పోలీస్‌ దేహదారుఢ్య పరీక్షల్లో పరుగెత్తూతూ.. మహిళా అభ్యర్థి మృతి

పోలీస్‌ దేహదారుఢ్య పరీక్షలకు హాజరైనా ఓ యువతి..పరుగెత్తూతూ మరణించింది. ఈ ఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది.

news18-telugu
Updated: February 18, 2019, 1:09 PM IST
పోలీస్‌ దేహదారుఢ్య పరీక్షల్లో పరుగెత్తూతూ.. మహిళా అభ్యర్థి మృతి
కరీంనగర్‌ పోలీస్ ఈవెంట్స్‌లో మరణించిన మహిళ అభ్యర్థి మమత
  • Share this:
పోలీస్‌ దేహదారుఢ్య పరీక్షలకు హాజరైనా ఓ యువతి..పరుగెత్తూతూ మరణించింది. ఈ ఘటన కరీంనగర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..కరీంనగర్‌ లోని సిటీ పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్లో పోలీస్‌ దేహదారుఢ్య పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పోటీలకు 20 సంవత్సరాల మమత హాజరైంది. అయితే ఈ పోటి పరీక్షల్లో భాగంగా నిర్వహించే 100 మీటర్ల పరుగులో పాల్గొని కుప్పకూలిపోయింది. దీంతో మమతకు హూటాహుటిన అక్కడ ఉన్న పోలీసులు ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తరువాత ప్రభుత్వ దవఖానకు తరలించారు. కానీ అప్పటికే పరిస్థతి అదుపుతప్పడంతో మమత చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై స్పందించిన కరీంనగర్‌ పోలీస్ కమిషనర్‌ బి. కమల్‌హసన్‌ రెడ్డి మాట్లాడుతూ.. వైద్య పరంగా అన్ని సహయాలు అందించామని అయిన కూడా ప్రాణాలు దక్కలేదన్నారు. అయితే అభ్యర్థి తల్లిదండ్రలకు ప్రభుత్వ సాయం అందేలా ప్రయత్నిస్తామని తెలిపారు. అంతేకాకుండా.. అభ్యర్థులకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లైతే.. ముందే తెలియజేయలన్నారు. అప్పుడే అభ్యర్థులకు కావాల్సీన అదనపు ఏర్పాట్లను చేస్తామన్నారు.

First published: February 18, 2019, 1:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading