హోమ్ /వార్తలు /క్రైమ్ /

గర్ల్ ఫ్రెండ్‌తో ఘర్షణ.. 22 మంది ప్రాణాలు గాల్లోకి.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..

గర్ల్ ఫ్రెండ్‌తో ఘర్షణ.. 22 మంది ప్రాణాలు గాల్లోకి.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..

ప్రతికాత్మక చిత్రం

ప్రతికాత్మక చిత్రం

అంతటితో ఆగకుండా 50 కిలోమీటర్ల దూరంలోని మరో ప్రాంతంలోకి వెళ్లి కాల్పులకు దిగాడు. కొన్ని ఇళ్లకు సైతం నిప్పు పెట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఎదురుకాల్పులకు దిగారు.

ఓ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్‌తో ఏదో విషయమై.. గొడవ పడ్డాడు. దీంతో ఆ వ్యక్తి ఏకంగా 22 మందిని తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటన కెనడాలోని నోవాస్కోటియాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కెనడాలోని హాలిఫాక్స్ సమీపంలోని డార్ట్ మౌత్‌లో గాబ్రియేల్ వర్ట్‌మన్ కృతిమ దంతాలు అమర్చే పని చేస్తుంటాడు. అయితే అతడు ఆదివారం పోలీసులు యూనిఫాం ధరించి పెట్రోలింగ్ వాహనంలా ఉండే ఓ వాహనంలో నొవాస్కోటియా ప్రావిన్స్ పొర్టాపిక్ పట్టణానికి వచ్చాడు. అక్కడి ఓ ఇంటిలోకి ప్రవేశించి.. అందులో వారిని తుపాకితో కాల్చి చంపాడు. అంతటితో ఆగకుండా 50 కిలోమీటర్ల దూరంలోని మరో ప్రాంతంలోకి వెళ్లి కాల్పులకు దిగాడు. కొన్ని ఇళ్లకు సైతం నిప్పు పెట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఎదురుకాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఓ మహిళా పోలీసు చనిపోగా, గాబ్రియేల్ మాత్రం ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డాడు. కెనడా చరిత్రలోనే అత్యంత విషాద ఘటనగా చెబుతున్నఈ ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే దీనంతటికి కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే. తన గర్ల్ ఫ్రెండ్‌తో జరిగిన ఘర్షణ వల్లే గాబ్రియేల్ ఇంతటి దుస్సాహాసానికి ఒడిగట్టాడు.

First published:

Tags: Canada, Crime news, Gun fire

ఉత్తమ కథలు