• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • A 23 YEAR OLD MAN FROM MUMBAI FACED WITH SEVERE FINANCIAL CRUNCH KILLED A COMMUTER ON THE HARBOUR LINE LOCAL AND ROBBED HIM SSR

భార్య డెలివరీ ఖర్చుల కోసం భర్త దొంగతనాల బాట.. ఓ వ్యక్తిని చంపి అతని పర్స్‌లో చూడగా...

భార్య డెలివరీ ఖర్చుల కోసం భర్త దొంగతనాల బాట.. ఓ వ్యక్తిని చంపి అతని పర్స్‌లో చూడగా...

ప్రతీకాత్మక చిత్రం

షేక్(23) అనే వ్యక్తి లాక్‌డౌన్ కారణంగా ఆర్థికంగా పూర్తిగా చితికిపోయాడు. గర్భంతో ఉన్న తన భార్య డెలివరీ ఖర్చుల కోసం దొంగగా మారాడు. ఆ దొంగతనం చేసే క్రమంలోనే ఓ వ్యక్తిని హత్య చేసి...

  • Share this:
    ముంబై: మహారాష్ట్రలో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది. దీంతో.. ప్రభుత్వం నైట్ కర్ఫ్యూతో పాటు వారాంతపు లాక్‌డౌన్ విధించనున్నట్లు ప్రకటించింది. కరోనాను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్ ఒక్కటే మార్గం కావడంతో ప్రభుత్వాలకు కూడా ఆర్థికంగా నష్టపోతామని తెలిసినప్పటికీ లాక్‌డౌన్‌కే మొగ్గుచూపుతున్నాయి. అయితే.. గత సంవత్సరం విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో చాలామంది ఉపాధి కోల్పోయారు. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. అలా లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ముంబైకి చెందిన 23 ఏళ్ల వ్యక్తి దొంగగా మారాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. షేక్(23) అనే వ్యక్తి లాక్‌డౌన్ కారణంగా ఆర్థికంగా పూర్తిగా చితికిపోయాడు. గర్భంతో ఉన్న తన భార్య డెలివరీ ఖర్చుల కోసం దొంగగా మారాడు. ఆ దొంగతనం చేసే క్రమంలోనే ఓ వ్యక్తిని హత్య చేసి హంతకుడిగా మారాడు. ముంబైలోని హార్బర్ లైన్‌లో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తిని షేక్ హత్య చేశాడు. అతని పర్స్ తీసుకుని పరారయ్యాడు. ఆ పర్స్‌లో 70 రూపాయలు మాత్రమే ఉండటం గమనార్హం. హత్యకు గురైన వ్యక్తిని నీరజ్ జైశ్వాల్‌గా పోలీసులు గుర్తించారు. ఘట్కోపర్‌లోని జిప్ తయారుచేసే కంపెనీలో బాధితుడు పనిచేస్తున్నట్లు తెలిసింది. మార్చి 29న ఈ హత్య జరిగినట్లు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. షేక్‌ను పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడు. జైశ్వాల్ ఫోన్‌ను, వ్యాలెట్‌ను దొంగిలించినట్లు చెప్పాడు. జైశ్వాల్‌ను ఎటువంటి బెరుకూభయం లేకుండా పలుమార్లు పొడిచిన షేక్ అక్కడ నుంచి ఫోన్‌, వ్యాలెట్ దొంగిలించి పరారయినట్లు సీసీ ఫుటేజీలో స్పష్టమైంది. లాక్‌డౌన్ కారణంగా కొన్ని నెలలుగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానని, సియాన్ హాస్పిటల్‌లో ఉన్న భార్య డెలివరీకి డబ్బు అవసరం కావడంతో దొంగతనాల బాట పట్టినట్లు షేక్ చెప్పాడు.

    ఇదిలా ఉంటే.. హత్యకు గురైన జైశ్వాల్ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌గా పోలీసులు తెలిపారు. బతుకుదెరువు కోసం ముంబైకి వచ్చిన జైశ్వాల్ ఇలా హత్యకు గురికావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సొంతూర్లో ఉంటూ ఏదో ఒక పని చేసుకుని బతికినా తమ కొడుకు ప్రాణాలతో ఉండేవాడని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    అగ్ర కథనాలు