హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking: రెండేళ్ల కొడుకును బావిలో పడేసిన తల్లి.. ప్రాణం పోయేదాకా అక్కడే నిల్చుని బావిలోకి చూస్తూ..

Shocking: రెండేళ్ల కొడుకును బావిలో పడేసిన తల్లి.. ప్రాణం పోయేదాకా అక్కడే నిల్చుని బావిలోకి చూస్తూ..

మనుషుల్లో మానవత్వం రోజురోజుకూ అంతరించిపోతుంది. కన్న ప్రేమ కూడా కొందరిలో కనుమరుగైపోతుంది. కన్న బిడ్డను టాయిలెట్ ఫ్లష్ ట్యాంక్‌లో వేసి చంపిన తల్లికి సంబంధించిన ఘటన మరువక ముందే మరో ఘటన తాజాగా కలకలం రేపుతోంది.

మనుషుల్లో మానవత్వం రోజురోజుకూ అంతరించిపోతుంది. కన్న ప్రేమ కూడా కొందరిలో కనుమరుగైపోతుంది. కన్న బిడ్డను టాయిలెట్ ఫ్లష్ ట్యాంక్‌లో వేసి చంపిన తల్లికి సంబంధించిన ఘటన మరువక ముందే మరో ఘటన తాజాగా కలకలం రేపుతోంది.

మనుషుల్లో మానవత్వం రోజురోజుకూ అంతరించిపోతుంది. కన్న ప్రేమ కూడా కొందరిలో కనుమరుగైపోతుంది. కన్న బిడ్డను టాయిలెట్ ఫ్లష్ ట్యాంక్‌లో వేసి చంపిన తల్లికి సంబంధించిన ఘటన మరువక ముందే మరో ఘటన తాజాగా కలకలం రేపుతోంది.

  లాతూర్: మనుషుల్లో మానవత్వం రోజురోజుకూ అంతరించిపోతుంది. కన్న ప్రేమ కూడా కొందరిలో కనుమరుగైపోతుంది. కన్న బిడ్డను టాయిలెట్ ఫ్లష్ ట్యాంక్‌లో వేసి చంపిన తల్లికి సంబంధించిన ఘటన మరువక ముందే మరో ఘటన తాజాగా కలకలం రేపుతోంది. మహారాష్ట్రలోని లాతూర్‌లో మానవత్వం మంటగలిసింది. కన్న బిడ్డను ఓ తల్లి కాటికి సాగనంపిన దాకా నిద్రపోలేదు. కన్న కొడుకును బావిలో పడేసి చనిపోయిన దాకా ఆ తల్లి బావిపైనే కూర్చుని కర్కశంగా ప్రవర్తించిన ఘటన లాతూర్‌లో వెలుగుచూసింది.

  ఈ అమానుష ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. లాతూర్ జిల్లా నీలాంగా తాలూకాలోని కెల్గావ్ సమీపంలోని రాథోడా గ్రామానికి చెందిన మాయా అనే మహిళకు రెండేళ్ల వయసున్న సంపత్ అనే బాబు ఉన్నాడు. ఆమె భర్త వెంకట్ లాతూర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో వాచ్‌మెన్‌గా పనిచేస్తుండేవాడు. రోజూలానే వెంకట్ డ్యూటీకి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చాడు. రోజూ ఇంటికి రాగానే కొడుకుతో సరదాగా కాసేపు గడపటం వెంకట్‌కు అలవాటు.

  ఏ కన్నతండ్రికైనా ఇంతకు మించిన ఆనందం ఏముంటుంది. డ్యూటీ నుంచి వచ్చిన వెంకట్‌కు కొడుకు సంపత్ కనిపించలేదు. భార్య మాయాను కొడుకు గురించి అడిగితే ఆమె ఏం సమాధానం చెప్పడం లేదు. పిల్లాడు ఏమయ్యాడని వెంకట్ ఆమెను పదేపదే నిలదీయగా.. తానే బావిలో పడేశానని ఆమె చెప్పింది. భార్య మాటలు విన్న వెంకట్‌ షాకయ్యాడు. ‘పిల్లాడిని బావిలో పడేయటం ఏంటి.. ఏం మాట్లాడుతున్నావ్’ అని ప్రశ్నించాడు. తాను చెప్పింది నిజమేనని భార్య బదులిచ్చింది. దీంతో.. వెంకట్ హుటాహుటిన షిండే అనే వ్యక్తికి సంబంధించిన బావి వద్దకు వెళ్లి చూడగా పిల్లాడి శవం కనిపించింది.

  ఇది కూడా చదవండి: Married Woman: అర్ధరాత్రి 2 గంటలకు ఈమె బయటకు వెళ్లింది.. భర్తకు మెలకువ వచ్చి భార్య కోసం వెతకగా..

  కొడుకును అలా చూసిన వెంకట్ కుప్పకూలిపోయాడు. భోరున విలపించాడు. గుండెలవిసేలా రోదించాడు. పోలీసులు స్పాట్‌కు చేరుకుని పిల్లాడి మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీయించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారించగా కన్న కొడుకు హత్యకు ఒడిగట్టిన ఆ కసాయి తల్లి అసలు విషయం బయటపెట్టింది. మాయా, వెంకట్‌కు ఒక్కగానొక్క కొడుకు సంపత్.

  ఇది కూడా చదవండి: Vegetables in Dirty Water: వామ్మో.. ఏంది పెద్దాయన ఇది.. ఏం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా.. ఎక్కడంటే..

  భార్యాభర్తలిద్దరూ ఎప్పుడూ ఏదో ఒక విషయంలో గొడవ పడుతుండేవారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రోజురోజుకూ పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఎనిమిది రోజుల క్రితం ఓ చిన్న విషయంలో భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ గొడవను మనసులో పెట్టుకున్న మాయా భర్తపై కోపాన్ని కన్న కొడుకుపై చూపించింది. భర్త డ్యూటీకి వెళ్లగానే బాబును తీసుకుని నేరుగా బావి దగ్గరకు వెళ్లింది. ఎవరూ చూడకుండా పిల్లాడిని బావిలో పడేసింది. కొడుకు చనిపోయేంత వరకూ బావిలోకే చూస్తూ అక్కడే నిల్చుని ఉందంటే ఆమె ఎంత కర్కశంగా వ్యవహరించిందో తెలుస్తూనే ఉంది. ఆమె భర్త వెంకట్ ఫిర్యాదుతో మాయాను పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు.

  First published:

  Tags: Crime news, Maharashtra, Mother, Murder

  ఉత్తమ కథలు