అమెరికా (America) లోని అలబామాలో ఘోరం చోటుచేసుకుంది. నిద్రిస్తున్న యువతిపై కాల్పులు జరగడంతో అక్కడే దుర్మరణం (Kerala girl shot dead in Alabama) చెందింది. యువతిని కేరళ (Kerala) రాష్ట్రానికి చెందిన సుసాన్ మాథ్యూ (Mariam Susan Mathew)గా గుర్తించారు పోలీసులు. అయితే బాధితురాలు నిద్రిస్తుండగా పై అంతస్తు నుంచి బుల్లెట్లు సీలింగ్ గుండా యువతిపైకి దూసుకొచ్చాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అలబామా రాజధాని మోంట్‌గోమెరీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇంటి పై అంతస్తులో..
ఘటనపై మోంట్‌గోమెరీ పోలీసులు దర్యాప్తు (Investigation) ప్రారంభించారు. అమెరికాకు చెందిన మలంకర ఆర్థోడాక్స్ చర్చి డియోసెస్ ఆఫ్ సౌత్-వెస్ట్ ఫ్రాన్సిస్ జాన్సన్ పప్పాచన్ ( Fr Johnson Pappachan, of Malankara Orthodox Church Diocese of South-West America) దీనిపై ఓ ప్రకటన విడుదల చేశారు. మరియం సుసాన్ మాథ్యూపైకి తన ఇంటి పై అంతస్తులో (upper floor of her house) ఉన్న వ్యక్తి తుపాకీ (gun) నుంచి బుల్లెట్లు దూసుకొచ్చాయని, అవి నేరుగా మరియం సుసాన్‌కు తగిలాయని పేర్కొన్నారు. దీంతో ఆమె సంఘటనా స్థలంలోనే చనిపోయిందని (shot dead) ప్రకటించారు.
పతనంతిట్టా జిల్లాలోని నిరాణం..
కాగా, మరియం సుసాన్ మాథ్యూ కేరళ (Kerala)లోని పతనంతిట్టా జిల్లాలోని నిరాణంకు చెందిన బోబెన్ మాథ్యూ కుమార్తె. లీగల్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి యువతి మృతదేహాన్ని కేరళకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
గతంలో తెలుగు యువకుడు..
అమెరికాలో తెలుగు యువకుడి మీద కొందరు దుండుగులు గతంలో కాల్పులు జరిపారు. దోపిడీ కోసం వచ్చిన వారు అతడి వద్ద ఉన్న డబ్బు, కారు దోచుకోవడంతో పాటు అతడి మీద కాల్పులు జరిపి పరారయ్యారు. తెలంగాణకు చెందిన సాయికృష్ణ ఎలక్ట్రికల్ ఇంజినీర్. సౌత్ ఫీల్డ్ మిచిగాన్‌లోని లారెన్స్ టెక్నాలజీ యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. డెట్రాయిట్‌లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం జనవరి మూడో తేదీ రాత్రి 11.30 గంటల సమయంలో ఆఫీసు నుంచి బయటకు వచ్చాడు. తర్వాత తినడానికి రోడ్డు పక్కన ఆహారం కొన్నాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్దామనుకున్న సమయంలో కొందరు దోపిడీదొంగలు అడ్డుపడ్డారు.
కొందరు దోపిడీ దొంగలు గన్‌తో సాయికృష్ణను బెదిరించారు. అతని కారులో ఎక్కి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ అతని వద్ద ఉన్న కారు, పర్సు, ఇతర వస్తువులను తీసుకున్నారు. అంతటితో వదిలిపెట్టుకుండా అతడి మీద కాల్పులు జరిపి.. కారుతో పరారయ్యారు. రోడ్డు మీద వెళ్తున్న వారు.. అర్ధరాత్రి పూట చలిలో బుల్లెట్ గాయాలు తగిలిన సాయికృష్ణను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాధితుడిని డెట్రాయిట్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.