హోమ్ /వార్తలు /క్రైమ్ /

Tearful Incident: అయ్యో.. ఎంతటి దారుణం దేవుడా.. ఒక్కమాట మీ ఆయనకు చెప్పి ఉండాల్సింది తల్లీ..

Tearful Incident: అయ్యో.. ఎంతటి దారుణం దేవుడా.. ఒక్కమాట మీ ఆయనకు చెప్పి ఉండాల్సింది తల్లీ..

బాధితురాలు

బాధితురాలు

దేశ రాజధాని ఢిల్లీలోని బవానా ప్రాంతంలో దాదాపు రెండు వారాల క్రితం యాసిడ్ దాడిలో గాయపడిన వివాహిత సోమవారం చికిత్స పొందుతూ మృతి చెందింది. తనను పెళ్లి చేసుకోవాలంటూ భర్త, పిల్లలున్న వివాహితను ఓ ఉన్మాది పదేపదే వేధించసాగాడు.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని బవానా ప్రాంతంలో దాదాపు రెండు వారాల క్రితం యాసిడ్ దాడిలో గాయపడిన వివాహిత సోమవారం చికిత్స పొందుతూ మృతి చెందింది. తనను పెళ్లి చేసుకోవాలంటూ భర్త, పిల్లలున్న వివాహితను ఓ ఉన్మాది పదేపదే వేధించసాగాడు. ఆమె తనకు పెళ్లైందని, పిల్లలున్నారని.. తనను వదిలేయాలని బతిమాలినా వినిపించుకోకుండా వెంటపడి వేధిస్తూ ఆమెకు నరకం చూపించాడు. పెళ్లికి ఆమె ఒప్పుకోకపోవడంతో యాసిడ్ తెచ్చి ఆమె ముఖంపై, ఒంటిపై పోసి దారుణానికి పాల్పడ్డాడు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించగా మృత్యువుతో పోరాడి చివరకు సోమవారం చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని బవానా ప్రాంతంలో ఓ 26 ఏళ్ల వివాహిత తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది. ఆమె భర్త అక్కడి పారిశ్రామిక వాడలో రోజువారి కూలీగా వెళుతుండేవాడు. ఆమెకు పెళ్లై భర్త, పిల్లలున్నారని తెలిసినా అదే ప్రాంతంలో ఉండే.. ఆమె కుటుంబానికి తెలిసిన మొంటు అనే 23 ఏళ్ల యువకుడు ఆమెను ఇష్టపడ్డాడు. అంతేకాదు.. ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఇద్దరం పెళ్లి చేసుకుందామని, భర్తను, పిల్లలను వదిలేసి తనతో రావాలని ఆ వివాహితపై ఒత్తిడి చేశాడు.

ఇది కూడా చదవండి: Shocking: ఈమె ఆటోలో వెళుతోంది.. వీళ్లాయన బైక్‌పై వెళ్లి ఆటో ఆపాడు.. ఆ తర్వాత ఇలా జరుగుతుందని ఎవరూ అనుకోరు..

మొంటు వన్‌సైడ్ లవ్‌ను సదరు వివాహిత తిరస్కరించింది. ఇది మంచి పద్ధతి కాదని, ప్రవర్తన మార్చుకోవాలని సూచించింది. అయినప్పటికీ మొంటు తీరు మారలేదు సరికదా రోజురోజుకూ సైకోలా ప్రవర్తిస్తూ ఆమెను ఇబ్బంది పెట్టసాగాడు. ఈ క్రమంలోనే నవంబర్ 3న ఆ వివాహితను రోడ్డుపై అడ్డగించిన మొంటు పెళ్లి చేసుకుందామని అడిగాడు. ‘ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా’ అని ఆ వివాహిత గట్టిగా మాట్లాడింది. పెళ్లై, పిల్లలున్న తనతో ప్రేమేంటని నిలదీసింది. అవన్నీ తనకు తెలియదని.. తనతో వస్తే ఇద్దరం వెళ్లి పెళ్లి చేసుకుందామని ఆ వివాహితను మొంటు బలవంతం చేశాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ కాస్తా చిలికిచిలికి గాలివానగా మారింది. అప్పటికే ఆమెపై యాసిడ్ దాడి చేయాలన్న ఆలోచనతో గొడవ పెట్టుకున్న మొంటు తన వెంట తెచ్చుకున్న యాసిడ్ బాటిల్‌ నుంచి యాసిడ్ తీసి ఆ వివాహిత ముఖంపై, శరీరంపై పోశాడు. ఈ యాసిడ్ దాడిలో ఆ వివాహిత ముఖం, శరీరం ఎక్కువ శాతం కాలిపోయింది. ఆ బాధతో ఆమె కేకలేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు ఆమెను రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె సోమవారం కన్నుమూసింది.

ఇది కూడా చదవండి: Wife Lover: అతని భార్యతో ఇతను గడిపిన వీడియో నెట్‌లో పెట్టాడు.. పాపం.. ఆమె భర్త ఆ వీడియోను చూసి..

ఆమె భర్త ఈ ఘటనపై స్పందిస్తూ కన్నీటిపర్యంతమయ్యాడు. పిల్లలు ఇన్ని రోజులుగా అమ్మ ఎప్పుడొస్తుందని అడిగితే.. వచ్చేస్తుందని ఇన్ని రోజులు చెప్పానని.. ఇప్పుడు అమ్మ ఇక ఎప్పటికీ రాదని ఎలా చెప్పాలని బాధితురాలి భర్త గుండెలవిసేలా రోదించాడు. తాను ఒంటరైపోయానని విలపించాడు. మొంటు వేధిస్తున్న విషయం తన భార్య తనతో చెప్పినా పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ భార్యాభర్తలకు 2011 మేలో వివాహమైంది. తొమ్మిదేళ్ల పాప, ఐదు, ఆరేళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ పిల్లలకు తల్లి చనిపోయిన సంగతి తెలియకపోవడం, చెప్పే ధైర్యం ఆ తండ్రికి లేకపోవడం అత్యంత బాధాకరమైన విషయం. పోలీసులు నవంబర్ 6న నిందితుడు మొంటుని అరెస్ట్ చేశారు. ఇంత దారుణానికి పాల్పడిన అతనిని ఉరి తీయాలని బాధితురాలి భర్త డిమాండ్ చేశాడు. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ట్వీట్‌లో తన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఢిల్లీ పోలీసులకు ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.

First published:

Tags: Crime news, Delhi, Love, Married women

ఉత్తమ కథలు