Gang Rape: ఆకలి తీరుస్తామని చెప్పి ఓ యువతిపై దారుణం.. అంబులెన్స్ లో ఆమెను నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లి..

ప్రతీకాత్మకచిత్రం

Gang Rape: కామంతో కల్లు మూసుకుపోయిన కామాంధులు ఏమి చేస్తారో వాళ్లకే తెలియదు. ఆకలేస్తుంది అన్నం పెట్టండంటూ దీనంగా అడిగిన ఓ యువతిపై ఇద్దరు కామాంధులు అంబులెన్స్ లో తీసుకెళ్లి అత్యాచారం చేశారు. పశువుల్లా మారి కామం తీర్చుకున్నారు. పూర్తి వివరాలు ఇలా..

  • Share this:
    కోవిడ్ కాలం.. ఆపై లాక్ డౌన్. డైలీ కూలీ చేసుకునే వారి పరిస్థితి దేశంలో దారుణంగా తయారైంది. తిండి లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. కొంత మంది బిక్షాటన కూడా చేసుకొని అడుక్కొని తింటున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు, కొంత మంది నాయకులు వారికి ఆహారం పంపిణీ చేసుకుంటూ వారి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. అయితే ఓ 22 ఏళ్ల మహిళ తనకు ఆకలేస్తుందంటూ అడగ్గా అన్నం పెడతామంటూ నమ్మించి ఇద్దరు వ్యక్తులు అంబులెన్స్ లో  ఆమెను ఎక్కించారు. నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. పశువుల్లా మారి కామం తీర్చుకున్నారు. అంబులెన్స్ డ్రైవర్ అందులో మరో యువకుడు కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్ లో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి.

    మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ఓ 22 ఏళ్ల ఓ యువతి ఆకలేస్తుందంటూ అడుగుతుండగా.. అంబులెన్స్ లో కూర్చున్న ఓ యువకుడు ఆమెను దగ్గరకు పిలిచారు. ఆకలేస్తోందని అడిగిన ఆమెను ఆహారం ఇస్తామని ఆశపెట్టి అంబులెన్స్ లోకి ఎక్కించారు. తరువాత ఆ అంబులెన్స్ ను ఓ నిర్మానిష్య ప్రాంతానికి తీసుకెళ్లి తమ కామవాంఛ తీర్చుకున్నారు. అంబులెన్స్ డ్రైవర్.. తన స్నేహిడితో కలిసి అత్యాచారానికి తెగబడ్డాడు. ప్రాణాలు పోసే అంబులెన్స్ లోనే ఆకలితో అలమటించిపోయే యువతిపై అత్యాచారానికి తెగబడ్డారు.

    ఈ ఘటన తరువాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసు అధికారి సురేంద్ర పంచోలి మాట్లాడుతూ.. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామని తెలిపారు. నిందితులపై సామూహిక అత్యాచారంతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశామని తెలిపారు. అంబులెన్స్ డ్రైవర్ ని, అతని స్నేహితుడిని అరెస్ట్ చేశామని..కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బాధితురాలి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశామని, ఆసుపత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు కూడా చేయించామని..ఇద్దరు అత్యాచారం చేసినట్లుగా తేలిందని తెలిపారు. వారిని కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.
    Published by:Veera Babu
    First published: