Boy rape : అలసిపోయావు.. నాతో రా అన్నాడు.. ఒక్కసారిగా చెట్ల పొదల్లో తీసుకువెళ్లి ..

Boy rape : అలసిపోయావు.. నాతో రా అన్నాడు.. ఒక్కసారిగా చెట్ల పొదల్లో తీసుకువెళ్లి ..

Boy rape : పరిచయమున్న వ్యక్తే కదా అని ఓ 20 సంవత్సరాల యుయకుడు నమ్మి ఆతని చేత వాకింగ్‌ కోసం వెళ్లాడు.. అంతే ఒక్కసారిగా ఆ యువకుడిని చెట్ల ముళ్లపొదల్లోకి తీసుకువెళ్లి అమాంతంగా మీదపడి దారుణానికి దిగాడు.

 • Share this:
  కామంతో కళ్లు మూసుకుపోయిన వారికి ఆడ, మగ ( boy or girl ) అనే తేడా లేకుండా వ్వహహరిస్తున్నారు.. తమ అవసరాలకు ఎవ్వరైనా పర్వాలేదనే హేయమైన ఆలోచనలతో మగాళ్లపై కూడా అత్యాచారాలకు పాల్పడుతున్నారు.

  తాజాగా కర్ణాటకలోని ( karnataka) బెల్గాం జిల్లాలో 20 ఏళ్ల యువకుడిపై మరొక వ్య​క్తి దారుణానికి ఒడిగట్టాడు. ఇక ఇదే విషయంపై దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూర్‌ కబాక అనే గ్రామానికి చెందిన యువకుడు ( youth ) శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సరదాగా వాకింగ్ చేద్దామని బయటికి వెళ్లాడు. అతను ఇంటికి తిరిగొచ్చాక భయంతో వణికిపోతుండటం, దుస్తుల నిండా బురద ఉండటం గమనించిన అతని తండ్రి కంగారుపడి ఏం జరిగిందని అడగాడు... దీంతో ఆ యువకుడు ఏడుస్తూ అసలు విషయం చెప్పాడు.

  ఇది చదవండి : ఇంట్లోనే ఉండి ఉద్యోగం చేసే ఛాన్స్.. నెలకు రూ.30వేల జీతం


  కబాక గ్రామానికే చెందిన మొహ్మద్ హనీఫ్‌తో బాధిత కుటుంబానికి పరిచయం ఉంది. యువకుడు వాకింగ్‌కు ( walking ) వెళ్లినప్పుడు రైల్వే ట్రాక్ సమీపంలో హనీఫ్ అతడిని పలకరించాడు. తెలిసినవాడే అని యువకుడు కూడా మాట కలిపాడు. చాలా సేపటి నుంచి వాకింగ్ చేస్తున్నావుగా చెరుకు రసం ( juse ) తాగిస్తానంటూ నమ్మబలికాడు హనీఫ్. ఇక అదే నెపంతో యువకుణ్ని పట్టుకుని చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం ( rape ) చేశాడు. అంతేగాక ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.

  ఇది చదవండి : డేరా బాబాకు జీవిత ఖైదు.. 20 సంవత్సరాల తర్వాత తేలిన మర్డర్ కేసు.. !


  చివరికి జరిగిన ఘటనపై బాధిత యువకుడి తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ( police case ) హనీఫ్పై అత్యాచార కేసు నమోదుచేసి అరెస్టు ( arrest ) చేశారు. నిందితుడు హనీఫ్‌పై ఐపీసీ 504, 323, 377, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పుత్తూరు పోలీసులు పేర్కొన్నారు.

  అయితే గతంలో ఇలాంటీ సంఘటనలు అనేకం ఉన్నాయి. యువకులపై దాడులు చేయడం ఆ తర్వాత వారిని హతమార్చిన సంఘటనలు కూడ సమాజంలో చోటు చేసుకున్నాయి. ఇలా ఓవైపు మహిళలు, మరోవైపు మగవారిని కూడా ఇలాంటీ దారుణాలకు పాల్పడడం ఆందోళన కల్గిస్తున్న అంశాలు.

  కాగా ఇటివల కార్ణాటకలోని మైసూరు ప్రాంతంలో ఓ కాలేజీ యువతి యువకులపై దాడి చేసి ఆరుగురు
  యువకులు అంత్యంత కిరాతంగా వారిపై అత్యాచారం చేశారు. సృహ కోల్పోయినా వారిని అడవిలోనే వదిలేసి పారిపోయారు. దీంతో బయటపడిన యువతి యువకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం సంచలనంగా మారింది. దీంతో వారం రోజుల తర్వాత అత్యాచారానికి పాల్పడిన ఆరుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.. కాగా తాజాగా ఈ సంఘటన చోటు చేసుకోవడంతో కర్టాటక పోలీసులు అలర్ట్ అయ్యారు. అత్యాచారాలపై ఉక్కు పాదం మోపేందుకు సిద్దమమ్యారు.
  Published by:yveerash yveerash
  First published: