తించారు.

    సుధ కంగారుపడుతుండటాన్ని గమనించిన పోలీసులు తమదైన శైలిలో ఆమెను విచారించగా అసలు నిజాన్ని సుధ ఒప్పుకుంది. వినూతను తానే చంపినట్లు అంగీకరించింది. పోలీసులు సుధను అరెస్ట్ చేశారు. మూడేళ్ల వయసున్న కూతురు తండ్రికి వకాల్తాగా మాట్లాడుతోందని ప్రాణాలు తీయడమేంటని విషయం తెలిసిన వారంతా విస్మయానికి లోనయ్యారు. కడుపున మోసి, కనిపెంచిన కన్నకూతురిని పొట్టనపెట్టుకున్న సుధను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.
    Published by:Sambasiva Reddy
    First published: