A 24 YEAR OLD GROOM AND HIS TEENAGER NEIGHBOUR WERE KILLED WHEN THEIR MOTORCYCLE COLLIDED WITH A TRACTOR
Bike Accident: ఏప్రిల్ 30న ఆ యువకుడి పెళ్లి.. ఇంతలోనే ఎంతటి విషాదం..!
ప్రతీకాత్మక చిత్రం
పెళ్లికి ఇంకొన్ని వారాలే మిగిలి ఉండటంతో బంధుమిత్రులను స్వయంగా పిలిచేందుకు, పెళ్లి దుస్తులు కొనుక్కునేందుకు సూరజ్ తన పొరుగింటి అబ్బాయి అయిన 19 ఏళ్ల హీరాతో కలిసి బైక్‌పై వెళుతున్నాడు. మరో బైక్‌పై సూరజ్ తమ్ముడు అజయ్, సూరజ్ ఫ్రెండ్ రాహుల్ వెళుతున్నారు. కొసికల వెళ్లి షాపింగ్ చేశారు. షాపింగ్ అనంతరం.. వెడ్డింగ్ డ్రెస్‌ను టైలర్‌కు ఇచ్చి...
ఆగ్రా: పెళ్లికి ఇంకొన్ని వారాలు ఉందనగా పెళ్లి కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన యూపీలో ఆగ్రాలో వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సూరజ్ అనే 24 ఏళ్ల యువకుడికి ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. ఏప్రిల్ 30న పెళ్లి జరగాల్సి ఉంది. సూరజ్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లికి ఇంకొన్ని వారాలే మిగిలి ఉండటంతో బంధుమిత్రులను స్వయంగా పిలిచేందుకు, పెళ్లి దుస్తులు కొనుక్కునేందుకు సూరజ్ తన పొరుగింటి అబ్బాయి అయిన 19 ఏళ్ల హీరాతో కలిసి బైక్‌పై వెళుతున్నాడు. మరో బైక్‌పై సూరజ్ తమ్ముడు అజయ్, సూరజ్ ఫ్రెండ్ రాహుల్ వెళుతున్నారు. కొసికల వెళ్లి షాపింగ్ చేశారు. షాపింగ్ అనంతరం.. వెడ్డింగ్ డ్రెస్‌ను టైలర్‌కు ఇచ్చి పెళ్లికి స్నేహితులను పిలిచేందుకు హోడల్ వెళుతున్నారు. వెళ్లి అందరినీ పిలిచి తిరిగొస్తున్న క్రమంలో సూరజ్ బైక్‌ను క్రాస్ చేసి అతని తమ్ముడు, స్నేహితుడు రాహుల్ ముందుకెళ్లి ఒకచోట ఆగారు. అరగంట దాటినా సూరజ్, హీరా రాకపోవడంతో ఇంకా రాలేదేంటని సూరజ్‌కు కాల్ చేశారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో హీరాకు కాల్ చేశారు. హీరాకు కాల్ చేయగా వేరొకరు ఫోన్ లిఫ్ట్ చేసి జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్పారు. దీంతో.. సూరజ్ తమ్ముడు, రాహుల్ ఒక్కసారిగా షాక్‌కు లోనయ్యారు. అప్పటిదాకా తమతో వచ్చిన వారికి యాక్సిడెంట్ కావడమేంటని విస్మయం వ్యక్తం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 4.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సూరజ్ వెళుతున్న బైక్ అదుపు తప్పి ఆగ్రా వైపు వెళుతున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో సూరజ్, హీరా స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆసుపత్రికి తరలించే లోపే ఇద్దరూ చనిపోయారు. వారి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మరో పాతికరోజుల్లో పెళ్లి పెట్టుకుని సూరజ్ ఇక లేడన్న విషయాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. అతనిని పెళ్లి చేసుకోవాలనుకున్న యువతి కన్నీరుమున్నీరయింది. సూరజ్ స్వగ్రామంలో విషాదం నెలకొంది. పెళ్లి ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం అలుముకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్పీ శిరీష్ చంద్ర తెలిపారు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.