• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • A 26 YEAR OLD MAN DIED DUE TO FEAR AFTER HE CAME TO KNOW THAT HE TESTED POSITIVE FOR COVID 19 IN MYSORE DISTRICT SSR

Corona: 26 ఏళ్ల యువకుడికి కరోనా.. అత్తారింటికి బైక్‌పై వెళ్లి సెల్‌ఫోన్ ఇంట్లో పెట్టి బయటకెళ్లాడు.. అంతే.. ఆ తర్వాత..

Corona: 26 ఏళ్ల యువకుడికి కరోనా.. అత్తారింటికి బైక్‌పై వెళ్లి సెల్‌ఫోన్ ఇంట్లో పెట్టి బయటకెళ్లాడు.. అంతే.. ఆ తర్వాత..

ప్రతీకాత్మక చిత్రం

లోకేశ్ వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు అయినప్పటికీ మొదటి నుంచి కొంత భయస్తుడు. ఈ మధ్య లోకేశ్‌కు కరోనా లక్షణాలు కనిపించాయి. టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో.. తీవ్ర మనోవేదన చెందిన లోకేశ్ తనకు భయంగా ఉందని కుటుంబ సభ్యుల వద్ద వాపోయాడు.

  • Share this:
    మైసూరు: ‘అతడు’ సినిమాలోని ఓ సీన్ ద్వారా భయానికి దర్శకుడు త్రివిక్రమ్ ఇచ్చిన డెఫినేషన్ గుర్తుండే ఉంటుంది. ‘దెయ్యం కంటే భయం మా చెడ్డది’. ఇది అక్షరాల నిజం. కరోనా సెకండ్ వేవ్ దేశంలో కరాళ నృత్యం చేస్తున్న ఈ తరుణంలో భయం కొందరిని బలితీసుకుంటోంది. కరోనా సోకితే ఇక చనిపోవడం ఖాయమన్న భ్రమలో, ఆందోళనలో.. ఒక్కమాటలో చెప్పాలంటే భయాందోళనలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ధైర్యంగా అనారోగ్య సమస్యను ఎదుర్కోవాల్సింది పోయి భయానికి తమ జీవితాలను బలిస్తున్నారు. కర్ణాటకలోని మైసూరు జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. మైసూరు జిల్లాలోని కేఆర్‌నగర్ పరిధిలో ఉన్న కోగిలూరు గ్రామానికి చెందిన లోకేశ్(26) ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నాడు. లోకేశ్‌కు ఏడాది క్రితం ఓ యువతితో వివాహమైంది. లోకేశ్ వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు అయినప్పటికీ మొదటి నుంచి కొంత భయస్తుడు. ఈ మధ్య లోకేశ్‌కు కరోనా లక్షణాలు కనిపించాయి. టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో.. తీవ్ర మనోవేదన చెందిన లోకేశ్ తనకు భయంగా ఉందని కుటుంబ సభ్యుల వద్ద వాపోయాడు. ఏం పర్లేదని, చాలామంది కరోనా నుంచి కోలుకున్నారని.. కంగారు పడొద్దని కుటుంబ సభ్యులు లోకేశ్‌కు ధైర్యం చెప్పారు. వైద్యశాఖ అధికారులు కూడా భయపడవద్దని, సక్రమంగా మందులు తీసుకుంటూ.. పౌష్టికాహారం తింటే కరోనాను జయించవచ్చని లోకేశ్‌కు చెప్పారు. ఇలా ఎంతమంది చెప్పినా లోకేష్‌ను కరోనా భయం వదల్లేదు. మాములుగానే కొంత భయస్తుడు కావడంతో కరోనా మహమ్మారి అతనిని మరింత భయపెట్టింది. మూడు రోజులుగా కరోనా సోకిందన్న భయంతో తీవ్ర మనోవేదన చెందిన లోకేశ్ కోగిలూరు నుంచి అత్తారింట్లో ఉన్న భార్య దగ్గరకు వెళతానని ఇంటి దగ్గర చెప్పాడు. వైరస్ సోకిందని.. ఇప్పుడు వెళ్లవద్దని ఎవరు చెప్పినా వినిపించుకోలేదు. బైక్‌పై అత్తారింటికి వెళ్లాడు.

    ఇంటి ముందు బైక్ ఆపి.. ఇంట్లో ఎవరినీ కలవకుండా తన దగ్గర ఉన్న ఫోన్‌ను ఇంట్లో పెట్టి అక్కడి నుంచి బయటకు వెళ్లాడు. బయటకు వెళ్లిన లోకేశ్ ఎంతకూ తిరిగిరాకపోవడంతో భార్య, అత్తమామలు అతని కోసం గాలించారు. ఎక్కడా కనిపించకపోవడంతో లోకేశ్ కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

    ఇది కూడా చదవండి: Warangal District: అఫైర్ పెట్టుకుందన్న డౌట్‌తో భార్య హత్య.. విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే మరో నిజం వెలుగులోకి..!

    మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు హాసన్ జిల్లాలోని కేరళపుర దగ్గర ఉన్న కావేరినది దగ్గర లోకేశ్ మృతదేహాన్ని గుర్తించారు. కరోనా సోకిందన్న మనోవేదనతో కావేరి నదిలో దూకి లోకేశ్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా తేల్చారు. ఇలా ఏడాది క్రితమే పెళ్లి చేసుకున్న లోకేశ్ జీవితం కరోనా భయం వల్ల అర్ధాంతరంగా ముగిసిపోయింది. కరోనా సోకినప్పటికీ భయపడవద్దని, ఆత్మ స్థైర్యంతో మహమ్మారిని జయించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    అగ్ర కథనాలు