Home /News /crime /

A 21 YEAR OLD MAN POSED AS A LESBIAN MODEL ON SOCIAL MEDIA AND SECURED NUDE PHOTOS OF AROUND 40 GIRLS TO BLACKMAIL THEM SSR

Shamful Incident: ఛీఛీ.. ఒక మగాడివి అయి ఉండి ఇలాంటి పని చేయడానికి సిగ్గుగా అనిపించడం లేదూ..

నిందితుడు

నిందితుడు

ఆ యువకుడి వయసు 21 సంవత్సరాలు. కష్టపడకుండా డబ్బు సంపాదించాలనుకున్నాడు. అందుకు ఓ తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. చివరికి కటకటాల పాలై ఊచలు లెక్కిస్తున్నాడు.

  బెంగళూరు: ఆ యువకుడి వయసు 21 సంవత్సరాలు. కష్టపడకుండా డబ్బు సంపాదించాలనుకున్నాడు. అందుకు ఓ తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. చివరికి కటకటాల పాలై ఊచలు లెక్కిస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని బానస్‌వాడి ప్రాంతానికి చెందిన నాచప్ప ఓ ప్రైవేట్ కాలేజీలో బీఎస్సీ ఫైనలియర్ చదువుతున్నాడు. జల్సాలకు అలవాటు పడిన ఈ యువకుడు అందుకు డబ్బు సంపాదించేందుకు ఘరానా ప్లాన్ వేశాడు. చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్‌ను వాడుకుని ఇన్‌స్టాగ్రాంలో ఓ ఫేక్ ఐడీ క్రియేట్ చేశాడు. తనను తాను లెస్బియన్‌గా పరిచయం చేసుకున్నాడు. తాను పురుషుడనే విషయం తెలియకుండా ఉండేందుకు డిస్‌ప్లే పిక్చర్ మొదలుకుని అన్ని విషయాల్లో జాగ్రత్త పడ్డాడు. లెస్బియన్ శృంగారం పట్ల ఆసక్తి ఉన్న కొందరు మహిళలు, యువతులు ఇతను నిజంగానే లెస్బియన్ అనుకుని నమ్మారు. కాదు.. కాదు.. అంతలా వాళ్లను ఇతగాడు నమ్మించాడు.

  ఇది కూడా చదవండి: Wife: భర్తతో ఇంత ప్రేమగా ఉన్నావు కదా.. ఇలా ఎందుకు చేయాలనిపించింది.. కలికాలం..

  ఇంకేముంది.. అవతలి మహిళలతో సెక్సువల్ చాట్‌తో మొదలుపెట్టి మెల్లిగా బాగా నమ్మకం ఏర్పడ్డాక వారి నగ్న ఫొటోలను పంపించమని అడిగేవాడు. ఇతను నిజంగానే లెస్బియన్ అని భావించిన అవతలి మహిళలు నగ్నంగా ఉన్న స్థితిలో ఫొటోలు తీసుకుని నాచప్పకు పంపేవారు. ఆ ఫొటోలు వచ్చాక ఇతని అసలు గేమ్ మొదలవుతుంది. ఫొటోలు వేరే డివైజ్‌లో సేవ్ చేసుకున్న తర్వాత తాను అబ్బాయినన్న విషయాన్ని బయటపెట్టేవాడు. ఆ నిజం తెలిసి ఫొటోలు పంపిన ఆ మహిళలు కంగుతినేవారు. ఆ ఫొటోలను అడ్డం పెట్టుకుని వాళ్లను బ్లాక్‌మెయిల్ చేసేవాడు.

  ఇది కూడా చదవండి: Bangalore: నట్టింట్లో నువ్వు చేసిన పాపాన్ని పదేళ్ల కొడుకు బయట పెట్టాడు కదమ్మా.. నిద్రపోతున్న కొడుకు.. మెలకువ వచ్చి చూసేసరికి..

  ఎక్కువ డబ్బులు అడిగితే పోలీసులకు చెబుతారనే భయం ఉందో ఏమో.. ఒక్కొక్కరి దగ్గర రూ.4 వేల నుంచి రూ.10 వేల వరకూ మాత్రమే వసూలు చేశాడు. ఇలా దాదాపు రెండు లక్షల దాకా వసూలు చేశాడు. కాలేజీ యువతులను టార్గెట్ చేసి ఫ్రెండ్ రిక్వెస్ట్స్ పంపేవాడు. తనను తాను ప్రతీక్ష అనే పేరుతో పరిచయం చేసుకునేవాడు. ఇన్‌‌స్టాగ్రాం ఐడీ కూడా ‘prathiksha_bohar_in’ అనే పేరుతో క్రియేట్ చేశాడు. తాను మోడల్‌నని అందరినీ నమ్మించేవాడు.

  ఇది కూడా చదవండి: Shocking Incident: వామ్మో.. నువ్వేం కొడుకువిరా నాయనా.. ఆ టైంలో యాపిల్ తిన్నావా..

  సెప్టెంబర్ 2021లో నాచప్ప ఈ ఫేక్ ఐడీని ఓపెన్ చేశాడు. మోడల్స్ కావాలనుకుంటున్న అమ్మాయిలకు తాను సాయం చేస్తానని కూడా నమ్మబలికేవాడు. తాజాగా.. ఓ యువతి ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఫేక్ గాడి బాగోతానికి తెరపడింది. లెస్బియన్ రిలేషన్ షిప్ కోసం ఎదురుచూస్తున్నానని.. ఇంటర్నెట్ నుంచి ఎవరి నగ్న దృశ్యాలనో డౌన్‌లోడ్ చేసుకుని ఆ ఫొటోలు తనవేనంటూ పంపేవాడు. దీంతో.. అవతలి మహిళలు నిజంగానే అమ్మాయేనని నమ్మేవారు. ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఇంటి నుంచే నాచప్ప ఈ తప్పుడు పని చేశాడు. పోలీసులు అతనిని ఇంటికెళ్లి అరెస్ట్ చేశారు. కొడుకు చేసిన పనులు తెలిసి అతని తల్లిదండ్రులు కుంగిపోయారు. ‘ఈజీ మనీ’ కోసం అడ్డదారులు తొక్కే ఎవరికైనా ఏదో ఒకరోజు ఇలాంటి పరిస్థితి రాక తప్పదని పోలీసులు హెచ్చరించారు. నాచప్ప చేసిన పని ఇరుగుపొరుగు వారికి కూడా తెలియడంతో అతని కుటుంబం తలెత్తి తిరగలేని పరిస్థితి ఏర్పడింది.
  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Bangalore, Blackmail, Crime news, Nude videos blackmails

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు