A 21 YEAR OLD FLIRTING WITH A MARRIED WOMAN THEN DID THIS HORRIFIC CRIME IN KOLAR DISTRICT SSR
Shocking: ఊళ్లో వాళ్ల భార్యలతో ఇలా అఫైర్లు పెట్టుకోవద్దని ఈ 21 ఏళ్ల కుర్రాడికి ఈ పెద్దాయన చెప్తే..
నిందితుడు అభిషేక్, హత్యకు గురైన నారాయణ స్వామి
ఆ యువకుడి వయసు 21 సంవత్సరాలు. బాగా చదువుకుని బాగుపడాల్సిన వయసులో అడ్డదారులు తొక్కాడు. ఆ ఊరిలో పెళ్లైన కొందరు మహిళలను ట్రాప్ చేసి వాళ్లతో అఫైర్ కొనసాగించడమే పనిగా పెట్టుకున్నాడు.
కోలార్: ఆ యువకుడి వయసు 21 సంవత్సరాలు. బాగా చదువుకుని బాగుపడాల్సిన వయసులో అడ్డదారులు తొక్కాడు. ఆ ఊరిలో పెళ్లైన కొందరు మహిళలను ట్రాప్ చేసి వాళ్లతో అఫైర్ కొనసాగించడమే పనిగా పెట్టుకున్నాడు. ఊళ్లో కొందరు ఆడవాళ్లతో ఆ యువకుడు కొనసాగిస్తున్న వివాహేతర సంబంధాల గురించి ఆ ఊరి పెద్ద ఒకరికి తెలిసింది. ఆ యువకుడికి పద్ధతి మార్చుకోమని చెప్పాడు. ఇంతలో ఊరిలో ఒక మహిళ భర్తతో గొడవ కారణంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. సదరు మహిళతో ఆ యువకుడికి ఉన్న అఫైర్ గురించి ఈ ఊరి పెద్దకు తెలుసు. భార్యాభర్తల మధ్య ఇదే విషయంలో గొడవ జరిగి ఆ మహిళ ఆత్మహత్య చేసుకుందని ఆ పెద్దకు తెలిసింది. ఇకనైనా ఇలా ఇతరుల భార్యలతో సంబంధాలు మాని బుద్ధిగా ఉండాలని ఆ యువకుడికి సదరు ఊరి పెద్ద చెప్పాడు.
అయితే.. తాను ఇతర మహిళలతో నడుపుతున్న అఫైర్ల గురించి ఆ పెద్ద మనిషి ఊళ్లో వాళ్లందరికీ చెబుతాడేమోనన్న భయంతో ఆ యవకుడు సదరు ఊరి పెద్దను హత్య చేశాడు. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని కోలార్ జిల్లాలో వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. కోలార్ జిల్లా బంగారపేట్ తాలూకాలో పూగనహళ్లి అనే ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో అభిషేక్ అనే 21 ఏళ్ల యువకుడు ఉన్నాడు. బెతమంగలలో డిగ్రీ చదువుతున్న అభిషేక్ స్త్రీలపై కోరికలతో రగిలిపోయేవాడు. నీలిచిత్రాలకు అలవాటుపడ్డాడు. తన కామోద్రేకాన్ని తీర్చుకునేందుకు ఊరిలో తనకు నచ్చిన స్త్రీలను.. కేవలం పెళ్లైన మహిళలనే టార్గెట్ చేసి ట్రాప్ చేశాడు. అభిషేక్ మాయలో పడే సదరు మహిళలు భర్తలకు తెలియకుండా ఇతనితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించేవారు. అభిషేక్ ఇలా ప్రవర్తిస్తున్న విషయం అదే గ్రామానికి చెందిన పెద్ద మనిషి నారాయణస్వామికి తెలిసింది. చదువుకుంటున్న కుర్రాడు కావడంతో భవిష్యత్ పాడవుతుందని భావించి అభిషేక్‌తో మాత్రమే ఒకసారి మాట్లాడి పద్ధతి మార్చుకోవాలని సూచించాడు. అయినా అభిషేక్ నారాయణస్వామి మాటలను పెడచెవిన పెట్టాడు. తనతో అఫైర్ పెట్టుకున్న పెళ్లైన మహిళలతో ఎప్పటిలానే సీక్రెట్‌గా వారిని కలుస్తుండటం, వారి భర్తలు ఇంట్లో లేనప్పుడు వెళ్లి ఆ మహిళలతో గడపడం చేస్తుండేవాడు.
అయితే.. అక్టోబర్‌లో ఇతనితో అఫైర్ కొనసాగించిన ఒక మహిళ భర్తతో జరిగిన గొడవ కారణంగా ఆత్మహత్యకు పాల్పడి చనిపోయింది. తన భార్య ఎవరితోనో అఫైర్ నడుపుతోందని భావించిన ఆమె భర్త గొడవ పెట్టుకోవడంతో మనస్తాపంతో ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. తన భార్య అఫైర్ పెట్టుకుంది అభిషేక్‌తో అనే విషయం సదరు భర్తకు తెలియదు. ఆమె చనిపోయిన విషయం తెలుసుకున్న నారాయణ స్వామి అభిషేక్‌ను పిలిచి గట్టిగా మందలించాడు. ‘నీ వల్ల ఒక మహిళ చనిపోయింది. ఇకనైనా వేరే వాళ్ల భార్యలతో తిరగడం మానుకో. లేకపోతే ఇబ్బంది పడతావ్’ అని నారాయణస్వామి హెచ్చరించాడు. ఈ హెచ్చరికతో అభిషేక్ భయపడ్డాడు. తన ఇతర అఫైర్ల గురించి నారాయణ స్వామి బయటపెడితే కష్టమని భావించి అతనిని చంపాలని నిర్ణయించుకున్నాడు. నవంబర్ 2న నారాయణస్వామి బైక్‌పై వెళుతుండగా ఓ కాలువపై ఉన్న బ్రిడ్జి దగ్గర అభిషేక్ అతని బైక్‌ను ఆపాడు. నారాయణస్వామిని దారుణంగా హత్య చేశాడు. అతని తలను, మొండాన్ని వేరు చేసి కాలువ పక్కన పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గంటల వ్యవధిలోనే హత్య కేసును ఛేదించారు. నిందితుడు అభిషేక్‌ను అరెస్ట్ చేశారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన అభిషేక్‌ను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.