Home /News /crime /

A 24 YEAR OLD GIRL ENDED HER LIFE BY HANGING HERSELF TO THE CEILING FAN AND INCIDENT HAPPEND IN PUNE SSR

చూడటానికి అచ్చం హీరోయిన్‌లా ఉంది.. కానీ ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది..!

అజింక్యా, శ్రద్ధా

అజింక్యా, శ్రద్ధా

పుణెలోని వాకడ్ ప్రాంతానికి చెందిన శ్రద్ధా, అజింక్యా కుటుంబాలకు బంధుత్వముంది. ఇద్దరూ బావామరదల వరసవుతారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. అయితే.. ఎక్కడైనా ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో కలిసిన సందర్భంలో తప్ప పెద్దగా పరిచయం లేదు. అయితే.. ఈ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్న విషయం తెలుసుకున్న అబ్బాయి, అమ్మాయి కుటుంబాలు వారికి పెళ్లి చేయాలని నిర్ణయించాయి.

ఇంకా చదవండి ...
    పుణె: ఆ 24 ఏళ్ల యువతికి ఆమె ఇష్టపడిన ఓ యువకుడితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. పెళ్లి ఘనంగా జరిపించాలని ఇరు కుటుంబాలు భావించాయి. ఈలోపు యువతీయువకుడు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం ప్రారంభించారు. ఇద్దరూ ఒకరి ఫోన్ నంబర్లు ఒకరు తీసుకున్నారు. గంటల తరబడి కాల్స్‌లో మాట్లాడుకున్నారు. వీడియో కాల్స్‌లో ఒకరినొకరు రోజూ చూసుకున్నారు. వాట్సాప్‌లో చాటింగ్ చేసుకున్నారు. ఇద్దరూ కలిసి సినిమాలకు, షాపింగ్స్‌కు వెళ్లారు. ఈ క్రమంలోనే ఆ యువకుడి బండారం బట్టబయలైంది. ఆ యువకుడు అప్పటికే ఇద్దరు మహిళలతో అఫైర్ నడుపుతున్నట్లు తెలుసుకున్న ఆ యువతి పెళ్లికి నో చెప్పింది. దీంతో అందమైన అమ్మాయిని వదులుకోవడం ఇష్టం లేని ఆ యువకుడు తనను పెళ్లి చేసుకోవాల్సిందేనని ఆమెపై ఒత్తిడి చేశాడు. వేధించడం మొదలుపెట్టాడు. ఆ యువకుడి వేధింపులు తాళలేకపోయిన ఆ యువతి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ విషాద ఘటన పుణెలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పుణెలోని వాకడ్ ప్రాంతానికి చెందిన శ్రద్ధా, అజింక్యా కుటుంబాలకు బంధుత్వముంది. ఇద్దరూ బావామరదల వరసవుతారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. అయితే.. ఎక్కడైనా ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో కలిసిన సందర్భంలో తప్ప పెద్దగా పరిచయం లేదు. అయితే.. ఈ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్న విషయం తెలుసుకున్న అబ్బాయి, అమ్మాయి కుటుంబాలు వారికి పెళ్లి చేయాలని నిర్ణయించాయి. దీంతో.. ఆ ఇద్దరి మధ్య పరిచయం మరింత పెరిగింది. ఆ పరిచయంలోనే శ్రద్ధాకు అజింక్యా గురించి అసలు నిజం తెలిసింది.

    అజింక్యాకు అంతకు ముందే ఇద్దరితో అఫైర్ ఉందని తెలిసి ఆమె ఎంతో మనస్తాపానికి గురైంది. పెళ్లికి ముందే ఈ విషయం తెలియడంతో యువతి కుటుంబం జాగ్రత్త పడింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని అజింక్యాకు శ్రద్ధా చెప్పింది. ఎందుకు ఇష్టం లేదని అజింక్యా శ్రద్ధాను నిలదీశాడు. ఇద్దరు అమ్మాయిలతో అఫైర్ నడుపుతూ తనను ఎలా పెళ్లి చేసుకుంటావని అజింక్యా ప్రశ్నించింది. తన గురించి తెలిసిపోవడంతో అలాంటి సంబంధాలేవి తనకు లేవని అజింక్యా బుకాయించాడు. ఏదేమైనా తనను పెళ్లి చేసుకోవాల్సిందేనని ఆమెపై ఒత్తిడి చేశాడు. శ్రద్ధా అందుకు అంగీకరించకపోవడంతో ఆమెను వేధించసాగాడు. తనకు ఇష్టం లేదని చెప్పినా వినకుండా ఏప్రిల్ 2న శ్రద్ధా బర్త్‌డే రోజు అజింక్యా ఆమె ఇంటికి వెళ్లాడు. క్రాకర్లు కాల్చి.. కేక్ తీసుకెళ్లి నానా హడావుడి చేశాడు.

    ఇది కూడా చదవండి: Curfew In AP: ఏపీలో కరోనా కట్టడి కోసం విధించిన కర్ఫ్యూ ఈ యువతి జీవితాన్నే తలకిందులు చేసింది..!

    అంతేకాదు.. శ్రద్ధా బర్త్‌డే ఫొటోలను వాట్సాప్‌, ఫేస్‌బుక్ స్టేటస్‌లో పోస్ట్ చేసి.. తనకు కాబోయే భార్య అనే క్యాప్షన్‌ను జత చేశాడు. ఈ పరిణామంతో శ్రద్ధా తీవ్ర మనస్తాపం చెందింది. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి లోనైన శ్రద్ధా అజింక్య వేధింపులు భరించలేక ఏప్రిల్ 26న ఉదయం 7 గంటల సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. అజింక్యాపై కేసు నమోదు చేసిన పోలీసులు కనిపించకుండాపోయిన అతని తల్లిదండ్రుల కోసం గాలిస్తున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Arrange marriage, Pune, Pune news, Suicide

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు