హోమ్ /వార్తలు /క్రైమ్ /

Sad: ఈ యువతి రాత్రి భోజనం చేసి రోజూలానే నిద్రపోవడానికి గదిలోకి వెళ్లింది.. కానీ ఊహించని విధంగా...

Sad: ఈ యువతి రాత్రి భోజనం చేసి రోజూలానే నిద్రపోవడానికి గదిలోకి వెళ్లింది.. కానీ ఊహించని విధంగా...

రిబుల్ (ఫైల్ ఫొటో)

రిబుల్ (ఫైల్ ఫొటో)

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ పరిధిలోని కల్యాణ్‌పూర్‌లో విషాద ఘటన జరిగింది. ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తున్న రిబుల్ అలియాస్ శివ అనే 20 ఏళ్ల యువతి ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్పాట్‌లో లభ్యమైన డైరీలో ఆమె ఓ విషయాన్ని రాసింది.

ఇంకా చదవండి ...

  కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ పరిధిలోని కల్యాణ్‌పూర్‌లో విషాద ఘటన జరిగింది. ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తున్న రిబుల్ అలియాస్ శివ అనే 20 ఏళ్ల యువతి ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్పాట్‌లో లభ్యమైన డైరీలో ఆమె ఓ విషయాన్ని రాసింది. తన స్నేహితుడు అమన్‌ను ఉద్దేశించి రాసిన రిబుల్.. ఫొటోను వైరల్ చేస్తానని అతను బెదిరిస్తున్నాడని రాసింది. ఇంతకీ ఆ ఫొటో ఏంటి, ఆమె స్నేహితుడు అమన్ ఎవరు, బెదిరిస్తున్న ఆ వ్యక్తి ఎవరు.. ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. రిబుల్ అలియాస్ శివ అనే యువతి సొంత ఊరు ఎటావా జిల్లాలోని ఉష్రహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న విష్ణుపూర అనే గ్రామం. ఆమె రమా డెంటల్ కాలేజ్‌లో ఏఎన్‌ఎం కోర్సు పూర్తి చేసి కేశవపురంలో ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో రెండు నెలల నుంచి స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తోంది. హాస్పిటల్ దగ్గరలోనే ఓ ఇంట్లో పేయింగ్ గెస్ట్‌గా ఉంటోంది. ఆదివారం రాత్రి రోజూలానే భోజనం చేసిన రిబుల్ నిద్రపోవడానికి తన గదిలోకి వెళ్లింది.

  అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఆమె గదిలో నుంచి ఏదో కిందపడినట్లు శబ్దం రావడంతో ఇంటి యజమాని వెళ్లి చూసింది. ఫ్యానుకు ఉరేసుకుని వేలాడుతూ రిబుల్ కనిపించింది. దీంతో.. భయంతో ఇంటి యజమాని కేకలేయడంతో ఇరుగుపొరుగు వాళ్లు వచ్చారు. అప్పటికే ఆమె చనిపోయింది. పోలీసులకు, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని కిందకు దించారు. ఆమె గదిలో ఓ డైరీ లభ్యమైంది. ఆ డైరీలో కొన్ని గంటల క్రితమే రాసినట్టుగా కొన్ని వాక్యాలు కనిపించాయి. ‘అమన్.. వాడు ఫొటోను వైరల్ చేస్తానని బెదిరిస్తున్నాడు’ అని అందులో రాసి ఉంది. పోలీసుల విచారణలో అమన్ ఆమె స్నేహితుడని తెలిసింది. అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసి అమన్ భయంతో కనిపించకుండా పోయాడు.

  ఇది కూడా చదవండి: Shocking Twist: హోటల్‌లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో పోలీసుల రైడ్.. శృంగారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ఈ జంట ఎవరో తెలిసి..

  ఆమె ఫోన్‌ను పరిశీలించగా.. ఓ ఫ్రెండ్‌తో వీడియో కాల్ మాట్లాడినట్లు తెలిసింది. ఆ ఫ్రెండ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇంకా.. ఆమె తన డైరీలో చాలానే రాసింది. ‘మనశ్శాంతి ఎక్కడుంది అమన్.. నువ్వు హాస్పిటల్‌కు ఎందుకు రావడం లేదు. నువ్వు రాకపోవడంతో నా బుర్ర పనిచేయడం లేదు. వాడి ఫోన్ కాల్‌ను నువ్వు ఎత్తవద్దు. మనం వాడి నంబర్‌ను బ్లాక్ చేద్దాం. వాడు నీ నుంచి ఏమీ అడగలేదు కదా. ఏమైనా అడిగి ఉంటే చెప్పు. ఏం చెప్పాలో నాకే అర్థం కావడం లేదు. ఫొటోను వైరల్ చేయమంటావా అని నన్ను బెదిరిస్తున్నాడు’ అని రిబుల్ ఆ డైరీలో రాసుకొచ్చింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆమె మృతదేహాన్ని చూసి చెల్లెళ్లు, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Crime news, Hospitals, Suicide hanging, Uttar pradesh

  ఉత్తమ కథలు