హోమ్ /వార్తలు /క్రైమ్ /

21 ఏళ్ల ఈ యువతిని కట్టేసి కొట్టారు.. స్టేషన్‌లో ఆమె చెప్పింది విని బుర్ర తిరిగిపోయింది..!

21 ఏళ్ల ఈ యువతిని కట్టేసి కొట్టారు.. స్టేషన్‌లో ఆమె చెప్పింది విని బుర్ర తిరిగిపోయింది..!

యువతిని స్తంభానికి కట్టేసిన దృశ్యం

యువతిని స్తంభానికి కట్టేసిన దృశ్యం

అహ్మదాబాద్‌లోని నరోడా ప్రాంతంలో ఓ జ్యూయలరీ షాప్‌కు షాపింగ్ చేస్తున్నట్టుగా 21 ఏళ్ల యువతి వెళ్లింది. ‘అది చూపించండి.. ఇది చూపించండి’ అంటూ మాటల్లో పెట్టి బంగారం దొంగిలించేందుకు ప్రయత్నించింది. ఆమె దొంగతనాన్ని గమనించిన షాప్ యజమాని ఆమె పారిపోకుండా పట్టుకుని...

ఇంకా చదవండి ...

అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఓ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దొంగతనం చేసేందుకు ప్రయత్నించిందని 21 ఏళ్ల యువతిని స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ యువతి దొంగతనానికి ప్రయత్నించినప్పటికీ పోలీసులకు సమాచారమివ్వకుండా ఇలా కట్టేసి కొట్టడంపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం అహ్మదాబాద్‌లోని నరోడా ప్రాంతంలో ఓ జ్యూయలరీ షాప్‌కు షాపింగ్ చేస్తున్నట్టుగా 21 ఏళ్ల యువతి వెళ్లింది. ‘అది చూపించండి.. ఇది చూపించండి’ అంటూ మాటల్లో పెట్టి బంగారం దొంగిలించేందుకు ప్రయత్నించింది. ఆమె దొంగతనాన్ని గమనించిన షాప్ యజమాని ఆమె పారిపోకుండా పట్టుకుని చుట్టుపక్కన ఉన్నవారందరినీ పిలిచాడు. ఈ యువతి షాప్‌లో దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తుంటే పట్టుకున్నానని అందరికీ చెప్పాడు. అక్కడ గుమిగూడిన చుట్టుపక్కల వారందరి ముందే ఆ యువతిని రోడ్డు పక్కన ఉన్న స్తంభానికి కట్టేశారు. ఆమె చేతులను తాళ్లతో కట్టేసిన తర్వాత ఆ యువతిని దుర్భాషలాడుతూ దాడికి దిగారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు. పోలీసులు వెళ్లే సరికి ఆమెను స్తంభానికి కట్టేసి ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. అసలు అప్పటిదాకా ఏమీ జరగనట్టు, ఆమెను ఎవరో వచ్చి కట్టేసి వెళ్లిపోయినట్లు ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయారు. ఆమెకు కట్లు విప్పిన పోలీసులు ఆ యువతిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు.

దీంతో.. ఆమె అసలు నిజం బయటపెట్టింది. దొంగతనానికి ప్రయత్నించిన మాట వాస్తవమేనని.. కానీ దాని వెనుక ఓ కారణం ఉందని ఆమె చెప్పింది. తాను అంతకు ముందు ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేశానని.. ప్రస్తుతం ఉద్యోగం కోల్పోయానని చెప్పింది. కొన్నిరోజుల క్రితం తనకు తెలిసిన వ్యక్తి ‘నవ్‌కర్ ఆర్నమెంట్స్’‌లో చోరీ చేయమని చెప్పి తనను ఇప్పుడు బ్లాక్‌మెయిల్ చేశాడని తెలిపింది.

ఇది కూడా చదవండి: Chopper ride: అత్తారింటికి హెలికాప్టర్‌లో నవ వధువు... చాపర్ అద్దెకు వరుడికి ఎంత ఖర్చంటే...


షాప్‌లోకి వెళ్లి మత్తు మందును ఓనర్‌పై స్ప్రే చేసి జ్యూవెలరీని దొంగిలించి తీసుకొచ్చి తనకు ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు చెప్పింది. తాను చెప్పినట్లు చేయకపోతే.. నీకున్న అఫైర్ గురించి బయటపెడతానని తనను బెదిరించాడని ఆమె పోలీసుల విచారణలో వెల్లడించింది. ఈ బెదిరింపు వ్యవహారం తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. ఓ వ్యక్తితో తనకు కొంతకాలంగా అఫైర్ ఉందని ఆ యువతి అంగీకరించింది. ఈ విషయం బయట తెలిస్తే ఇబ్బందన్న భయంతోనే.. దొంగతనానికి ప్రయత్నించానని తెలిపింది. ఇదిలా ఉండగా.. ఆ యువతిని అమానుషంగా స్తంభానికి కట్టేసిన వ్యక్తులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

First published:

Tags: Ahmedabad, Crime news, Theft

ఉత్తమ కథలు